శాసనసభలో అక్బరుద్దీన్ వర్సెస్ ఏలేటి - MIM VS BJP IN TELANGANA ASSEMBLY
🎬 Watch Now: Feature Video

Published : January 6, 2026 at 8:24 PM IST
MIM vs BJP in Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు కొనసాగాయి. ఇవాళ హిల్ట్ పాలసీపై చర్చ సందర్భంగా అక్బరుద్దీన్ ఓవైసీ బీజేపీని విమర్శించారు. బీజేపీ వాషింగ్‌మెషీన్‌లా మారిందని, ఎంత దోచుకున్నా... ఏం చేసినా బీజేపీ సభ్యత్వం తీసుకుంటే చాలు క్లీన్‌గా మారిపోతారని ఆరోపించారు. తెలంగాణ రైజింగ్‌కు తమ పార్టీ మద్దతు ఉంటుందని ప్రకటించారు. అలాగే పాతబస్తీలో రోడ్లు విస్తరణ, ఆస్పత్రులు నిర్మాణం, ఫ్లైఓవర్లు కట్టాలని సభలో సూచించారు. అలాగే ఆలయాలు, మసీదులు, పవిత్రస్థలాలకు దగ్గరగా ఉన్న మద్యం దుకాణాలకు అనుమతులు ఇవ్వొద్దని, పాఠశాలలకు దగ్గరగా పాన్ షాప్‌లు నిర్వహించకుండా చూడాలని కూడా అక్బరుద్దీన్ కోరారు. అయితే ఓవైసీ వ్యాఖ్యలపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైసీ పదే పదే రోజు కేంద్రాన్ని, ప్రధాని మోదీని విమర్శించడం సరికాదన్నారు. పదే పదే సీబీఐ, ఈడీ అంటున్న అక్బరుద్దీన్ ఆస్తులపై సీబీఐ విచారణ జరపాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.