యానాంలో జనవరి 6 నుంచి ఫల పుష్ప ప్రదర్శన - ఏర్పాట్లు చేస్తున్న అధికారులు - YANAM 24TH FLOWER SHOW ARRANGEMENTS

🎬 Watch Now: Feature Video

thumbnail
కాకినాడ జిల్లాలో 24వ ఫల పుష్ప ప్రదర్శనకు ఏర్పాట్లు (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : January 3, 2026 at 7:37 PM IST

1 Min Read
Choose ETV Bharat

Yanam 24th Flower Show Arrangements : కేంద్రపాలిత యానాంలో పుదుచ్చేరి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు పర్యావరణంపై అవగాహన, గృహిణులకు మొక్కల పెంపకంపై ఆసక్తిని కలిగించేందుకు గడచిన 23 ఏళ్లుగా ఫల పుష్ప ప్రదర్శనను నిర్వహిస్తోంది. ప్రతి ఏటా జనవరి 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మూడు రోజులపాటు నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనను ఈ ఏడాది మాత్రం 9వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు నిర్వహించేందుకు యానాం వ్యవసాయ శాఖ అందుకు తగిన ఏర్పాట్లను సిద్ధం చేస్తోంది. స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో ప్రకృతి, పుష్ప ప్రేమికులను ఆకర్షించే విధంగా వేదికను సిద్ధం చేస్తున్నారు. బెంగళూరు, పూణే, కడియం నర్సరీల నుంచి తీసుకువచ్చిన అరుదైన సుమారు రెండు లక్షల వివిధ జాతుల పూల మొక్కలు ఈ ప్రదర్శనలో నాలుగు రోజులపాటు కొలువుదీరనున్నాయి. వీటితోపాటు పూలతో రాజహంస, నెమలి అలంకరణలు ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. స్థానికంగానూ పెంచిన బంతి చామంతి, ఇతర జాతుల పూలు ఆకట్టుకుంటాయి.

ABOUT THE AUTHOR

...view details