ETV Bharat / technology

వివో 'X300 అల్ట్రా', 'X300 FE' వచ్చేశాయోచ్- ధర, ఫీచర్లతో పాటు ఆఫర్ల వివరాలు ఇవే!

భారత మార్కెట్లో వివో కొత్త ఫ్లాగ్‌షిప్ "వివో X300 అల్ట్రా", "వివో X300 FE" స్మార్ట్​ఫోన్లు విడుదలయ్యాయి. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Vivo X300 Ultra and X300 FE Launched in India
Vivo X300 Ultra and X300 FE Launched in India (Photo Credit- Vivo)
author img

By ETV Bharat Tech Team

Published : May 6, 2026 at 4:47 PM IST

7 Min Read
Choose ETV Bharat

Hyderabad: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వివో కొత్త ఫ్లాగ్‌షిప్ "X300" స్మార్ట్‌ఫోన్‌ సిరీస్​ ఎట్టకేలకూ భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. కంపెనీ ఈ లైనప్​లో "వివో X300 అల్ట్రా", "వివో X300 FE" అనే రెండు మోడళ్లను విడుదల చేసింది. వీటిలో "X300 అల్ట్రా"లో అధునాతన టెలిఫొటో సామర్థ్యాలతో కూడిన 200-మెగాపిక్సెల్ Zeiss కెమెరా సిస్టమ్​ను అందించారు. అదే సమయంలో "X300 FE" మోడల్ Zeiss-ట్యూన్డ్ 50-మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అదనంగా, ఈ రెండు ఫోన్‌లు కొత్త ఎక్స్‌టర్నల్ టెలిఫోటో కన్వర్టర్ కిట్‌కు సపోర్ట్ చేస్తాయి. ఇక చిప్​సెట్ విషయానికి వస్తే, "అల్ట్రా" మోడల్ క్వాల్కమ్ అగ్రశ్రేణి స్నాప్​డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్​సెట్​ను కలిగి ఉండగా, "X300 FE" క్వాల్కమ్ 3nm ఆక్టా-కోర్ స్నాప్​డ్రాగన్ 8 జెన్​ 5 చిప్‌సెట్​పై నడుస్తుంది. మరెందుకు ఆలస్యం వీటి ధర, ఫీచర్లపై మరిన్ని వివరాలను తెలుసుకుందాం రండి.

1. వివో X300 అల్ట్రా ధర, లభ్యత: భారతదేశంలో "వివో X300 అల్ట్రా" 16GB RAM + 512GB అంతర్గత నిల్వ కలిగిన ఏకైక వేరియంట్‌ ధరను రూ. 1,59,999గా నిర్ణయించారు. వివో Zeiss టెలిఫొటో ఎక్స్​టెండర్ జెన్​ 2 అల్ట్రా (400mm Equivalent) ధర రూ. 27,999 కాగా, వివో ఇమేజింగ్ గ్రిప్ కిట్ ధర రూ. 11,999గా ఉంది.

ఆఫర్ల వివరాలు: ప్రారంభ ఆఫర్లలో భాగంగా, వినియోగదారులు "వివో X300 అల్ట్రా", టెలిఫొటో ఎక్స్‌టెండర్ జెన్ 2 అల్ట్రా, ఇమేజింగ్ గ్రిప్ కిట్‌లను కలిపి ఒక బండిల్‌గా పొందొచ్చు. దీని ధర రూ. 1,95,997 కాగా, దీని గరిష్ఠ పరిమితి (MOP) రూ. 1,99,997గా ఉంది. వివో "X300 అల్ట్రా" ఫొటోగ్రాఫర్ కిట్‌ను కూడా పరిచయం చేసింది. ఇందులో పైన పేర్కొన్న యాక్సెసరీలతో పాటు, అదనంగా 200mm సమానమైన టెలిఫొటో ఎక్స్‌టెండర్ లెన్స్ కూడా ఉంటుంది. దీని ధర రూ. 2,09,999గా నిర్ణయించారు.

ఇంకా కంపెనీ బ్యాంక్ కార్డ్ లావాదేవీలపై 10 శాతం తక్షణ క్యాష్‌బ్యాక్‌తో పాటు, ఒక సంవత్సరం పొడిగించిన వారంటీని కూడా ఉచితంగా అందిస్తోంది.

కలర్ ఆప్షన్లు: ఈ హ్యాండ్‌సెట్ ఎక్లిప్స్ బ్లాక్ (Eclipse Black), విక్టరీ గ్రీన్ (Victory Green) రంగులలో లభిస్తుంది.

సేల్ వివరాలు: వివో X300 అల్ట్రా ప్రస్తుతం Vivo.com, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉంది. ఇది మే 14 నుంచి అమెజాన్, క్రోమా, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్, ఇతర ఆన్‌లైన్ రిటైలర్లతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా కొనుగోలుకు అందుబాటులోకి వస్తుంది.

2. వివో X300 FE ధర, లభ్యత: వివో ఈ మోడల్​ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది. అవి:

  • 12GB RAM + 256GB స్టోరేజ్
  • 12GB RAM + 512GB స్టోరేజ్

వీటిలో బేస్ వేరియంట్ ధర రూ. 79,999 నుంచి ప్రారంభమవుతుండగా, దీని టాప్-ఆఫ్-ది-లైన్ కాన్ఫిగరేషన్ ధర రూ. 89,999గా ఉంది. అదే సమయంలో ఈ మోడల్​ కోసం వివో Zeiss టెలిఫొటో ఎక్స్‌టెండర్ జెన్ 2 లెన్స్ ధరను రూ. 15,999గా, టెలిఫొటో ఎక్స్‌టెండర్ యాక్సెసరీస్ కిట్ ధరను రూ. 3,999గా నిర్ణయించారు.

ఆఫర్ల వివరాలు: కంపెనీ SBI, IDFC ఫస్ట్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కార్డులతో 10 శాతం వరకు తక్షణ క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది.

కలర్ ఆప్షన్లు: వివో X300 FE లైలాక్ పర్పుల్, నోయిర్ బ్లాక్, అర్బన్ ఆలివ్ రంగులలో లభిస్తుంది.

సేల్ వివరాలు: ఈ హ్యాండ్‌సెట్ కూడా మే 14న ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, వివో ఇండియా ఆన్‌లైన్ స్టోర్ ద్వారా భారతదేశంలో అమ్మకానికి రానుంది.

1. వివో X300 అల్ట్రా ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:

డిస్​ప్లే: ఇది 6.82-అంగుళాల 2K (1,440 x 3,168 పిక్సెల్స్) AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ స్క్రీన్ 144Hz రిఫ్రెష్ రేట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్, 94.49 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, HDR మద్దతును అందిస్తుంది.

ప్రాసెసర్: ఈ డ్యూయల్-సిమ్ సపోర్టెడ్ వివో హ్యాండ్‌సెట్ క్వాల్కమ్ ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది అడ్రెనో 840 GPU, వివో VS1+ ఇమేజింగ్ చిప్​తో వస్తుంది. ఇది గరిష్ఠంగా 16GB వరకు LPDDR5x RAM, 1TB వరకు UFS 4.1 స్టోరేజ్​ను అందిస్తుంది.

బ్యాటరీ: ఈ హ్యాండ్‌సెట్‌లో 6,600mAh బ్యాటరీని అమర్చారు. ఇది 100W వైర్డ్, 40W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

కెమెరా సెటప్: ఆప్టికల్స్ విషయానికి వస్తే, "X300 అల్ట్రా"లో Zeiss-ట్యూన్డ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) కలిగిన 200-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 3.7x ఆప్టికల్ జూమ్, గరిష్ఠంగా 105x డిజిటల్ జూమ్ సామర్థ్యం గల 200-మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫొటో సెన్సార్, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్​ల కోసం ఈ ఫోన్ ముందువైపున 50-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అమర్చారు. దీని వెనుక కెమెరాలు 8K వరకు వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తాయి, కాగా సెల్ఫీ కెమెరా 4K వరకు వీడియో రికార్డింగ్‌కు మద్దతును అందిస్తుంది.

ఆపరేటింగ్ సిస్టమ్: ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 పై పనిచేస్తుంది.

కనెక్టివిటీ ఫీచర్లు: వివో X300 అల్ట్రాలో 5G, 4G LTE, Wi-Fi 7, Bluetooth 5.4, NFC, GPS, USB Type-C పోర్ట్‌తో సహా వివిధ కనెక్టివిటీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

కొలతలు, బరువు: ఇది 162.98 × 76.81 × 8.19mm కొలతలతో సుమారు 232 గ్రాముల బరువు ఉంటుంది.

2. వివో X300 FE ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:

డిస్​ప్లే: ఈ ఫోన్​ 6.31-అంగుళాల (1,216 x 2,640 పిక్సెల్స్) AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది గరిష్ఠంగా 120Hz రిఫ్రెష్ రేటు, 300Hz టచ్ శాంప్లింగ్ రేటు, HDR10+ సపోర్ట్, 460 ppi పిక్సెల్ డెన్సిటీ, 94.38 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో, SGS లో బ్లూ లైట్ సర్టిఫికేషన్, గరిష్ఠంగా 5,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది.

ప్రాసెసర్: ఈ వివో X300 FE స్మార్ట్‌ఫోన్‌ క్వాల్కమ్ 3nm ఆక్టా-కోర్ స్నాప్​డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్​పై నడుస్తుంది. ఈ చిప్‌సెట్‌లో 3.32GHz క్లాక్ స్పీడ్‌తో పనిచేసే ఆరు ఎఫిషియెన్సీ కోర్లు, గరిష్ఠంగా 3.8GHz క్లాక్ స్పీడ్‌ను అందించే రెండు పెర్ఫార్మెన్స్ కోర్లు ఉన్నాయి.

ఈ హ్యాండ్‌సెట్‌లో అడ్రినో 829 GPU, 12GB LPDDR5x అల్ట్రా RAM, 512GB వరకు UFS 4.1 ఆన్‌బోర్డ్ స్టోరేజ్ లభిస్తుంది. ఉష్ణ నిర్వహణ (Thermal Management) కోసం, ఇందులో 4,005 sq mm హీట్ డిస్సిపేషన్ ఏరియాను కలిగి ఉన్న 'Vapour Chamber Liquid Cooling' వ్యవస్థను అందించారు.

బ్యాటరీ: వివో X300 FE 6,500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 90W వైర్డ్, 40W వైర్‌లెస్ ఫ్లాష్ ఛార్జింగ్​కు సపోర్ట్ చేస్తుంది.

కెమెరా సెటప్: కెమెరాల విషయానికి వస్తే, వివో X300 FE ఫోన్ Zeiss సహకారంతో రూపొందించిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ప్రధాన కెమెరాగా 50-మెగాపిక్సెల్ (f/1.57) షూటర్ ఉంది. ఇది 1/1.56-అంగుళాల Sony IMX921 సెన్సార్, ఆటోఫోకస్ అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) వంటి ప్రత్యేకతలను కలిగి ఉంది.

ఈ హ్యాండ్‌సెట్‌లో 1/1.95-అంగుళాల Sony IMX882 సెన్సార్, OIS, గరిష్ఠంగా 100x డిజిటల్ జూమ్ సామర్థ్యం కలిగిన 50-మెగాపిక్సెల్ (f/2.65) టెలిఫొటో కెమెరా కూడా ఉంది. అంతేకాకుండా, 1/4-అంగుళాల OV08F10 సెన్సార్, 115-డిగ్రీల వీక్షణ కోణం (Field of View) కలిగిన 8-మెగాపిక్సెల్ (f/2.2) అల్ట్రా-వైడ్ కెమెరాను కూడా ఇందులో ఉంది.

ఇకపోతే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్​లో 1/2.76-అంగుళాల శాంసంగ్ JN1 సెన్సార్, ఆటోఫోకస్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ (f/2.0) ముందు కెమెరాను అందించారు. ఈ కొత్త "వివో X300 FE" ఫోన్ 4K/60 fps వరకు వీడియోలను రికార్డ్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

ఆపరేటింగ్ సిస్టమ్: ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 పై పనిచేసే ఒక డ్యూయల్ SIM స్మార్ట్‌ఫోన్. ఈ హ్యాండ్‌సెట్‌కు ఐదేళ్ల పాటు OS అప్‌గ్రేడ్‌లు, ఏడేళ్ల పాటు భద్రతా అప్‌డేట్‌లను అందిస్తామని కంపెనీ హామీ ఇస్తోంది.

IP రేటింగ్: దుమ్ము, నీటి నిరోధకత కోసం ఈ హ్యాండ్‌సెట్ IP68 + IP69 రేటింగ్‌ బిల్డ్ క్వాలిటీతో వస్తుందని కంపెనీ పేర్కొంది.

సెన్సార్ల వివరాలు: ఇందులో పొందుపరిచిన సెన్సార్ల జాబితాలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ-కంపాస్, హాల్ సెన్సార్, IR బ్లాస్టర్, ఫ్లికర్ సెన్సార్, భద్రత కోసం ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉన్నాయి.

కనెక్టివిటీ ఫీచర్లు: ఇది 5G, 4G LTE, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, Bluetooth 6.0, USB Type-C పోర్ట్, GPS, NFC, BeiDou, GLONASS, Galileo, QZSS, NavIC, GNSSలకు కూడా మద్దతు ఇస్తుంది.

కొలతలు, బరువు: ఇది 150.83×71.76×7.99mm కొలతలతో సుమారు 191 గ్రాముల బరువు ఉంటుంది.