రియల్మీ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చింది- ధర ఎంతంటే?
మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC, 7,000mAh బ్యాటరీతో రియల్మీ 16x 5G భారతదేశంలో విడుదలైంది.

Published : August 12, 2026 at 3:20 PM IST
Hyderabad: రియల్మీ భారతదేశంలో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసింది. రియల్మీ 16x 5G పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రెండు రంగుల ఎంపికలలో లభిస్తుంది. ఇది 7,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ను అందించారు. ఇది గరిష్ఠంగా 256GB స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ధూళి, నీటి నుంచి రక్షణ కోసం IP65 రేటింగ్‌తో వస్తుంది. అలాగే 144Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేసే 6.8-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. మరెందుకు ఆలస్యం దీని ధర, ఇతర ఫీచర్లపై మరిన్ని వివరాలను తెలుసుకుందాం రండి.
రియల్మీ 16x 5G వేరియంట్లు: కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను మూడు RAM & స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో ప్రవేశపెట్టింది.
The all-new #realme16x 5G packs everything you need for super smooth performance from a 7000mAh Big Battery to a smooth 144Hz Display and much more, to keep every day effortless.
— realme (@realmeIndia) August 12, 2026
Stay Smooth. Stay Unstoppable.
Starting at just ₹23,999*
Sale Starts 13th Aug, 12PM
*T&C apply… pic.twitter.com/1TLY23ShtN
- 4GB RAM + 128GB స్టోరేజ్
- 6GB RAM + 128GB స్టోరేజ్
- 6GB RAM + 256GB స్టోరేజ్
వేరియంట్ల వారీగా దీని ధరలు:
- 4GB RAM + 128GB స్టోరేజ్ ధర: రూ. 25,999
- 6GB RAM + 128GB స్టోరేజ్ ధర: రూ. 27,999
- 6GB RAM + 256GB స్టోరేజ్ ధర: రూ. 30,999
లాంఛ్ ఆఫర్‌లో భాగంగా, కొనుగోలుదారులు రూ. 2,000 వరకు తగ్గింపును లేదా రూ. 3,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు. దీనివల్ల 'రియల్మీ 16x 5G' ప్రారంభ ధర రూ. 23,999కి తగ్గుతుంది. అంతేకాకుండా, కొనుగోలుదారులు 10 నెలల వరకు 'నో-కాస్ట్ EMI' సదుపాయాన్ని కూడా పొందవచ్చు.
| వేరియంట్లు | అసలు ధరలు | డిస్కౌంట్ ధరలు |
| 4GB + 128GB | రూ. 25,999 | రూ. 23,999 |
| 6GB + 128GB | రూ. 27,999 | రూ. 25,999 |
| 6GB + 256GB | రూ. 30,999 | రూ. 28,999 |
కలర్ ఆప్షన్లు: ఇది భారత మార్కెట్లో రెండు రంగు ఎంపికలలో లభిస్తుంది. అవి:
- ఎండ్యూరెన్స్ బ్రౌన్ (Endurance Brown)
- గ్లోరీ వైట్ (Glory White)
సేల్ వివరాలు: ఈ కొత్త ఫోన్ ఆగస్టు 13న మధ్యాహ్నం 12 గంటల నుంచి Flipkart, Realme India వెబ్‌సైట్ ద్వారా అమ్మకానికి రానుంది.
రియల్మీ 16x 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
డిస్ప్లే: ఇందులో 6.8 అంగుళాల HD+ (720x1,570 పిక్సెల్స్) LCD ప్యానెల్ ఉంది. ఇది 144Hz వరకు రిఫ్రెష్ రేట్, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్, 1200 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ (HBM)ను అందిస్తుంది. ఈ ఫోన్‌లో 5,300 sq mm 'AirFlow' వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. అలాగే, ఇందులో కంపెనీ స్వయంగా అభివృద్ధి చేసిన 'GT Boost' గేమింగ్ ఆప్టిమైజేషన్ ఇంజిన్ కూడా ఉంది.
ఆపరేటింగ్ సిస్టమ్: డ్యూయల్-సిమ్ (నానో) సదుపాయం కలిగిన ఈ 'రియల్మీ 16x 5G' స్మార్ట్‌ఫోన్ Android 16 ఆధారిత Realme UI 7.0పై పనిచేస్తుంది.
ప్రాసెసర్: ఈ ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో వస్తుంది. దీనికి గరిష్ఠంగా 6GB RAM, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ జతచేశారు.
కెమెరా సెటప్: ఇందులో f/1.8 అపెర్చర్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్‌ల కోసం, ఇందులో f/2.0 అపెర్చర్‌తో కూడిన 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.
బ్యాటరీ: ఈ హ్యాండ్‌సెట్‌లో 7,000mAh బ్యాటరీ ఉంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
IP రేటింగ్: రియల్మీ 16x 5G ఫోన్ IP65-రేటెడ్ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ (ధూళి, నీటి నిరోధకత) సామర్థ్యాన్ని కలిగి ఉంది.
AI ఫీచర్లు: ఈ ఫోన్ AI Eraser, AI Ultra Clarity, Motion Photo, Dual-View Video Mode వంటి AI-ఆధారిత ఫీచర్లను అందిస్తుంది.
కనెక్టివిటీ ఆప్షన్లు: దీని కనెక్టివిటీ ఎంపికలలో Wi-Fi, 5G, Bluetooth 5.3, USB Type-C పోర్ట్ ఉన్నాయి. ఇది రియల్మీ సొంత 'Flux Engine'తో వస్తుంది.
| ఫీచర్లు, స్పెసిఫికేషన్లు | వివరాలు |
| డిస్ప్లే | 144Hz | 6.8-అంగుళాల AMOLED |
| ప్రాసెసర్ | మీడియాటెక్ డైమెన్సిటీ 6300 |
| RAM + స్టోరేజ్ | 4GB + 128GB |
| 6GB + 128GB | |
| 6GB + 256GB | |
| రియర్ కెమెరాలు | 50MP (మెయిన్) AI కెమెరా |
| ఫ్రంట్ కెమెరా | 8MP |
| బ్యాటరీ | 7,000mAh |
| ఛార్జింగ్ కెపాసిటీ | 45W (వైర్డ్) | 6.5W (వైర్డ్ రివర్స్) |
| ఆపరేటింగ్ సిస్టమ్ (OS) | RealmeUI 7.0 based on Android 16 |
| OS అప్‌గ్రేడ్స్ & సెక్యూరిటీ ప్యాచెస్ | OS upgrades: 2 years Security patches: 3 years |

