LIVE: అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం - ASSEMBLY SESSIONS LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail
Assembly Sessions Live (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 18, 2026 at 9:17 AM IST

|

Updated : February 18, 2026 at 2:04 PM IST

1 Min Read
Choose ETV Bharat

Assembly Sessions Live : నేడు ఐదవ రోజు అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2026-27 వార్షిక బడ్జెట్‌పై ఉభయ సభల్లో చర్చ కొనసాగుతుంది. ప్రభుత్వం శాసనసభలో వివిధ బిల్లులు ప్రవేశ పెట్టనుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ సవరణ బిల్లు ప్రవేశ పెట్టారు. అలోపతి ప్రైవేట్ వైద్య సంరక్షణ సంస్థల సవరణ బిల్లును మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రవేశ పెట్టారు. అనంతరం దేవదాయ శాఖ సవరణ బిల్లును మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రవేశ పెట్టారు. వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ సవరణ బిల్లును మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రవేశ పెట్టారు. 

అసెంబ్లీలో నేటి ప్రశ్నోత్తారాల్లో ఆడబిడ్డ నిధి పథకం, 50 పడకల ఆసుపత్రులను, 100 పడకల ఆసుపత్రులుగా ఉన్నతీకరణపై ప్రశ్నలు అడుగుతున్నారు. పరిశ్రమలకు భూ కేటాయింపు, గుడివాడ నియోజకవర్గంలో పి.హెచ్.సి భవనాలు, రహదారులకు ఇరువైపులా పచ్చదనం పై ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇస్తున్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో తాగునీటి కొరత, రాజోలు నియోజకవర్గం రైతులకు ఆర్థిక సాయం, తిరువూరులోని రామన్నపాలెం గ్రామంలో సర్వే నం. 22లో వున్న భూ విస్తీర్ణం, మాజీ సైనికుల భూమిలపై సభ్యులు ప్రశ్నలు అడిగారు. నేడు మాజీ ఎమ్మెల్సీ ఐలాంపురం వెంకయ్య మృతికి శాసనమండలి సంతాపం తెలపింది. ఐసీడిఎస్ ప్రాజెక్టు కార్యాలయాలకు సొంత భవనాలు, మిషన్ వాత్సల్య, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో అవకతవకలు, బీ.సీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో అదనపు సెక్షన్లు, కాపు సామాజికవర్గానికి బీ.సీ హోదా తదితర ప్రశ్నలకు అమాత్యుల సమాధానాలు ఇస్తున్నారు. ప్రస్తుతం నేటి అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.

Last Updated : February 18, 2026 at 2:04 PM IST

ABOUT THE AUTHOR

...view details