LIVE: శాసనమండలి సమావేశాలు 2026 - ప్రత్యక్ష ప్రసారం - BUDGET SESSION LIVE
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 25, 2026 at 10:41 AM IST
|Updated : February 25, 2026 at 1:46 PM IST
LIVE: బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజూ నుంచి మండలిలో వాడివేడిగా చర్చలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ సభ్యులు కల్తీ లడ్డూ వ్యవహారంపై సభను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఐదు రోజుల పాటు సభ కార్యక్రమాలు నిలిచిపోయాయి. అయితే తిరుమల లడ్డూ వ్యవహారంపై చర్చిస్తామని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోవటంతో అప్పటి నుంచి సభ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. మంగళవారం నాడు రాష్ట్రంలో శాంతి భద్రతలపై చర్చ జరిగింది. శాంతిభద్రతలు కాపాడతామనే నమ్మకంతోనే కూటమి పార్టీలను ప్రజలు గెలిపించారని, శాంతిభద్రతలు కాపాడటమంటే పరిపాలన బాధ్యతే కాదని అని రాజ్యాంగబద్ధమైన కర్తవ్యమని హోంమంత్రి అనిత అన్నారు. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో శాంతిభద్రతలు లేకనే పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లారని నేడు పరిస్థితులు బాగుండటం వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు 25 శాతం వరకు తగ్గాయని మంత్రి తెలిపారు. మండలి సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.