శ్రీవారిపై అపార భక్తి - 116 ఏళ్ల వయసులో అలిపిరి మెట్లు ఎక్కిన బామ్మ - 116 YEAR OLD CLIMBS ALIPIRI

🎬 Watch Now: Feature Video

thumbnail
శ్రీవారిపై అపార భక్తి - 116 ఏళ్ల వయసులో అలిపిరి మెట్లు ఎక్కిన బామ్మ (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 4, 2026 at 7:04 PM IST

1 Min Read
Choose ETV Bharat

116 Year Old Climbs Alipiri : ఓ బామ్మ వయసు 116 సంవత్సరాలు. ఆ వయసులో ఆమె ఏకంగా తిరుమల అలిపిరి మెట్లు ఎక్కి శ్రీవారిని దర్శించుకునేందుకు బయలుదేరింది. ఈ ఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తన కుటుంబ సభ్యుల ఆసరా తీసుకుని ఆ బామ్మ మెట్లు ఎక్కుతూ కనిపించింది. ఈ వయసులో కూడా ఆ ఏడుకొండల వాడిపై ఆమెకు ఉన్న భక్తి చూసి తోటి భక్తులు అబ్బురపడ్డారు. మెట్ల మార్గంలోని స్థానిక దుకాణదారులు ఈ దృశ్యాన్ని వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా నెట్టింట వైరల్​గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 116 ఏళ్ల వయసులోనూ ఆ శ్రీనివాసుడిపై బామ్మకు ఉన్న అపారమైన భక్తిని కొనియాడుతున్నారు. ఇంత వయసులో కూడా ఎంతో ఓపికగా మెట్లు ఎక్కుతున్న బామ్మను చూసి 'గోవిందా, గోవిందా' అంటూ నామస్మరణతో హోరెత్తిస్తున్నారు. దేవుడిపై భక్తికి వయసుతో పనిలేదని ఈ బామ్మ నిరూపించిందని పలువురు ప్రశంసిస్తున్నారు.

ABOUT THE AUTHOR

ETV Bharat is headquartered in Hyderabad. It holds a very strong position in both the Telugu states. The reach of ETV Bharat Andhra Pradesh has been maximum because of its unique stories. It also has a strong presence in the state and is capable of reaching out to the maximum number of people....view details