కొత్త టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో టాటా 'పంచ్' ఫేస్‌లిఫ్ట్- టీజర్ చూశారా?
టాటా మోటార్స్ టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేయబోతోంది. ఇందులో కొత్త టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఎంపిక ఉంటుంది.

Published : January 5, 2026 at 2:09 PM IST
Hyderabad: స్వదేశీ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ "టాటా పంచ్"లో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసేందుకు రెడీ అయింది. ఈ నేపథ్యంలో కంపెనీ దీని టీజర్లను విడుదల చేస్తూ వస్తోంది. తద్వారా దీనికి సంబంధించిన వివరాలను ఒక్కొక్కటిగా వెల్లడిస్తోంది. తాజాగా మరో టీజర్‌ను విడుదల చేయగా ఇది అత్యంత కీలక స్పెసిఫికేషన్‌ను రివీల్ చేసింది. అదేంటంటే కొత్త ఇంజిన్ ఎంపిక. ఈ మైక్రో SUV కొత్త టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌ను అందిస్తుంది. దీంతో ఈ SUV నుంచి ఎక్కువ పవర్, టార్క్ కోరుకునే కొనుగోలుదారులు ఇప్పుడు ప్రామాణిక నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను ఎంచుకోవచ్చు.
కంపెనీ విడుదల చేసిన ఈ రెండవ టీజర్ కొత్త కలర్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో సహా కొన్ని కొంగొత్త అంశాల గ్లింప్స్‌ను వెల్లడిస్తుంది. అయితే దీనిని చూసి టాటా పంచ్ EVలో కనిపించే 10.25-అంగుళాల స్క్రీన్‌తో పోల్చి గందరగోళపడకండి. ఈ టీజర్‌లో అల్లాయ్ వీల్స్, 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, అన్నింటికంటే ముఖ్యంగా ఐటర్బో బ్యాడ్జ్ కూడా కనిపిస్తున్నాయి.
టాటా గతంలో టర్బో-పెట్రోల్ టాటా ఆల్ట్రోజ్‌ను దాని ప్రామాణిక పెట్రోల్, డీజిల్ మోడళ్ల నుంచి వేరు చేయడానికి ఐటర్బో బ్యాడ్జ్‌ను ఉపయోగించింది. తరువాత ఈ వేరియంట్‌ను రేసర్‌గా రీబ్రాండ్ చేసింది. దీనిలో కనిపించే ఇతర కీలకాంశాల గురించి మాట్లాడుకుంటే, ఇది ఫ్రీ-స్టాండింగ్ సెంట్రల్ టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉంటుంది.
దీని గ్రాఫిక్స్ కొద్దిగా మార్చారు. అయితే ఎయిర్ కండిషనింగ్ కంట్రోల్స్ మాత్రం టాటా నెక్సాన్, కర్వ్‌లో కనిపించే సుపరిచితమైన టచ్ ఆధారిత యూనిట్‌లాగే ఉన్నాయి. ఆసక్తికరంగా ఈ యూనిట్‌ను నిశితంగా పరిశీలిస్తే 360-డిగ్రీల కెమెరా ఫంక్షన్ కనిపిస్తుంది. ఈ ఫీచర్‌ను ఇంతకు ముందు కేవలం పంచ్ EVలో మాత్రమే అందించారు.
టాటా పంచ్ టర్బో ఇంజిన్: అయితే టాటా మోటార్స్ ఈ చిన్న SUVలో ఏ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుందో చూడాలి. కంపెనీ ప్రస్తుతం మార్కెట్లో రెండు చిన్న-డిస్‌ప్లేస్‌మెంట్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌లను అందిస్తోంది. మొదటిది కంపెనీ 1.2-లీటర్ రెవోట్రాన్ టర్బో-పెట్రోల్ ఇంజిన్. దీనిని ప్రస్తుతం నిలిపివేసిన టాటా ఆల్ట్రోజ్ ఐటర్బో, ఆల్ట్రోజ్ రేసర్‌తో పాటు నెక్సాన్, కర్వ్ లో- వేరియంట్లలో అందించారు. ఈ ఇంజిన్ 118 bhp గరిష్ఠ శక్తిని, 170 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
రెండవ ఇంజిన్ ఆప్షన్ కంపెనీ కొత్త హైపెరియన్ ఇంజిన్ సిరీస్‌కు చెందినది. ఇది గ్యాసోలిన్ డైరెక్ట్ ఇంజెక్షన్‌తో కూడిన 1.2-లీటర్ ఇంజిన్. కానీ ఇది మరింత ఎక్కువ పవర్, టార్క్‌ను అందిస్తుంది. ఈ ఇంజిన్ 123 bhp శక్తిని, 225 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఇటీవలి మోడళ్లలోని బేస్ నెక్సాన్ మినహా, రెండు యూనిట్లకు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను అందిస్తున్నారు. బేస్ నెక్సాన్‌లో రేవోట్రాన్ టర్బో ఇంజిన్ 5-స్పీడ్ యూనిట్‌తో వస్తుంది. అయితే టర్బో-పెట్రోల్ ఇంజిన్ టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ హైయర్ వేరియంట్లకు మాత్రమే పరిమితం కావచ్చు. లో- వేరియంట్లలో నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ మాత్రమే లభిస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్‌తో వస్తుంది.
నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అన్ని వేరియంట్లలో ఫ్యాక్టరీ-ఫిటెడ్ CNG ఆప్షన్‌ను కూడా పొందవచ్చు. ఈ టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ కొత్త క్యాలెండర్ సంవత్సరంలో కంపెనీ మొట్టమొదటి కీలక ఆవిష్కరణ. దీని ధరలు జనవరి 13, 2026న ప్రకటించన్నారు. కంపెనీ దీనితో పాటు ఈ ఏడాదిలో టాటా సియారా EV, మొదటి అవిన్య EV వంటి ఇతర కీలక ఆవిష్కరణలను కూడా ధృవీకరించింది. ఇవి వరుసగా 2026 మధ్యలో, 2026 చివరిలో విడుదల కానున్నాయి.

