స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు షాక్.. 'రియల్‌మీ 16', '16 ప్రో', 'C83 5G' ధరలు భారీగా పెంపు!
రియల్‌మీ ఇండియా మరోసారి ధరల పెంపు నిర్ణయం తీసుకుంది. తాజా సవరణతో రియల్‌మీ 16, 16 ప్రో, సీ83 5జీ (C83 5G) మోడళ్ల ధరలు భారీగా పెరిగాయి

Published : July 7, 2026 at 2:27 PM IST
Hyderabad: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మీ భారతదేశంలో తన పలు మొబైల్ మోడళ్ల ధరలను మరోసారి పెంచింది. గడిచిన వారం రోజుల్లోనే కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవడం ఇది రెండోసారి కావడంతో వినియోగదారులపై అదనపు భారం పడనుంది. గత వారంలోనే కొన్ని మోడళ్ల ధరలను సవరించిన రియల్‌మీ, తాజాగా మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన రియల్‌మీ 16, రియల్‌మీ 16 ప్రో మోడళ్లతో పాటు బడ్జెట్ శ్రేణి 5G ఫోన్ అయిన రియల్‌మీ C83 5G ధరలను సైతం భారీగా పెంచింది.
సవరించిన ధరల వివరాలు ఇవే:
రియల్‌మీ 16 ప్రో: రియల్‌మీ 16 ప్రో ఈ ఏడాది జనవరిలో భారత్‌లో రూ. 31,999 ప్రారంభ ధరతో విడుదలైంది. అప్పటి నుంచి దీని ధరలో పలుమార్లు మార్పులు చోటుచేసుకున్నాయి. మొదట రూ. 39,999కి పెరిగిన ఈ ఫోన్ ధర, ఆ తర్వాత రూ. 2,000 తగ్గి రూ. 37,999కి చేరింది. తాజాగా మరోసారి రూ. 3,000 పెరిగి రూ. 40,999కి చేరింది. దీంతో 8GB RAM + 128GB స్టోరేజ్ కలిగిన బేస్ వేరియంట్ ధర గత ఆరు నెలల్లో మొత్తం రూ. 9,000 మేర పెరిగినట్లయింది.
Price hike alert 🚨
— Sanju Choudhary (@saaaanjjjuuu) July 6, 2026
realme increases the price of 16 series by up to ₹3K again within 10 days!
16 Pro (MTK 7300):
8/128GB: ₹37,999 → ₹40,999
8/256GB: ₹40,999 → ₹43,999
12/256GB: ₹43,999 → ₹46,999
16 5G (MTK 6400):
8/128GB: ₹34,999 → ₹35,999
8/256GB: ₹37,999 →… pic.twitter.com/7rhbLwNTX9
ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతల విషయానికొస్తే.. రియల్‌మీ 16 ప్రో మోడల్‌లో అత్యుత్తమ బ్రైట్‌నెస్‌తో కూడిన డిస్‌ప్లే, రోజంతా బ్యాకప్ ఇచ్చే పవర్‌ఫుల్ బ్యాటరీ, లౌడ్ స్పీకర్లు, అత్యంత పటిష్టమైన బిల్డ్ క్వాలిటీని అందించారు. అయితే, ఈ ధరలో లభించే చిప్‌సెట్ పవర్ యూజర్లకు నిరాశ కలిగించవచ్చు. ధర పెరిగినా స్పెసిఫికేషన్లలో మార్పులు లేకపోవడంతో, కొనుగోలుదారులు నథింగ్ ఫోన్ (4a) లేదా టెలిఫొటో కెమెరా అందించే మోటరోలా ఎడ్జ్ 70 ప్రో వంటి ప్రత్యామ్నాయాలను పరిశీలించవచ్చు.
ఒక వారంలోనే రెండోసారి పెరిగిన రియల్‌మీ 16 ధర: రియల్‌మీ 16 (Realme 16) స్మార్ట్‌ఫోన్ ధర కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే రెండోసారి పెరిగింది. మొదటిసారి పెంచినప్పుడు ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 34,999 కి చేరగా, తాజాగా మరోసారి సవరించిన ధరల ప్రకారం ఇది ఇప్పుడు రూ. 35,999 కి చేరుకుంది. 12GB RAM అండ్ 256GB స్టోరేజ్ వరకు అందించే మూడు వేరియంట్లు కూడా ఈ పెంపును పొందాయి.
కాగా, కాంపాక్ట్ డిజైన్, ఆకర్షణీయమైన సెల్ఫీ మిర్రర్ లుక్, పవర్‌ఫుల్ 7,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లతో మిడ్-రేంజ్ విభాగంలో ఈ ఫోన్ అన్ని హంగులూ ఉన్న అత్యుత్తమ మోడల్‌గా గుర్తింపు పొందింది.
రియల్‌మీ సీ83 5జీ ధర కూడా పెంపు: ఈ ఏడాది మార్చిలో మార్కెట్లోకి వచ్చిన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ సీ83 5జీ (Realme C83 5G) కూడా ఇదే బాట పట్టింది. లాంఛ్ సమయంలో దీని ధర రూ. 13,499 కాగా.. మొదటి విడతలో రూ. 3,000 పెరిగి రూ. 16,499 కి చేరింది. తాజాగా మరోసారి రూ. 1,000 పెరగడంతో ఈ ఫోన్ ధర ఇప్పుడు ఏకంగా రూ. 17,499కి చేరుకుంది. ఈ ధర 4GB RAM + 64GB స్టోరేజ్ కలిగిన బేస్ వేరియంట్‌కు వర్తిస్తుంది.
ధరలు పెరిగినప్పటికీ భారీ 7,000mAh బ్యాటరీ, 144Hz హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, స్మూత్ సాఫ్ట్‌వేర్ పనితీరు వంటి ప్రత్యేకతలతో ఈ బడ్జెట్ హ్యాండ్‌సెట్ మార్కెట్లో తన ఉనికిని కొనసాగిస్తోంది.

