'భార్యను కాపురానికి పంపించాలి' - రేడియో స్టేషన్ టవర్ ఎక్కి వ్యక్తి హల్చల్ - SUICIDE ATTEMPT FROM CELL TOWER
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : April 25, 2026 at 12:46 PM IST
A Husband Suicide Attempt From Cell Tower : కర్నూలు జిల్లా ఆదోనిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తన భార్యను కాపురానికి పంపాలంటూ ఓ యువకుడు నానా హంగామా సృష్టించాడు. రేడియో స్టేషన్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. చిప్పగిరి మండలం నేమ్మకల్లు గ్రామానికి చెందిన సురేంద్ర కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, అతడిని క్షేమంగా కిందకు దింపేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ వింత సంఘటనను చూసేందుకు స్థానికులు భారీగా తరలి రావడంతో ఆ ప్రాంతంలో భారీగా రద్దీ పెరిగి, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు సురేంద్రకు నచ్చజెప్పి కిందికి దించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారాయి. భార్య పై తనకు ఉన్న ప్రేమను ఈ విధంగా చూపించాడంటూ కొందరూ కామెంట్ల రూపంలో తన అభిప్రాయాన్ని తెలుపుతున్నారు.