ETV Bharat / technology

టాటా 'ఇంట్రా V40' పికప్​ ట్రక్ లాంఛ్- సూపర్ కెపాసిటీ.. డబుల్ మైలేజ్!

టాటా మోటార్స్ "ఇంట్రా V40" అనే కొత్త బై-ఫ్యూయల్ పికప్ ట్రక్కును విడుదల చేసింది. ఇది 1.2-లీటర్ ఇంజిన్, 1,525 కిలోల పేలోడ్ సామర్థ్యంతో పాటు సీఎన్‌జీ-పెట్రోల్ డ్యూయల్ ఫ్యూయల్ ఆప్షన్​ అందిస్తుంది.

Tata Motors adds Intra V40 to alternative fuel pickup range
Tata Motors adds Intra V40 to alternative fuel pickup range (Photo Credit- Tata Motors)
author img

By ETV Bharat Tech Team

Published : June 4, 2026 at 11:32 AM IST

2 Min Read
Choose ETV Bharat

Hyderabad: టాటా మోటార్స్ తన చిన్న కమర్షియల్ వాహనాల శ్రేణిని విస్తరిస్తూ సరికొత్త "ఇంట్రా V40" పికప్ ట్రక్కును లాంఛ్ చేసింది. అధిక పేలోడ్, తక్కువ నిర్వహణ ఖర్చులు, మెరుగైన ఫ్లెక్సిబిలిటీ కోరుకునే వ్యాపారాల కోసం ఈ మోడల్‌ను తీసుకొచ్చారు. ఇది ఆల్టర్నేట్ ఫ్యూయల్ విభాగంలో టాటా స్థానాన్ని బలోపేతం చేస్తుంది.

టాటా మోటార్స్ బై-ఫ్యూయల్ కమర్షియల్ వాహనాల శ్రేణిలోకి ఇప్పుడు "ఇంట్రా V40" కూడా చేరింది. లాస్ట్-మైల్ డెలివరీల కోసం డిజైన్ చేసిన ఈ ట్రక్కులో CNG+పెట్రోల్ బై-ఫ్యూయల్ ఇంజిన్ ఉంది. ఇది సెగ్మెంట్‌లోనే అత్యధికమైన 1,525 కేజీల పేలోడ్ కెపాసిటీ, 2,960 మి.మీ పొడవైన లోడ్ బాడీతో వస్తుంది. దీంతో ఆపరేటర్లు ఎక్కువ సరుకు రవాణా చేసి ఆదాయం పెంచుకోవచ్చు.

పవర్​ఫుల్ బై-ఫ్యూయల్ పవర్‌ట్రెయిన్: ఇంట్రా V40లో 1.2-లీటర్ ఇంజిన్ ఉంది. ఇది 58 bhp పవర్, 106 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పవర్, మైలేజీ రెండింటినీ బ్యాలెన్స్ చేసేలా ఈ ఇంజిన్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. దీంతో ఇది సిటీ, ఇంటర్‌-సిటీ కార్గో రవాణాకు అనుకూలంగా ఉంటుంది.

ఈ వాహనంలో 110-లీటర్ల CNG ట్యాంక్‌ను అమర్చారు. దీంతో ఆపరేటింగ్ రేంజ్ పెరగడంతో పాటు ఇంధన ఖర్చులు కూడా తగ్గుతాయి. బై-ఫ్యూయల్ సిస్టమ్ ఉండటంతో CNG దొరకని చోట్ల పెట్రోల్‌కు మారి నడుపుకోవచ్చు. తద్వారా ఆపరేటర్లు నిరాటంకంగా రవాణా కొనసాగించవచ్చు.

డ్రైవర్ సౌకర్యం & భద్రతపై దృష్టి: కొత్త ఇంట్రా V40ను టాటా మోటార్స్ ప్రఖ్యాత వాణిజ్య వాహన ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. ఇది ఆధునిక వాక్-త్రూ క్యాబిన్‌ను కలిగి ఉంది. దీంతో డ్రైవర్లకు ఎక్కడం, దిగడం చాలా సులభం అవుతుంది. ఎక్కువ గంటల పాటు డ్రైవ్ చేసినప్పుడు అలసట తగ్గించేందుకు వీలుగా కార్-లైక్ డ్రైవింగ్ డైనమిక్స్ అందించారు.

ఇక సేఫ్టీ విషయానికి వస్తే, దీనిలో ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు. దీంతో బ్రేకింగ్, కంట్రోల్ మెరుగ్గా ఉంటాయి. హైడ్రోఫార్మ్‌డ్ ఛాసిస్ బండికి మరింత దృఢత్వం, స్థిరత్వం, మన్నికను అందిస్తుంది. హెవీ లోడ్ ఉన్నా, ఎలాంటి రోడ్డు మీదైనా ఇంట్రా V40 నమ్మకమైన పనితీరు ఇస్తుందని టాటా మోటార్స్ చెబుతోంది.