ETV Bharat / technology

సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లతో రియల్​మీ "నార్జో 90" సిరీస్- లాంఛ్​కు ముందే కీలక స్పెక్స్ రివీల్!

త్వరలో మార్కెట్​లోకి రియల్​మీ "నార్జో 90 5G", "నార్జో 90x 5G" ఫోన్లు- లాంఛ్ ఎప్పుడో తెలుసా?

Realme Narzo 90 Series Display, Battery Specifications Confirmed Ahead of December 16 Launch in India
Realme Narzo 90 Series Display, Battery Specifications Confirmed Ahead of December 16 Launch in India (Photo Credit- Realme)
author img

By ETV Bharat Tech Team

Published : December 11, 2025 at 11:02 AM IST

3 Min Read
Choose ETV Bharat

Hyderabad: చైనీస్ స్మార్ట్​ఫోన్ తయారీ సంస్థ రియల్​మీ నుంచి రెండు స్మార్ట్​ఫోన్​లు వస్తున్నాయి. అవి: "నార్జో 90 5G", "నార్జో 90x 5G". కంపెనీ ఈ "రియల్‌మీ నార్జో 90" సిరీస్ ఫోన్​లను డిసెంబర్ 16, 2025న విడుదల చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. వీటి కోసం ప్రత్యేకమైన మైక్రోసైట్​ కూడా రన్ అవుతోంది. అందులో ఈ ఫోన్​ల డిజైన్​తో పాటు కీలక స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలను అందించింది. మరి ఆ వివరాలపై ఓ లుక్కేద్దామా?

రియల్​మీ నార్జో 90 సిరీస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు:

Realme Narzo 90 5G Key Features and Specifications
Realme Narzo 90 5G Key Features and Specifications (Photo Credit- Realme)

డిస్​ప్లే: రియల్‌మీ "నార్జో 90 5G" డిస్‌ప్లే 4,000 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. కంపెనీ ఇది ఈ సెగ్మెంట్​లో బ్రైటెస్ట్ డిస్​ప్లే అని చెబుతోంది. అదే సమయంలో "నార్జో 90x 5G" ప్యానెల్ 144Hz రిఫ్రెష్ రేట్‌, 1,200 నిట్స్ వరకు పీక్​ బ్రైట్​నెస్​ను అందిస్తుంది.

Realme Narzo 90x 5G Key Features and Specifications
Realme Narzo 90x 5G Key Features and Specifications (Photo Credit- Realme)

బ్యాటరీ కెపాసిటీ: కంపెనీ ఈ రెండు ఫోన్లను 7,000mAh టైటాన్ బ్యాటరీలతో తీసుకువస్తోంది. ఇది ఈ సెగ్మెంట్​లో బిగ్గెస్ట్ బ్యాటరీ అని అంటోంది. ఇవి 60W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తాయి. అయితే ఈ రెండు ఫోన్​లలో "నార్జో 90 5G" మోడల్‌లో మాత్రమే బైపాస్ ఛార్జింగ్, వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఇంకా దీని బ్యాటరీ 1600 ఛార్జింగ్​ల తర్వాత కూడా 80శాతానికి పైగానే స్టాంగ్​గా ఉంటుందని రియల్​మీ చెబుతోంది. దీనికి 6 సంవత్సరాల బ్యాటరీ లైఫ్ గ్యారంటీని అందిస్తుంది.

Realme Narzo 90 5G Battery Capacity Details
Realme Narzo 90 5G Battery Capacity Details (Photo Credit- Realme)

బ్యాటరీ లైఫ్: బ్యాటరీ లైఫ్ పరంగా, రియల్​మీ "నార్జో 90 5G" 143.7 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 8.1 గంటల గేమింగ్, 24 గంటల ఆన్‌లైన్ వీడియో ప్లేబ్యాక్, సింగిల్ ఛార్జ్‌పై 28.2 గంటల వీడియో కాలింగ్‌ను అందిస్తుంది.

Realme Narzo 90x 5G
Realme Narzo 90x 5G (Photo Credit- Realme)

మరోవైపు "నార్జో 90x 5G" 17.1 గంటల నావిగేషన్, 23.6 గంటల ఆన్‌లైన్ వీడియో ప్లేబ్యాక్, 27.7 గంటల మెసేజింగ్, 61.3 గంటల కాలింగ్, 136.2 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను అందిస్తుంది.

IP రేటింగ్: ఈ రెండింటిలో స్టాండర్డ్ మోడల్ డస్ట్, వాటర్ రెసిస్టెన్సీ కోసం IP66 + IP68 + IP69 రేటింగ్‌లతో కూడా వస్తుంది.

Realme Narzo 90 5G Camera Features
Realme Narzo 90 5G Camera Features (Photo Credit- Realme)

కెమెరా సెటప్: ఈ రెండు ఫోన్లలో "నార్జో 90 5G" చతురస్రాకారపు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్​తో వస్తుంది. దీనిలోని రెండు కెమెరాలు నిలువుగా ఒకదాని కింద ఒకటి ఉంటూ, వాటికి పక్కనే మధ్య భాగంలో మూడవ కెమెరా ఉంటుంది. అదే సమయంలో "నార్జో 90x 5G" డ్యూయెల్ కెమెరా సెటప్​తో దీర్ఘచతురస్రాకారపు డెకోతో వస్తుంది. దీనిలోని కెమెరాలు నిలువుగా అమరి ఉంటాయి.

Realme Narzo 90x 5G Camera Features
Realme Narzo 90x 5G Camera Features (Photo Credit- Realme)

"నార్జో 90 5G"లో రెండు కెమెరాలు 50-మెగాపిక్సెల్ కెమెరాలతో వస్తాయి. దీని మూడవ సెన్సార్ గురించి కంపెనీ ఇంకా ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. అయితే రెండు 50-మెగాపిక్సెల్ కెమెరాలతో భారత్​కు వస్తున్న ఏకైక ఫోన్ ఇదే అని కంపెనీ అంటోంది. అదే సమయంలో "నార్జో 90x 5G" వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ సోనీ AI కెమెరాతో వస్తుంది.

Realme Narzo 90 5G AI Features
Realme Narzo 90 5G AI Features (Photo Credit- Realme)

ఈ "నార్జో 90" సిరీస్ ఫోన్లు AI ఎడిట్ జీనీ, AI ఎడిటర్, AI ఎరేజర్, AI అల్ట్రా క్లారిటీతో సహా వివిధ AI టూల్స్​ను అందిస్తాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్​ల కోసం ఈ రెండు ఫోన్లు హోల్ పంచ్ డిస్‌ప్లే కటౌట్‌లతో వస్తాయి. లాంఛ్ అనంతరం ఈ రెండు ఫోన్లు రియల్​మీ ఇండియా వెబ్​సైట్​తో పాటు అమెజాన్​లో కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.