భారత్‌లో 'VLF మోబ్‌స్టర్ 135' స్కూటీ ధర పెంపు- ఇప్పుడు దీని రేటెంతో తెలుసా?
VLF ఇండియా తన VLF మాబ్‌స్టర్ 135 స్కూటర్‌పై భారతదేశంలో పరిచయ ఆఫర్‌ను ముగించింది. ఇప్పుడు దీని ధర రూ.1.37 లక్షలు.

Published : March 2, 2026 at 11:52 AM IST
Hyderabad: ఇటాలియన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ వెలోసిఫెరో (VLF) భారత మార్కెట్లో తన "VLF మోబ్‌స్టర్ 135" స్కూటర్ పరిచయ ఆఫర్‌ను ముగించింది. దీంతో ఇప్పుడు దీని ధర పెరిగింది. నివేదికల ప్రకారం, ఈ స్కూటర్‌ను ఇప్పుడు రూ. 1.37 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరకు విక్రయిస్తున్నారు, ఇది దాని మునుపటి పరిచయ ధర కంటే రూ. 7,000 ఎక్కువ.
కంపెనీ దీని పరిచయ ఆఫర్ ధరను పరిమిత సంఖ్యలో యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. సెప్టెంబర్ 2025లో భారత మార్కెట్లో VLF మాబ్‌స్టర్ 135ని ప్రారంభించింది. అప్పుడు దీని ప్రారంభ ధర రూ. 1.30 లక్షలు (ఎక్స్-షోరూమ్). ప్రారంభించిన మొదటి నెలలోనే కంపెనీ 2,500 యూనిట్లకు పైగా బుకింగ్‌లను అందుకోవడం గమనార్హం.

తదనంతరం VLF పరిచయ ధరను మరో 500 యూనిట్లు పెంచింది. దీనితో పరిచయ ఆఫర్ ప్రయోజనం పొందిన మొత్తం కస్టమర్ల సంఖ్య 3,000కి చేరుకుంది. ఈ ఆఫర్ ఐదు నెలలకు పైగా అందుబాటులో ఉండగా, తాజాగా కంపెనీ దీన్ని ఉపసంహరించుకుంది.
VLF మాబ్‌స్టర్ 135 ఇంజిన్: మాబ్‌స్టర్ 135లో 125cc, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది స్మూత్ రైడింగ్ కోసం CVT ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 8,250 rpm వద్ద 12.1 bhp శక్తిని, 6,500 rpm వద్ద 11.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఈ VLF గరిష్ఠంగా 100 kmph స్పీడ్, లీటరుకు 46 km ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఈ స్కూటర్‌లో 8-లీటర్ ఇంధన ట్యాంక్ ఉంటుంది. ఇంకా దీని ఇతర కీలక ఫీచర్లలో 5.0-అంగుళాల TFT డిస్ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, కీలెస్ ఇగ్నిషన్, స్విచబుల్ ట్రాక్షన్ కంట్రోల్ ఉన్నాయి.

VLF మాబ్‌స్టర్ 135 హార్డ్‌వేర్: ఈ స్కూటర్ 122 కిలోల కెర్బ్ వెయిట్, 1,341 mm వీల్‌బేస్, 797 mm సీటు ఎత్తు, 155 mm గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. బ్రేకింగ్ కోసం ఇందులో 230 mm ఫ్రంట్ డిస్క్, 220 mm రియర్ డిస్క్ బ్రేక్ ఉన్నాయి, ఇది డ్యూయల్-ఛానల్ స్విచబుల్ ABS సపోర్ట్‌తో వస్తుంది.
స్కూటర్ సస్పెన్షన్ సెటప్‌లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, గ్యాస్-ఛార్జ్డ్ ట్విన్ రియర్ షాక్ అబ్జార్బర్‌లు ఉన్నాయి. ఇది ముందు భాగంలో 120/70, వెనుక భాగంలో 130/70 కొలతలు కలిగిన 12-అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లతో వస్తుంది.

