ETV Bharat / technology

కిర్రాక్ ఫీచర్లతో గెలాక్సీ S26 సిరీస్ స్మార్ట్​ఫోన్లు- ధరలు ఎలా ఉన్నాయంటే?

శాంసంగ్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న "గెలాక్సీ S26" సిరీస్​ స్మార్ట్​ఫోన్లు ఎట్టకేలకూ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ లైనప్​లో "గెలాక్సీ S26", "గెలాక్సీ S26 ప్లస్", "గెలాక్సీ S26 అల్ట్రా" మోడళ్లు ఉన్నాయి.

Samsung Launches Galaxy S26, Galaxy S26 Plus, Galaxy S26 Ultra In India
Samsung Launches Galaxy S26, Galaxy S26 Plus, Galaxy S26 Ultra In India (Photo Credit- Samsung)
author img

By ETV Bharat Tech Team

Published : February 26, 2026 at 10:06 AM IST

3 Min Read
Choose ETV Bharat

Hyderabad: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2026 ఈవెంట్‌లో భారత్​ సహా ఇతర గ్లోబల్ మార్కెట్ల కోసం "గెలాక్సీ S26" సిరీస్‌ను ప్రకటించింది. ఈ లైనప్‌లో "గెలాక్సీ S26", "గెలాక్సీ S26 ప్లస్", "గెలాక్సీ S26 అల్ట్రా" అనే మూడు మోడల్‌లు ఉన్నాయి. వీటిలో టాప్-స్పెక్ "గెలాక్సీ S26 అల్ట్రా"లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్​సెట్​ను అందించారు. ఈ స్మార్ట్​ఫోన్ మరో విశేషం ఏంటంటే ఇందులో "ప్రైవసీ డిస్​ప్లే" అందించారు. ఇది స్క్రీన్ వీక్షణా కోణాన్ని పరిమితం చేస్తుంది, అంటే ఫోన్ ముందు నుంచి చూసినప్పుడు మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంది. స్క్రీన్‌లో కొంత భాగం లేదా సైడ్ నుంచి చూసినప్పుడు సరిగ్గా కన్పించదు. తద్వారా చుట్టూ ఎంతమంది ఉన్నా మన ప్రైవసీకి ఎటువంటి భంగం వాటిల్లకుండా కాపాడుతుంది. ఇంకా ఇందులో అప్‌గ్రేడెడ్ 200MP క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది. అదే సమయంలో స్టాండర్డ్, ప్లస్ వేరియంట్‌లు 2nm Exynos 2600 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతాయి. ఇవి 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటాయి. ఈ కొత్త లైనప్ ఆండ్రాయిడ్ 16పై శాంసంగ్ వన్ UI 8.5 ఇంటర్‌ఫేస్‌తో నడుస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ ధరలు:

ModelRAMStoragePrice (INR)
1. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా12GB256GBరూ. 1,39,999
12GB512GBరూ. 1,59,999
16GB1TBరూ. 1,89,999
2. శాంసంగ్ గెలాక్సీ S26+12GB256GBరూ. 1,19,999
12GB512GBరూ. 1,39,999
3. శాంసంగ్ గెలాక్సీ S26 12GB256GBరూ. 87,999
12GB512GBరూ. 1,07,999

1. గెలాక్సీ S26 అల్ట్రా వేరియంట్లు: కంపెనీ ఈ మోడల్​ను మూడు RAM, స్టోరేజ్ వేరియంట్లలో ప్రవేశపెట్టింది. అవి:

  • 12GB RAM + 256GB స్టోరేజ్
  • 12GB RAM + 512GB స్టోరేజ్
  • 16GB RAM + 1TB స్టోరేజ్

వేరియంట్ల వారీగా అల్ట్రా మోడల్ ధరలు:

12GB RAM + 256GB స్టోరేజ్ ధర: రూ.1,39,999

12GB RAM + 512GB స్టోరేజ్ ధర: రూ.1,59,999

16GB RAM + 1TB స్టోరేజ్ ధర: రూ.1,89,999

2. గెలాక్సీ S26 ప్లస్ వేరియంట్లు: ఇది మార్కెట్లో రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి:

  • 12GB RAM + 256GB స్టోరేజ్
  • 12GB RAM + 512GB స్టోరేజ్

వేరియంట్ల వారీగా ప్లస్ మోడల్ ధరలు:

12GB RAM + 256GB స్టోరేజ్ ధర: రూ.1,19,999

12GB RAM + 512GB స్టోరేజ్ ధర: రూ.1,39,999

3. గెలాక్సీ S26 వేరియంట్లు: ఈ మోడల్ కూడా​ "ప్లస్" మాదిరిగానే మార్కెట్లో రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి:

  • 12GB RAM + 256GB స్టోరేజ్
  • 12GB RAM + 512GB స్టోరేజ్

వేరియంట్ల వారీగా దీని ధరలు:

  • 12GB RAM + 256GB స్టోరేజ్ ధర: రూ.87,999
  • 12GB RAM + 512GB స్టోరేజ్ ధర: రూ.1,07,999

సేల్ వివరాలు: ఈ మొత్తం గెలాక్సీ S26 సిరీస్ ప్రీ-ఆర్డర్ మార్కెట్లో ప్రారంభమయ్యాయి. ఈ ఫోన్లు కోబాల్ట్ వైలెట్, వైట్, బ్లాక్, స్కై బ్లూతో సహా షేర్డ్ కలర్ ఆప్షన్‌లతో లభిస్తాయి. ఇవి Samsung.comలో ప్రత్యేకంగా పింక్ గోల్డ్, సిల్వర్ షాడో రంగులలో కూడా అందుబాటులో ఉంటాయి.

గెలాక్సీ S26 అల్ట్రా vs గెలాక్సీ S26+ vs గెలాక్సీ S26: ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

Samsung Launches Galaxy S26, Galaxy S26 Plus, Galaxy S26 Ultra In India
Samsung Launches Galaxy S26, Galaxy S26 Plus, Galaxy S26 Ultra In India (Photo Credit- Samsung)
కేటగిరీగెలాక్సీ S26 అల్ట్రాగెలాక్సీ S26+గెలాక్సీ S26
డిస్​ప్లే6.9-inch QHD+ Dynamic AMOLED 2X | 120Hz6.7-inch QHD+ Dynamic AMOLED 2X | 120Hz6.3-inch FHD+ Dynamic AMOLED 2X | 120Hz
స్పెషల్ డిస్​ప్లే వివరాలు10-bit colour, Privacy Display (30° restriction)
ప్రొటెక్షన్Corning Gorilla Armor 2
ప్రాసెసర్Snapdragon 8 Elite Gen 5 (Galaxy custom)Exynos 2600Exynos 2600
RAMUp to 16GB12GB12GB
స్టోరేజ్ ఆప్షన్లుUp to 1TB256GB / 512GB256GB / 512GB
సాఫ్ట్​వేర్One UI 8.5 (Android 16)
వెనుక కెమెరాలు200MP + 50MP (5x) + 50MP (UW) + 10MP (3x)50MP + 10MP (3x) + 12MP (UW)
ఫ్రంట్ కెమెరా 12MP
బ్యాటరీ వివరాలు5,000mAh4,900mAh4,300mAh
వైర్డ్ ఛార్జింగ్60W45W25W
వైర్​లెస్ ఛార్జింగ్Super Fast Wireless ChargingFast Wireless Charging 2.0