ETV Bharat / technology

ప్రీమియం రెడ్ లుక్​లో కొత్త రెట్రో స్టైల్ బైక్‌- రూ. 2.10 లక్షలకే!

భారత మార్కెట్లో కొత్త "యెజ్డి రోడ్‌స్టర్ రెడ్ వోల్ఫ్ ఎడిషన్" శక్తివంతమైన 334cc ఇంజిన్, ప్రీమియం రెడ్ లుక్‌తో విడుదలయింది.

Yezdi Roadster Red Wolf edition launched at Rs 2.10 lakh
Yezdi Roadster Red Wolf edition launched at Rs 2.10 lakh (Photo Credit- Jawa Yezdi motorcycles)
author img

By ETV Bharat Tech Team

Published : March 4, 2026 at 10:21 AM IST

2 Min Read
Choose ETV Bharat

Hyderabad: భారత మార్కెట్లోకి కొత్త రెట్రో-స్టైల్ బైక్‌ ఎంట్రీ ఇచ్చింది. క్లాసిక్ లెజెండ్స్ భారతదేశంలో "యెజ్డి రోడ్‌స్టర్ రెడ్ వోల్ఫ్ ఎడిషన్" అనే కొత్త బైక్‌ను విడుదల చేసింది. ఈ బైక్ యెజ్డి రోడ్‌స్టర్​లో స్పెషల్ ఎడిషన్. ఇది ముదురు ఎరుపు రంగు స్కీమ్, క్రోమ్ ఫినిషింగ్​తో ఆకర్షణీయంగా కన్పిస్తోంది. కంపెనీ దీనికి కొత్త డెకాల్స్‌ను కూడా జోడించింది. ఈ మోడల్ ఇప్పుడు "జావా 42", "జావా పెరాక్", "యెజ్డి రోడ్‌స్టర్", "యెజ్డి అడ్వెంచర్", "BSA గోల్డ్ స్టార్ 650" వంటి కంపెనీ ప్రస్తుత మోడళ్ల శ్రేణిలో చేరింది.

ధర, సేల్ వివరాలు: ఈ కొత్త రెడ్ వోల్ఫ్ ఎడిషన్ ధర రూ. 2.10 లక్షలు (ఎక్స్-షోరూమ్, దిల్లీ). మీరు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా మీ సమీపంలోని జావా-యెజ్డి డీలర్‌షిప్‌ను సందర్శించడం ద్వారా దీన్ని బుక్ చేసుకోవచ్చు.

మోడల్ధర (ex-showroom)లభ్యతమార్కెట్లో దీని ప్రత్యర్థులు
యెజ్డి రోడ్‌స్టర్ రెడ్ వోల్ఫ్ ఎడిషన్రూ. 2.10 లక్షలు
  • jawayezdimotorcycles.com
  • జావా యెజ్డి డీలర్‌షిప్
  • రాయల్ ఎన్​ఫీల్డ్ బుల్లెట్ 350
  • హోండా హైనెస్ CB350
  • ట్రయంఫ్ స్పీడ్ ​​T4
  • జావా 42

డిజైన్, ఫీచర్లు: డిజైన్ పరంగా, ఈ ఎడిషన్ ఇంధన ట్యాంక్, ముందు & వెనుక ఫెండర్లు, టూల్‌బాక్స్‌పై ఎరుపు రంగు యాక్సెంట్​లను కలిగి ఉంది. ఇంజిన్ కవర్, ఎగ్జాస్ట్‌పై క్రోమ్ ఫినిషింగ్‌లు బైక్‌కు ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. బ్రౌన్ సీటు దీనికి క్లాసిక్ అనుభూతిని ఇస్తుంది, అయితే బ్లాక్ అల్లాయ్ వీల్స్, స్వింగ్‌ఆర్మ్ స్పోర్టీ కాంట్రాస్ట్‌ను జోడిస్తాయి. సుదూర రైడింగ్ కోసం ఇది విండ్ డిఫ్లెక్టర్‌ను కూడా కలిగి ఉంటుంది, తద్వారా టూరింగ్‌ను మరింత సౌకర్యవంతంగా చేస్తుంది.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లువివరాలు
ఇంజిన్334cc, Alpha 2 liquid-cooled
పవర్ అవుట్​పుట్28.70 bhp
టార్క్29.63 Nm
గేర్​బాక్స్6-speed manual
ఫ్రంట్ డిస్క్ బ్రేక్320mm
రియర్ డిస్క్ బ్రేక్240mm

బైక్ రూపురేఖలు మారినప్పటికీ, యాంత్రికంగా ఇది ప్రామాణిక రోడ్‌స్టర్ లాగానే ఉంది. ఈ బైక్ 334cc ఆల్ఫా 2 లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 28.70 bhp, 29.63 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. భద్రతా ఫీచర్ల విషయానికి వస్తే, దీని ముందు భాగంలో 20mm డిస్క్ బ్రేక్‌లు, వెనుక భాగంలో 240mm డిస్క్ బ్రేక్‌లు, డ్యూయల్-ఛానల్ ABS ఉన్నాయి.

Yezdi Roadster Red Wolf Edition
Yezdi Roadster Red Wolf Edition (Image Credit- Jawa Yezdi Motorcycles)

ఇంకా దీనిలో బ్లూటూత్ కనెక్టివిటీకి సపోర్ట్ చేసే రౌండ్ డిజిటల్ స్పీడోమీటర్‌ కూడా ఉంది. దీని ద్వారా రైడర్లు నావిగేషన్, కాల్ అండ్ మెసేజ్ అలర్ట్‌లు వంటి సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు. దీని LED హెడ్‌లైట్, సస్పెన్షన్, ఇతర డిజైన్ ఎలిమెంట్స్​లో ఎటువంటి మార్పులు లేవు. మొత్తంమీద ఈ ఎడిషన్ రెట్రో స్టైల్‌లో కాస్త డిఫరెంట్ రగ్గడ్​ లుక్​లో ఉండే మోటార్​సైకిల్ కోసం చూస్తున్నవారికి ప్రత్యేకంగా ఉంటుంది.