ETV Bharat / technology

సుజుకి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసిందోచ్- ధర ఎంతంటే?

భారత మార్కెట్​లో "సుజుకి E-యాక్సెస్" లాంఛ్- బ్యాటరీ, రేంజ్​, స్పెసిఫికేషన్లతో పాటు ధర వివరాలు ఇవే!

Suzuki E-Access Launched in India
Suzuki E-Access Launched in India (Photo Credit- Suzuki Motorcycle India)
author img

By ETV Bharat Tech Team

Published : January 10, 2026 at 12:16 PM IST

2 Min Read
Choose ETV Bharat

Hyderabad: ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ఎట్టకేలకు తన "సుజుకి E-యాక్సెస్" ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది సుజుకి మోటార్​సైకిల్ తొలి ఎలక్ట్రిక్ స్కూటర్. దీని లాంఛ్​తో కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్​లోకి ప్రవేశించింది. భారత మార్కెట్​లో ఈ స్కూటర్‌ ధర రూ. 1.88 లక్షల (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది.

సుజుకి ఈ "E-యాక్సెస్‌"ను తొలిసారిగా జనవరి 2025న దిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. వాస్తవానికి దీన్ని జూన్ 2025లో ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే మార్కెట్లోకి ఈ స్కూటర్ ఎంట్రీ అర్ధ సంవత్సరం కంటే ఎక్కువ కాలం ఆలస్యం అయింది. ఇకపోతే కంపెనీ ఈ స్కూటర్‌ను మొత్తం నాలుగు డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లలో ప్రవేశపెట్టింది: బ్లాక్/రెడ్, వైట్/గ్రే, గ్రీన్/గ్రే, బ్లూ/గ్రే. ఈ "కొత్త E-యాక్సెస్" బుకింగ్‌లు సుజుకి మోటార్‌సైకిల్ అన్ని డీలర్‌షిప్‌లలో ప్రారంభమయ్యాయి.

సుజుకి E-యాక్సెస్ డిజైన్: దీని పేరు చాలా సుపరిచితమే అయినప్పటికీ ఈ కొత్త "సుజుకి E-యాక్సెస్" దాని పెట్రోల్-శక్తితో కౌంటర్​పార్ట్​తో సమానంగా లేదు. ఇది లో అండ్ షార్ప్ ఎండ్​, పూర్తిగా LED లైటింగ్ సెటప్‌తో చాలా భిన్నంగా కనిపిస్తుంది. డైమెన్షన్ పరంగా, ఈ "సుజుకి E-యాక్సెస్" 1,860 mm పొడవు , 1,305 mm వీల్‌బేస్​తో 160 mm గ్రౌండ్ క్లియరెన్స్‌ను అందిస్తుంది. దీని సీటు ఎత్తు 765 mm, బరువు 122 కిలోలు ఉంటుంది.

సుజుకి E-యాక్సెస్ బ్యాటరీ, పనితీరు, రేంజ్: సుజుకి ప్రస్తుతం తన స్కూటర్లలో లిథియం-ఫెర్రోఫాస్ఫేట్ (LFP) సెల్‌లను ఉపయోగిస్తున్న అతికొద్ది ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటి. కంపెనీ ఈ కొత్త "సుజుకి E-యాక్సెస్‌"లో 3.07 kWh LFP బ్యాటరీని ఉపయోగించింది.

LFP బ్యాటరీలు NMC బ్యాటరీల కంటే తక్కువ శక్తి సాంద్రతను కలిగి ఉండటం గమనించదగ్గ విషయం. ఫలితంగా ఈ కొత్త "సుజుకి E-యాక్సెస్" పరిమిత రేంజ్​ను కలిగి ఉంటుంది. ఇది 95 కిలోమీటర్ల (IDC) వరకు పరిధిని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. అయితే వాస్తవ పరిస్థితులలో దీని రేంజ్ 65-75 కిలోమీటర్ల మధ్య ఉంటుందని అంచనా.

సుజుకి మోటార్‌సైకిల్ దీని సుదీర్ఘ జీవితకాలాన్ని హైలైట్ చేస్తున్నప్పటికీ, బ్యాటరీ వారంటీకి సంబంధించి ఇంకా ఎటువంటి సమాచారాన్ని అందించలేదు. అయితే కంపెనీ త్వరలోనే దీని గురించి మరిన్ని వివరాలను అందించనుంది. ఇకపోతే ఈ "సుజుకి E-యాక్సెస్" 5.5 bhp, 15 Nm పీక్ టార్క్​ను ఉత్పత్తి చేసే శాశ్వత మాగ్నెట్ మోటారును ఉపయోగిస్తుంది. దీని టాప్​స్పీడ్ గంటకు 71 కిలోమీటర్లు.

సుజుకి E-యాక్సెస్ ఛార్జింగ్ కెపాసిటీ: కంపెనీ ఈ "సుజుకి E-యాక్సెస్"​ను ప్రామాణికంగా పోర్టబుల్ ఛార్జర్‌తో అందిస్తోంది. ఇది ఆరు గంటల 40 నిమిషాల్లో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయగలదు.