Live: 4వ రోజు శాసనమండలి సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 20, 2026 at 10:05 AM IST
|Updated : August 20, 2026 at 10:25 AM IST
AP Legislative Council Session 2026 Live : నేటితో శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు ముగియనున్నాయి. ఇవాళ అసెంబ్లీలో సూపర్ సిక్స్ పథకాల అమలుపై చర్చిస్తున్నారు. కాగా అసెంబ్లీలో ఇప్పటికే పలు బిల్లులు ఆమోదం పొందాయి. వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ కమిటీ నివేదికను ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. జలకాలుష్య నివారణ చట్టాన్ని, ఆమోద తీర్మానాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రవేశపెట్టారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును కూడా ఆయనే సభ ముందుకు తెచ్చారు. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ బిల్లును మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో సూపర్ సిక్స్ హామీలపై సభలో లఘు చర్చ జరుగుతోంది. శాసనమండలిలో పీఎం విద్యాలక్ష్మి పథకం, గోదావరి పుష్కరాలకు నిధులపై ప్రశ్నలకు మంత్రుల సమాధానం ఇస్తున్నారు. కాపు కార్పొరేషన్‌కు నిధులు, విద్య హక్కు చట్టం, మహిళలకు ఆర్థికసాయం ప్రశ్నలకు మంత్రులు బదులిస్తున్నారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను మండలిలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం శాసనమండలి సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.