LIVE: శాసనమండలి సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం - ASSEMBLY BUDGET SESSION 2026
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 4, 2026 at 10:09 AM IST
|Updated : March 4, 2026 at 4:32 PM IST
Andhra Pradesh Legislative Council LIVE: తిరుమల ప్రసాదం కల్తీపై శాసనమండలిలో ప్రకటనను ప్రభుత్వం సభ్యులకు పంపిణీ చేసింది. కల్తీపై సమగ్ర వివరాలతో 20పేజీల ప్రకటన పంపిణీ చేసింది. లడ్డూ చారిత్రక నేపథ్యం, ప్రామాణిక పదార్థాలు, పోటు-మిరాసీ వ్యవస్థ అంశాలను ప్రభుత్వం ప్రకటనలో వివరించింది. 2014-19మధ్య టెండర్ నిబంధనలు 2020లో నిబంధనల సడలింపు సవివరంగా ప్రభుత్వం వివరించింది. మారిన టెండర్ నివేదికలో మార్పులను ప్రభుత్వం స్పష్టం చేసింది. నాటి అదనపు ఈవో ధర్మారెడ్డి, ఈవో అనీల్ కుమార్ సింఘాల్ సిఫార్సు ల పై అప్పటి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిబంధనల సడలింపును అప్పటి బోర్డు ఆమోదించిందని ప్రభుత్వం స్పష్టం చేసింది. నెయ్యి కల్తీ గుర్తింపు, ల్యాబ్ నివేదికలను ప్రభుత్వం వివరించింది. నివేదిక ఆధారంగా ప్రసాదo కల్తీ జరిగిందని కేసు నమోదు చేసి సమగ్ర విచారణకు ఆదేశించినట్టు ప్రభుత్వం తెలిపింది. ఛార్జ్ షీట్ దాఖలు, చట్టపరమైన చర్యలు ప్రకటనలో వివరించింది. 2020లో టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పన్న కల్తీ నెయ్యి సరఫరాదారులను బెదిరించి, అంగీకరీంచని వారిని తనిఖీ ల పేరుతో లొంగదీసుకుని రూ.4.69కోట్లు లంచం రూపంలో తీసుకున్నట్లు విచారణలో రుజువైనట్లు ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం 36మంది నిందితుల్లో బోలెబాబా ఉద్యోగులు ఆశిష్ రోహిలా, మహేష్ కుమార్ రోహిలా, బత్తుల సురేంద్ర నాథ్ నేరాన్ని అంగీకరించారని, విజయభాస్కర్ రెడ్డి అనే డయిరీ నిపుణుడు కూడా తప్పుడు సలహాలు ఇచ్చి రూ.75లక్షల ఆర్ధిక లబ్ది పొందినట్లు ప్రభుత్వం తెలిపింది. ఏకసభ్య కమిటీ సిఫార్సులు వ్యస్థాగత సంస్కరణలపై ఇచ్చే నివేదిక ఆధారంగా తదనంతర చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం నేటి శాసనమండలి సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం.