శిర్డీ సాయిని దర్శించుకున్న ప్రముఖ నటి జయప్రద - JAYAPRADHA VISITS SHIRIDI

🎬 Watch Now: Feature Video

thumbnail
షిర్డీ సాయిని దర్శించుకున్న ప్రముఖ నటి జయప్రద (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : December 5, 2025 at 5:25 PM IST

1 Min Read
Choose ETV Bharat

Jayapradha Visit Shirdi : ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద శుక్రవారం శిర్డీ సాయిబాబాను దర్శించుకున్నారు. ఇవాళ శిర్డీ వెళ్లిన ఆమె, మధ్యాహ్నం సాయిబాబా హారతికి కూడా హాజరయ్యారు. సాయి సంస్థాన్​ తరపున నటికి శాలువా కప్పి, సత్కరించారు. అలాగే ఆమెకు సాయి విగ్రహం అందించారు.  

శిర్డీకి వచ్చి సాయిబాబాను దర్శించుకున్నందుకు తనకు ఎంతో సంతృప్తి కలిగిందని జయప్రద అన్నారు. సాయిబాబా హారతి పాట విన్న ఆమె తన జీవితంలో ఇంకేమి అక్కర్లేదని మీడియాతో తెలిపారు. "బాలీవుడ్​కు వచ్చినప్పటి నుంచి, ఎన్నోసార్లు శిర్డీకి దర్శనం చేసుకునేందుకు వచ్చాను. ఈ రోజు హారతికి హాజరయ్యే అవకాశం వచ్చింది. హారతిలో పాల్గొనడం ద్వారా నాకు ఎంతో సంతృప్తి కలిగింది. ఇప్పటికే చాలా సార్లు నేను ఇక్కడికి వచ్చాను. మొదట్లో ఇన్ని సౌకర్యాలు లేవు. కానీ ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది. సాయిను దర్శించుకోడానికి వచ్చే వీఐపీలకు, సాధారణ భక్తులకు సాయిసంస్థాన్​ వారు మంచి ఏర్పాట్లు చేశారు. ఇంత రద్దీ ఉన్నప్పటికీ, భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకుంటున్నారు" అని ఆమె తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details