LIVE: ఏపీ బడ్జెట్ సమావేశాలు 2026 - ప్రత్యక్ష ప్రసారం - ASSEMBLY BUDGET SESSION 2026
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 25, 2026 at 9:34 AM IST
|Updated : February 25, 2026 at 2:38 PM IST
LIVE: పదో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఏపీ మెట్రో రైల్ సంస్థ నివేదికను మంత్రి నారాయణ సభలో ప్రవేశ పెట్టనున్నారు. తిరుపతి పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ వార్షిక నివేదికనూ సభలో పెట్టనున్నారు. అసెంబ్లీలో శాఖల వారీగా బడ్జెట్ పద్దులపై చర్చ జరగనుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిరోజు పలు అంశాలపై లఘు చర్చ చేపట్టాలని సూచించారు. సభ్యులందరూ ఆయా అంశాలపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. ప్రతిరోజూ పరీక్ష అనే స్పృహతో మంత్రులు, ఎమ్మెల్యేలు పూర్తిస్థాయిలో సన్నద్ధమై అసెంబ్లీకి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఏదైనా అంశాన్ని సభలో ఒకసారి సమర్థంగా ప్రజంట్ చేయగలిగితే అది ఏడాదిపాటు ఇంంటింటికీ తిరిగి చెప్పేదానికి సమానంగా ఉంటుందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సభలో విషయాన్ని ఎంత ప్రభావవంతంగా ప్రస్తావిస్తున్నారు? వారి ప్రజంటేషన్ ఎలా ఉందనేదానిపై ‘ఏఐ’ ద్వారా విశ్లేషిస్తున్నామని చెప్పారు. బడ్జెట్ పద్దులపైనా మంత్రులు పూర్తిస్థాయిలో సన్నద్ధమై వచ్చి సభలో సమాధానాలివ్వాలన్నారు. అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిద్దాం