LIVE : హనుమకొండలో పవన్ కల్యాణ్ పర్యటన - ప్రత్యక్షప్రసారం - AP DEPUTY CM IN WARANGAL
🎬 Watch Now: Feature Video

Published : June 17, 2026 at 11:02 AM IST
|Updated : June 17, 2026 at 2:43 PM IST
AP Deputy CM Pawan Kalyan in Warangal : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈరోజు హనుమకొండలో పర్యటిస్తున్నారు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ, తీవ్ర అనారోగ్యం పాలైన నిరంజన్(17) అనే బాలుడిని ఆయన పరామర్శించారు. అనంతరం వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోనున్నారు. తన అభిమాన హీరో పవన్‌కల్యాణ్‌ను కలవాలనేది ఆ బాలుడి కోరిక అని సోషల్ మీడియా ద్వారా ఆయనకు తెలియడంతో ఈ మేరకు హనమకొండ పర్యటన ఖరారైంది. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో పవన్ కల్యాణ్ అధికార కాంగ్రెస్ పార్టీ మధ్యలో మాటల యుద్ధం కొనసాగింది. తనను తెలంగాణకు రావొద్దని కొంతమంది బెదిరింపులకు గురిచేస్తున్నారని పవన్ ఓ నేషనల్ మీడియా ఇంటర్య్వూలో చెప్పారు. తెలంగాణకు రావొద్దని ఎవరూ అనలేదని ప్రభుత్వంలో అగ్రనాయకులు చెబుతున్నారు. గతంలో కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయానికి వస్తే ప్రోటోకాల్ ఇచ్చి మరి భద్రత కల్పించామని గుర్తుచేశారు.