'నాన్న బండి దాచాడు సార్' - పోలీసులకు చెప్పేసిన ఆరేళ్ల పిల్లాడు
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : August 21, 2026 at 11:44 AM IST
Child Informs Police Hidden Bike in Nellore : నెల్లూరు జిల్లా అనంతసాగరంలో ఓ సరదా సంఘటన జరిగింది. సరైన పత్రాలు లేని వాహనాల కోసం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇది గమనించిన సురేంద్ర అనే వ్యక్తి తన బైక్‌ను ఇంట్లో ఎవరికీ కనిపించకుండా దాచాడు. అదే సమయంలో అతని ఆరేళ్ల కొడుకు మహేంద్ర బయటకు వెళ్దామని మారం చేశాడు. తండ్రి ఎంతకీ పట్టించుకోలేదు. దాంతో కోపం వచ్చిన ఆ బుడతడు నేరుగా పక్క వీధిలో ఉన్న పోలీసుల వద్దకు పరుగెత్తాడు. సుమారు 50 మీటర్ల దూరం వెళ్లి, తన తండ్రి బండి దాచాడంటూ ముద్దుముద్దు మాటలతో పోలీసులకు కంప్లైంట్ చేశాడు.
ఆ పిల్లాడి మాటలకు నవ్వుకున్న పోలీసులు నేరుగా సురేంద్ర ఇంటికి వెళ్లారు. గుట్టుచప్పుడు కాకుండా దాచిన బైక్‌ను పట్టుకున్నారు. కొడుకు చేసిన పనికి తండ్రి బిత్తరపోయాడు. ఆ పిల్లాడి అమాయకత్వానికి పోలీసులతో పాటు స్థానికులంతా పగలబడి నవ్వారు. పిల్లల కళ్లుగప్పి ఇంట్లో ఏదీ దాయలేమని అక్కడున్న వారంతా సరదాగా నవ్వుకున్నారు.