Live: అసెంబ్లీ సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం - AP ASSEMBLY SESSION TODAY LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail
AP Assembly Session Today Live (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 4, 2026 at 9:05 AM IST

|

Updated : March 4, 2026 at 6:39 PM IST

1 Min Read
Choose ETV Bharat

AP Assembly Session Today Live : నాలుగు రోజుల విరామం తరువాత అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నేటి నుంచి పునఃప్రారంభమయ్యాయి. బడ్జెట్‌ సమావేశాలు 13వ రోజులో భాగంగా నేడు ప్రభుత్వం శాసనసభలో 3 బిల్లులు ప్రవేశ పెట్టింది. మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీపీఎస్సీ చట్ట సవరణ బిల్లును ప్రవేశ పెట్టారు. హోం మంత్రి అనిత అగ్నిమాపక సేవా సవరణ బిల్లును, మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ జన విశ్వాస్ నిబంధనల సవరణ బిల్లును ప్రవేశ పెట్టారు. శాఖల వారీగా పద్దులపై చర్చ - ఆమోదం కొనసాగతోంది. 

పరిశ్రమలు, పర్యాటకం, అబ్కారీ, రవాణా, కార్మిక, విద్య, ఆరోగ్యం శాఖలపై మంత్రులు టీజీ భరత్, దుర్గేష్, కొల్లు రవీంద్ర, మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి, వాసంశెట్టి శుభాష్, నారా లోకేశ్, సత్యకుమార్ యాదవ్​లు చర్చను చేపట్టారు. మంత్రులు గొట్టిపాటి రవి కుమార్, బీసీ జనార్దన్ రెడ్డిలు విద్యుత్, ఆర్ అండ్ బీ శాఖల వార్షిక నివేదికలు సభలో ప్రవేశ పెట్టారు. 

అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో భాగంగా వీబీ - జీ రామ్ జీ జాబ్ కార్డులు, పీపీపీ మోడల్ కింద వైద్య కళాశాలలు, రెవెన్యూ శాఖ పెండింగ్ కేసులు, సింహాచలం పంచ గ్రామాలలో అనధికారిక నిర్మాణాలు, విశాఖపట్నం జిల్లాలో పరిశ్రమలు పై ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇస్తున్నారు. కోనసీమలో ఎమ్ఎస్ఎమ్ఈ పార్కులు, వరి రైతుల కష్టాలు, గృహనిర్మాణ కాలనీలలో మౌలిక సదుపాయాలు, విశాఖ ఉక్కు కర్మాగారం, 2014-2019 మధ్య కాలంలో పక్కా గృహాల బిల్లులు తదితర ప్రశ్నలకు అమాత్యుల సమాధానాలు ఇచ్చారు. అసెంబ్లీలో నేడు తిరుమల లడ్డూ ప్రసాదం పై ప్రభుత్వ ప్రకటన - చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం.

Last Updated : March 4, 2026 at 6:39 PM IST

ABOUT THE AUTHOR

...view details