ETV Bharat / technology

మే 12న 'The Android Show': ఆండ్రాయి 17, క్రోమ్​ఓఎస్ అప్డేట్లు రెడీనా?

వచ్చే వారం జరగనున్న I/O 2026 డెవలపర్ కాన్ఫరెన్స్‌కు ముందు గూగుల్ తన 'The Android Show'ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

The Android Show | I/O Edition 2026 Set For May 12
The Android Show | I/O Edition 2026 Set For May 12 (Photo Credit- YouTube/Android)
author img

By ETV Bharat Tech Team

Published : May 6, 2026 at 3:54 PM IST

2 Min Read
Choose ETV Bharat

Hyderabad: గూగుల్ తన 'The Android Show | I/O Edition' రెండో ఎడిషన్​ను మే 12న రాత్రి 10:30 గంటలకు (IST) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ వర్చువల్ కార్యక్రమం ఆండ్రాయిడ్ అధికారిక యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కానుంది.

గూగుల్ అందించిన సమాచారం ప్రకారం, 2026 ఆండ్రాయిడ్​కు 'అత్యంత కీలకమైన సంవత్సరాలలో ఒకటి'గా ఎందుకు నిలవనుందో ఈ కార్యక్రమంలో ప్రదర్శించనున్నారు. అయితే, మౌంటెన్ వ్యూ కేంద్రంగా పనిచేసే ఈ టెక్ దిగ్గజం, ఆండ్రాయి 17కు సంబంధించిన కొత్త ఫీచర్ల గురించి మాత్రం ఎటువంటి వివరాలను వెల్లడించలేదు.

ఈ 'The Android Show | I/O Edition 2026' ఈవెంట్​ను కంపెనీ డెవలపర్ల సదస్సు అయిన 'Google I/O 2026'కు సరిగ్గా ఒక వారం ముందు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సు మే 19-20 తేదీలలో కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో ఉన్న 'షోర్‌లైన్ ఆంఫిథియేటర్‌'లో జరగనుంది.

ఈ ఈవెంట్​లో ఏం ఆశించవచ్చు?: ఈ ఆండ్రాయిడ్ ఈవెంట్‌లో ప్రధాన హైలైట్ ఆండ్రాయిడ్ 17 పరిచయమే కానుంది. అయితే ఇటీవలి సంవత్సరాలతో పోలిస్తే గూగుల్ ఈసారి ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్ డెవలప్‌మెంట్ సైకిల్‌ను కొద్దిగా ఆలస్యం చేసింది. Android Central నివేదిక ప్రకారం, వాస్తవానికి ఫిబ్రవరి 11న విడుదల కావాల్సిన ఆండ్రాయిడ్ 17 మొదటి బీటా వెర్షన్, ఫిబ్రవరి 13కు మార్చారు. ఆ తర్వాత ఫిబ్రవరి 26న రెండో బీటా వెర్షన్ వచ్చింది. అంటే మొదటి వెర్షన్‌ విడుదలైన 13 రోజుల తర్వాత, ఫిబ్రవరి 26న విడుదల చేశారు. ఆ తర్వాత మూడో బీటా మార్చి 26న, నాలుగోది ఏప్రిల్ 16న విడుదలయ్యాయి.

ఆండ్రాయిడ్ 17 బీటా వెర్షన్లను పరిశీలిస్తే, తదుపరి తరం ఆండ్రాయిడ్ సరికొత్త ఆవిష్కరణల జోలికి వెళ్లకుండా, బదులుగా పర్ఫార్మెన్స్ మెరుగుపరచడం, యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత స్మూత్‌గా చేయడంపైనే దృష్టి సారించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

ఆండ్రాయిడ్ 17 తుది వెర్షన్ వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చినప్పుడు, పర్మిషన్స్ మేనేజ్‌మెంట్‌లో మెరుగుదలలు, నోటిఫికేషన్లు, క్విక్ సెట్టింగ్స్‌లో మార్పులు తీసుకువస్తుందని భావిస్తున్నారు. ఈ అప్డేట్‌లో నోటిఫికేషన్ రూల్స్ ఫీచర్ ఉండే అవకాశం ఉంది. దీంతో యూజర్లు నిర్దిష్ట యాప్‌లు, కాంటాక్ట్‌ల కోసం కస్టమ్ రూల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాతి తరం ఆండ్రాయిడ్ 'యూనివర్సల్ యాప్ బబుల్స్'ను కూడా పరిచయం చేస్తుందని భావిస్తున్నారు. ఇవి మల్టీటాస్కింగ్‌కు సహాయపడటానికి, యాప్‌లను ఇంటరాక్టివ్ విండోలుగా స్క్రీన్‌పై తేలియాడేలా చేస్తాయి.

సాఫ్ట్‌వేర్ బీటా వెర్షన్‌లు విడ్జెట్‌ల కోసం కొత్త హబ్ మోడ్, వివిధ డివైజ్‌ల మధ్య మెరుగైన కంపాటబిలిటీ, కాంటాక్ట్‌లను యాప్‌లు యాక్సెస్ చేయకుండా ప్రైవసీ-ఫోకస్డ్ కంట్రోల్స్, అప్డేట్ అయిన స్క్రీన్ రికార్డింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను కూడా పరిచయం చేశాయి. అలాగే, ఆండ్రాయిడ్ 17 క్రోమ్OSతో మరింత దగ్గరగా ఇంటిగ్రేట్ అవుతుందని కూడా అంచనా.

'The Android Show | I/O Edition 2026' ఈవెంట్‌లో Android Auto, Wear OS, Android XR, Android TVలకు సంబంధించిన భవిష్యత్తు దిశానిర్దేశాన్ని వివరించే అవకాశం ఉంది. కొత్త ఫీచర్లు, టూల్స్ ఎప్పటి నుంచి యూజర్లకు అందుబాటులోకి వస్తాయనే దానిపై కూడా గూగుల్ టీమ్ ఈ వేదికపైనే క్లారిటీ ఇవ్వొచ్చు.