LIVE: కాకినాడ జిల్లా: ఘటనాస్థలానికి చేరుకున్న సీఎం చంద్రబాబు - BLAST IN KAKINADA
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 28, 2026 at 5:26 PM IST
|Updated : February 28, 2026 at 8:54 PM IST
Explosion In Kakinada District : కాకినాడ జిల్లాలోని సమార్లకోట మండలంలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ నేపథ్యంలో మండలంలోని వేట్లపాలెం పరిది గోదావరి కాలువ పక్కన ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ పరిశ్రమలో శనివారం సుమారు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 21మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో 15 మందికి గాయాలపాలయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు సమాచారం. పేలుడు ధాటికి మృతదేహాలు పంటపొలాల్లోకి ఎగిరిపడ్డాయి. ఈ నేపథ్యంలో మంటలు భారీ ఎత్తున ఎగసిపడటంతో ఈ ప్రాంతమంతా పొగలు వ్యాపించాయి. దీనికి సంబంధించిన పేలుడు శబ్ధం దాదాపు 5 కిలోమీటర్ల వరకు వ్యాపించిందని స్థానికులు అంటున్నారు. శబ్ధతీవ్రతకు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలంతా ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. పక్క గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాల స్లాబ్‌కు పగుళ్లు వచ్చాయి. సమాచారం అగ్నిమాపక శాఖకు చేరుకోగానే 2 ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పేందుకు యత్నించారు. ఈ ప్రమాదంలో గాయాలపాలైన వారిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వివరాలకు 'ఈటీవీ భారత్' ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షిద్దాం.