LIVE: అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం - ASSEMBLY SESSIONS LIVE

🎬 Watch Now: Feature Video

thumbnail
AP Legislative Assembly Sessions Live (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 19, 2026 at 9:02 AM IST

|

Updated : February 19, 2026 at 2:00 PM IST

1 Min Read
Choose ETV Bharat

AP Legislative Assembly Sessions Live : నేడు ఆరో రోజు అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2026-27 వార్షిక బడ్జెట్‌పై ఉభయ సభల్లో చర్చ కొనసాగుతుంది. ప్రభుత్వం శాసనసభలో వివిధ బిల్లులు ప్రవేశపెట్టింది. అనంతరం బడ్జెట్ చర్చపై  నేడు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానం ఇచ్చారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా కర్నూలు క్లస్టర్ విశ్వవిద్యాలయం, ప్రభుత్వ రుణాలు, క్రైస్తవ సంస్థల ఆస్తుల పరిరక్షణ, పి.గన్నవరం నుండి గోపాలపురం వరకు గోదావరి కరకట్ట పునరుద్ధరణ, రాష్ట్రంలో సైబర్ నేరాలుపై ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, ఏపీఈపిడీసీఎల్ లో లైన్మెన్ల కొరత, పాత ఎడ్లంకలో భూక్రమక్షయం, అమరావతి అంతరవలయ రహదారి, సమగ్ర శిక్షా అభియాన్ ఒప్పంద ఉద్యోగులు తదితర ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు చెప్పారు. నిన్న పంచాయతీరాజ్ చట్టంలో జనవరి 1తో పాటు ఏప్రిల్ 1, జులై 1, అక్టోబర్ 1 తేదీలకు 18 ఏళ్లు నిండిన వారికి ఓటర్​గా నమోదుకు అవకాశం కల్పిస్తూ పంచాయతీరాజ్ చట్టంలో సవరణ చేస్తూ బిల్లు రూపొందించారు. ఈ మేరకు మంత్రి దుర్గేశ్​ సవరణ బిల్లు ప్రవేశపెట్టారు. అనంతరం పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం నేటి అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.

Last Updated : February 19, 2026 at 2:00 PM IST

ABOUT THE AUTHOR

...view details