LIVE: అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల కేశవ్​ - ప్రత్యక్ష ప్రసారం - AP ASSEMBLY BUDGET SESSION 2026

🎬 Watch Now: Feature Video

thumbnail
AP Assembly Budget Session LIVE (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 14, 2026 at 11:22 AM IST

|

Updated : February 14, 2026 at 12:35 PM IST

1 Min Read
Choose ETV Bharat

AP Assembly Budget Session LIVE: శాసనసభలో ఎన్డీయే ప్రభుత్వం బడ్జెట్​ను ప్రవేశపెట్టింది. ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ సమర్పించారు. సీఎం అధ్యక్షతన కేబినెట్‌ 2026-27 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. రాష్ట్ర మంత్రి వర్గం దాదాపు రూ. 3.46 లక్షల కోట్ల అంచనాతో దీన్ని రూపొందించారు. ఎన్నికల మ్యానిఫెస్టోకు అనుగుణంగా ఫలితాలు రాబట్టేలా బడ్జెట్ కేటాయింపులు చేపట్టారు. సూపర్ సిక్స్ పథకాలు, పోలవరం ప్రాజెక్టు సహా అన్ని ప్రాంతాలకూ సాగు, తాగునీటి భరోసా ఇచ్చే సాగునీటి ప్రాజెక్టులు, అమరావతి నిర్మాణం, రహదా రులు, మౌలిక సౌకర్యాల కల్పనే ధ్యేయంగా బడ్జెట్ స్వరూపం ఉంది. మూడు ఆర్థిక జోన్లు, రాయలసీమ ఉద్యానహబ్ లాంటి అంశాలకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చారు. వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టాక ఉభయ సభలు వాయిదా పడనున్నాయి. ఈ నెల 17న బడ్జెట్‌పై చర్చ అజెండాగా  ఉభయ సభలు ప్రారంభమవనున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీలో బడ్జెట్​ సమావేశం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.

Last Updated : February 14, 2026 at 12:35 PM IST

ABOUT THE AUTHOR

...view details