భజన కార్యక్రమానికి అనుమతి నిరాకరణ - పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా - VILLAGERS PROTEST IN ACHAMPALLI
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 18, 2026 at 7:50 PM IST
Achampalli Villagers Protest in Front of Police Station : శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలోని దిగువ అచ్చంపల్లి గ్రామస్తులు స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. గ్రామంలో జాతర సందర్భంగా నిర్వహించనున్న చెక్కభజన కార్యక్రమానికి చివరి నిమిషంలో పోలీసులు అనుమతి నిరాకరించడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు గ్రామంలోని కొంతమందిపై సీఐ సుబ్రహ్మణ్యం చేయి చేసుకున్నాడంటూ ఆరోపిస్తూ మహిళలు, యువకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు అధికారికంగా ఉత్తర్వులు వెలువడక ముందే గ్రామస్థులు చెక్కభజన మొదలుపెట్టడంతో పోలీసులకు గ్రామస్థులకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ రావడంతో గొడవ జరిగిందని పెనుగొండ డీఎస్పీ నరసింగప్ప తెలిపారు. సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరిస్తామని డీఎస్పీ తెలిపారు.
" గ్రామాల్లో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నా డీఎస్పీ స్థాయి అధికారి అనుమతి కావాలి. అది కూడా అన్ని పరిశీలించాకే అనుమతి ఇస్తారు. పోలీసులకు గ్రామస్థులకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ రావడంతో ఈ గొడవ జరిగింది. సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరిస్తాం." - నరసింగప్ప, డీఎస్పీ