అద్భుతమైన డిజైన్, హ్యాండ్స్-ఫ్రీ AI యాక్సెస్‌తో "గెలాక్సీ బడ్స్ 4" సిరీస్- ఓసారి చూసేయండి!
శాంసంగ్ భారత్‌తో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్ల కోసం "గెలాక్సీ బడ్స్ 4" సిరీస్‌ను ప్రవేశపెట్టింది. వీటి ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Published : February 26, 2026 at 11:40 AM IST
Hyderabad: టెక్ దిగ్గజం శాంసంగ్ తన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2026 ఈవెంట్‌లో "గెలాక్సీ S26" సిరీస్ స్మార్ట్ఫోన్లతో పాటు "గెలాక్సీ బడ్స్ 4" సిరీస్‌ను కూడా ప్రారంభించింది. ఈ సిరీస్‌లో "గెలాక్సీ బడ్స్ 4", "గెలాక్సీ బడ్స్ 4 ప్రో" అనే రెండు మోడళ్లు ఉన్నాయి. ఈ TWS(ట్రూ వైర్లేస్ స్టీరియో) ఇయర్‌బడ్స్‌లో కంపెనీ అద్భుతమైన ఫీచర్లను అందించింది.
ఈ లైనప్‌లోని "గెలాక్సీ బడ్స్ 4 ప్రో" మోడల్లో కెనాల్-ఫిట్ ఆర్కిటెక్చర్, కొత్తగా రూపొందించిన వైడర్ వూఫర్ ఉంది. దీంతో దీని స్పీకర్ ఏరియా దాదాపు 20 శాతం పెరిగిందని కంపెనీ పేర్కొంది. ఇది హెడ్ గెస్చర్ నియంత్రణలతో పాటు చెవి ఆకారం, ధరించే పరిస్థితుల ఆధారంగా ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేసే మెరుగైన అడాప్టివ్ EQ, అడాప్టివ్ ANCలను కూడా కలిగి ఉంది. ఇంకా బిక్స్‌బై, గూగుల్ జెమిని మొదలైన AI అసిస్టెంట్‌లకు హ్యాండ్స్-ఫ్రీ యాక్సెస్‌ను కూడా అందిస్తుంది.
మరోవైపు "గెలాక్సీ బడ్స్4" విషయానికి వస్తే ఇది రోజంతా ధరించడానికి అనువైన ఓపెన్-ఫిట్ డిజైన్‌ను కలిగి ఉంది. అదే సమయంలో దీనిలో మెరుగైన యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, అడాప్టివ్ ఈక్వలైజర్, సూపర్ క్లియర్ కాల్ టెక్నాలజీని అందించారు.
గెలాక్సీ బడ్స్4 ప్రో:
- సౌకర్యవంతమైన ఫిట్ కోసం కెనాల్-ఫిట్ డిజైన్
- రిచ్ సౌండ్ కోసం పెద్ద స్పీకర్ (20% ఎక్కువ స్పీకర్ ఏరియా)
- హై-ఫై ఆడియో (24-బిట్/96kHz)తో 2-వే స్పీకర్లు
- స్మార్ట్ EQ, నాయిస్ క్యాన్సిలేషన్
- హెడ్ గెస్టర్, హ్యాండ్స్-ఫ్రీ AI యాక్సెస్ (Bixby, Google Gemini, etc.)
గెలాక్సీ బడ్స్4:
- రోజంతా ధరించడానికి అనువైన ఓపెన్-ఫిట్ డిజైన్
- యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్
- అడాప్టివ్ EQ
- సూపర్ క్లియర్ కాల్ టెక్
శాంసంగ్ గెలాక్సీ బడ్స్4 సిరీస్ ధరలు: కంపెనీ భారతదేశంలో తన "శాంసంగ్ గెలాక్సీ4" ధరను రూ. 16,999, ఉన్నతమైన "గెలాక్సీ బడ్స్4 ప్రో" ధరను రూ. 22,999గా నిర్ణయించింది.
సేల్ వివరాలు: ఈ రెండు TWSలు మార్చి 11, 2026 నుంచి అమెజాన్, శాంసంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి.
కలర్ ఆప్షన్లు:
1. గెలాక్సీ బడ్స్4 ప్రో: ఈ మోడల్ భారత మార్కెట్లో మూడు విభిన్న రంగులలో లభిస్తుంది.
- నలుపు
- తెలుపు
- పింక్ గోల్డ్
2. గెలాక్సీ బడ్స్4 కలర్ ఆప్షన్లు: ఇది రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులు ఉంటుంది.
- నలుపు
- తెలుపు
గెలాక్సీ బడ్స్4 ప్రో (వర్సెస్) గెలాక్సీ బడ్స్4: ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
| కేటగిరీ | గెలాక్సీ బడ్స్4 ప్రో | గెలాక్సీ బడ్స్4 |
|---|---|---|
| డిజైన్ టైప్ | కెనాల్-ఫిట్ డిజైన్ | ఓపెన్-ఫిట్ డిజైన్ |
| డిజైన్ ఐడెంటిటీ | బ్లేడ్ డిజైన్, ప్రీమియం మెటల్ ఫినిషింగ్, ఎన్గ్రేవ్డ్ పించ్ కంట్రోల్ | బ్లేడ్ డిజైన్, ప్రీమియం మెటల్ ఫినిషింగ్, పించ్ కంట్రోల్ |
| ఫిట్ & కంఫర్ట్ | చిన్న ఎర్గోనామిక్ హెడ్, కంప్యుటేషనల్ ఇయర్ డేటా ద్వారా ఆప్టిమైజ్డ్ (10,000+ simulations) | చిన్న ఎర్గోనామిక్ హెడ్, కంప్యుటేషనల్ ఇయర్ డేటా ద్వారా ఆప్టిమైజ్డ్ |
| స్పీకర్ సిస్టమ్ | 2-వే స్పీకర్ (Wider Woofer + Tweeter) | మెరుగైన స్పీకర్ సిస్టమ్ |
| వూఫర్ | కొత్త వెడల్పు గల వూఫర్ (≈20% larger effective area vs previous gen) | — |
| ఆడియో క్వాలిటీ | 24-bit / 96kHz Hi-Fi ఆడియో | హై-క్వాలిటీ అడాప్టివ్ ఆడియో |
| అడాప్టివ్ EQ | మెరుగైన అడాప్టివ్ EQ (రియల్-టైమ్ ఇయర్-షేప్ అనాలిసిస్) | మెరుగైన అడాప్టివ్ EQ |
| యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ | మెరుగైన ANC + అడాప్టివ్ ANC | మెరుగైన ANC |
| నాయిస్ ఆప్టిమైజేషన్ | రియల్-టైమ్ వేరింగ్-కండిషన్ అనాలిసిస్ | రియల్-టైమ్ వేరింగ్-కండిషన్ అనాలిసిస్ |
| కాల్ క్వాలిటీ | సూపర్ క్లియర్ కాల్ (సూపర్ వైడ్‌బ్యాండ్ + ML నాయిస్ రిడక్షన్) | సూపర్ క్లియర్ కాల్ |
| AI ఇంటిగ్రేషన్ | హ్యాండ్స్-ప్రీ AI యాక్సెస్ (బిక్స్‌బై, గూగుల్ జెమిని, పెర్ప్లెక్సిటీ) | హ్యాండ్స్-ప్రీ AI యాక్సెస్ |
| హెడ్ గెస్టర్ కంట్రోల్స్ సపోర్ట్ | ఉంది | లేదు |

