VIDEO VIRAL : ఆలయం చుట్టూ తాబేలు ప్రదక్షిణ - సోషల్​ మీడియాలో వీడియో వైరల్​ - TORTOISE CIRCUMAMBULATED TEMPLE

🎬 Watch Now: Feature Video

thumbnail
నూకాంబిక అమ్మవారి ఆలయం చుట్టూ తాబేలు ప్రదక్షిణ (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : March 10, 2026 at 3:11 PM IST

1 Min Read
Choose ETV Bharat

Tortoise Circumambulated Nookambika temple at Antargam : పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం అంతర్గాం గ్రామంలోని బర్మా కాందీశీకుల ఇలవేల్పు నూకాంబిక ఆలయం వద్ద ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. ప్రతి ఏటా ఉగాది పర్వదినం ముందు రోజు నూకాంబిక అమ్మవారి జాతర పెద్ద ఎత్తున జరుపుకుంటారు. నూకాంబిక అమ్మవారి ఆలయం చుట్టూ ఓ తాబేలు (కూర్మం) తిరగడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. తాబేలు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. దీంతో ఏకంగా శ్రీమహావిష్ణువు అమ్మవారి వద్దకు వచ్చాడని, అక్కడి బర్మా కాందీశీకులు అదృష్టంగా భావిస్తున్నారు. ఈసారి అమ్మవారి అనుగ్రహం కలిగిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఆ తాబేలు గుడి చుట్టూ కొన్ని ప్రదర్శనలు చేసి కనిపించకుండా పోయింది. గత 40 ఏళ్లుగా అమ్మవారి జాతరను వైభవంగా నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం అమ్మవారి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉపవాస దీక్షలు ప్రారంభించారు. ఈ సమయంలో ఇలాంటి సంఘటన జరగడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details