అవనిగడ్డ డిపోలో 20 అద్దె బస్సులు నిలిపివేత - ఇబ్బందుల్లో ప్రయాణికులు - అవనిగడ్డలో అద్దె బస్సులు నిలిపివేత
🎬 Watch Now: Feature Video

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 25, 2026 at 1:33 PM IST
Drivers And Conductors At The Avanigadda RTC Depot Stopped Hired Busses : కృష్ణా జిల్లా అవనిగడ్డ ఆర్టీసీ డిపోలో డ్రైవర్లు, కండక్టర్లు కొన్ని అద్దె బస్సులను నిలిపివేశారు. ఉచిత బస్సు పుణ్యమా అని అధిక సంఖ్యలో మహిళలు ప్రయాణాలు చేస్తుండడంతో ఆర్టీసీ బస్సులు రద్దీగా మారుతున్నాయి. ఈ క్రమంలో బస్సును స్టాప్‌లో ఆపలేదనో, సీట్లు దొరకలేదనో, నిలబడే విషయంలోనూ, సర్దుబాటు విషయంలోనూ ఇలా అనేక కారణాలతో తరచూ డ్రైవర్లు, కండక్టర్లతో ప్రయాణికులు వివాదానికి దిగుతున్న ఘటనలు గత కొంతకాలంగా అధికంగా ఉన్నాయి. అంతే కాకుండా కొన్నిచోట్ల ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లపై దాడి చేయడానికి కూడా వెనుకాడట్లేదు. తరచుగా ఇటువంటి పరిస్థితులు తలెత్తడంతో ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు అవనిగడ్డ డిపోలో సుమారు 20 వరకు అద్దె బస్సులు నిలిపివేసారు. అవనిగడ్డ నుంచి విజయవాడ, మచిలీపట్నం ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.