VIDEO VIRAL : బెంజ్ కారుతో బీభత్సం - బానెట్‌పై కానిస్టేబుల్‌ను ఈడ్చుకెళ్లిన యువకుడు - BENZ CAR HAL CHAL IN HYDERABAD
🎬 Watch Now: Feature Video

Published : March 2, 2026 at 2:25 PM IST
Drunk Man Created Stir with Benz Car : హైదరాబాద్ గచ్చిబౌలిలో ఆదివారం ఉదయం ఓ బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడుపుతూ రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఢీకొట్టడమే కాకుండా, ఆపడానికి ప్రయత్నించిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను బానెట్‌పై ఈడ్చుకెళ్లిన ఘటన నగరంలో కలకలం రేపింది. నార్సింగికి చెందిన గుర్రంపాటి తరుణ్ అనే యువకుడు మద్యం మత్తులో తన బెంజ్ కారును అతివేగంగా నడుపుతూ నానక్‌రాంగూడ వద్ద ఓ కారును బలంగా ఢీకొట్టాడు. దాంతో కారు నియంత్రణ కోల్పోయి డివైడర్‌ను ఢీకొంది. అయినప్పటికీ తరుణ్ తన కారును ఆపకుండా గచ్చిబౌలి ఓఆర్ఆర్ వైపు వెళ్లడానికి ప్రయత్నించాడు.
ఈ ప్రమాదాన్ని గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ నర్సింహులు, కారును ఆపేందుకు ప్రయత్నించారు. నిందితుడు మాత్రం కారును ఆపకుండా మరింత వేగం పెంచి కానిస్టేబుల్వైపు దూసుకెళ్లాడు. ఈ క్రమంలో తనను తాను రక్షించేందుకు కానిస్టేబుల్ కారు బానెట్‌ను పట్టుకోగా, అతడిని కింద పడేసేందుకు కారును జిగ్-జాగ్గా నడిపిస్తూ బీభత్సం సృష్టించాడు. చివరికి ఇతర వాహనదారులు సాహసించి కారుకు అడ్డంగా తమ వాహనాలను అడ్డు నిలిపి తరుణ్‌ను పట్టుకున్నారు. పోలీసులు పరీక్షించగా మద్యం సేవించినట్లు నిర్ధారణ అయింది. గచ్చిబౌలి పోలీసులు నిందితుడిపై మోటార్ వాహనాల చట్టంతో పాటు, విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి ప్రాణాలకు ముప్పు కలిగించడంతో రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. అనంతరం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా అతడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
'నిద్ర లేమి, తలనొప్పి' ఈ సైలెంట్ కిల్లర్ లక్షణాలు- ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుందంటే!
మధుమేహ రోగులకు మంచి మందులు! - ప్రీ డయాబెటిక్ పూర్తిగా తగ్గిపోతుందా?