ETV Bharat / technology

రిమూవబుల్ బ్యాటరీలతో యమహా 'ఏరోక్స్-E' స్కూటీ- ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు!

భారత మార్కెట్లోకి యమహా తన మొదటి ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ 'ఏరోక్స్-E' మోడల్​ను లాంఛ్ చేసింది. దీని ధర రూ. 2.82 లక్షల (ఎక్స్-షోరూమ్, దిల్లీ) నుంచి ప్రారంభమవుతుంది.

Yamaha Aerox E launched in India
Yamaha Aerox E launched in India (Photo Credit- EV Yamaha Motor India)
author img

By ETV Bharat Tech Team

Published : July 8, 2026 at 4:45 PM IST

3 Min Read
Choose ETV Bharat

Hyderabad: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా, భారతీయ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలోకి అధికారికంగా అడుగుపెట్టింది. తన పాపులర్ పెట్రోల్ స్కూటర్ 'ఏరోక్స్ 155' స్పోర్టీ డిజైన్ శైలిని కొనసాగిస్తూ, దేశీయ మార్కెట్లో పూర్తి అధునాతన ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో కూడిన సరికొత్త 'యమహా ఏరోక్స్-ఇ' (Yamaha Aerox-E) మోడల్‌ను ప్రవేశపెట్టింది.

పెట్రోల్ వెర్షన్ అయిన 'ఏరోక్స్ 155' స్కూటీ స్పోర్టీ డిజైన్‌తోనే వచ్చిన ఈ కొత్త మోడల్‌ పూర్తి ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్​ను కలిగి ఉంటుంది. కంపెనీ దీని ప్రారంభ ధరను రూ. 2.82 లక్షలుగా (ఎక్స్-షోరూమ్, దిల్లీ)గా నిర్ణయించింది. ఈ స్కూటర్ కేవలం ఒకే ఒక కలర్ ఆప్షన్‌లో లభిస్తుంది. ఇది బ్లాక్ యాక్సెంట్లు, లైట్ బ్లూ గ్రాఫిక్స్‌తో కూడిన గ్లోసీ వైట్ షేడ్​ ఫినిష్​తో వస్తుంది.

యమహా ఏరోక్స్-E కీలక ఫీచర్లు:

  • డ్యూయల్ రిమూవబుల్ బ్యాటరీ: ఇందులో మొత్తం 3.0kWh సామర్థ్యం గల రెండు 1.5kWh రిమూవబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌లను అందించారు. వీటిని సులభంగా బయటకు తీసి ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు.
  • ఎక్స్‌టర్నల్ ఛార్జింగ్ డాక్: ఇంట్లోనే బ్యాటరీలు ఛార్జ్ చేసుకోవడానికి యమహా ప్రత్యేక ఎక్స్‌టర్నల్ ఛార్జింగ్ డాక్‌ను అందిస్తోంది. ఈ డాక్ సహాయంతో బ్యాటరీ ప్యాక్‌లను సులభంగా ఛార్జ్ చేయవచ్చు. అయితే దీన్ని కస్టమర్లు విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
  • ఛార్జింగ్ సమయం: ఒక బ్యాటరీ ప్యాక్‌ను 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేయడానికి 3 గంటల 10 నిమిషాల సమయం పడుతుంది. అయితే, రెండు ప్యాక్‌లను కలిపి ఛార్జ్ చేయడానికి 6 గంటల 20 నిమిషాలు పడుతుంది.
  • పవర్‌ఫుల్ మోటార్: ఈ బ్యాటరీ ప్యాక్‌లను మిడ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌తో అనుసంధానించారు. ఇది 12.6bhp (9.4kW) పవర్, 48Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
  • రేంజ్ & టాప్ స్పీడ్: ఈ స్కూటర్ పూర్తి ఛార్జ్‌పై 117 కి.మీ. IDC-సర్టిఫైడ్ రేంజ్ ఇస్తుందని యమహా పేర్కొంది. అలాగే ఇది 'పవర్ + బూస్ట్ మోడ్' లో గరిష్ఠంగా గంటకు 95.5 కిలోమీటర్ల వేగాన్ని (Top Speed) అందుకోగలదని చెబుతోంది.
  • రైడింగ్ మోడ్‌లు: కొత్త యమహా ఏరోక్స్-E స్కూటర్‌లో ఎకానమీ (Economy), స్టాండర్డ్ (Standard), పవర్ (Power) అనే మూడు రైడింగ్ మోడ్‌లను అందించారు. వీటి ద్వారా రైడర్లు తమ అవసరానికి అనుగుణంగా రేంజ్-ఫోకస్డ్ (ఎక్కువ మైలేజ్ కోసం), పెర్ఫార్మెన్స్-ఫోకస్డ్ (ఎక్కువ వేగం కోసం) సెట్టింగ్స్ మధ్య సులభంగా మారవచ్చు.
  • బూస్ట్ మోడ్ (Boost Mode): ఈ స్కూటర్‌లో ప్రత్యేకంగా ఒక 'బూస్ట్ మోడ్' ఫీచర్‌ను కూడా ఉంది. ఎడమవైపు హ్యాండిల్‌బార్‌పై ఉన్న స్విచ్‌ను నొక్కడం ద్వారా ఏరోక్స్-E స్కూటర్‌కు 10 సెకన్ల పాటు అదనపు పవర్ (ఎక్స్‌ట్రా పవర్) లభిస్తుంది. ఓవర్‌టేక్ చేయడానికి లేదా నిటారుగా ఉండే రోడ్లు ఎక్కడానికి ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది.
  • ఫీచర్లు & సేఫ్టీ: ఏరోక్స్-E ఫుల్-కలర్ TFT ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌తో వస్తుంది. ఇది టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో పాటు కాల్, SMS అలర్ట్‌లను కూడా చూపిస్తుంది. రైడ్ డేటాను ట్రాక్ చేయడానికి దీన్ని యమహా Y-Connect యాప్‌తో కనెక్ట్ చేయవచ్చు. అలాగే ఆల్-LED లైటింగ్, కీలెస్ ఇగ్నిషన్, రివర్స్ మోడ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే, ఇందులో సింగిల్-ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ను అందించారు.
  • వీల్స్ & బ్రేకింగ్: ఏరోక్స్-E స్కూటర్ 14-అంగుళాల చక్రాలను కలిగి ఉంది. దీనికి ముందు వైపు 110-సెక్షన్ టైర్, వెనుక వైపు 140-సెక్షన్ టైర్ అమర్చారు. రెండు చక్రాల వద్ద డిస్క్ బ్రేక్‌లు ఉండగా, వీటికి సపోర్ట్‌గా సింగిల్-ఛానల్ ABS కూడా ఉంది. ఈ స్కూటర్ బరువు 139 కిలోలు.