ETV Bharat / technology

ఒప్పో K14 5G లాంఛ్ డేట్ ఫిక్స్- లభ్యత, కలర్ ఆప్షన్లు కూడా రివీల్

ఒప్పో K14 5G ఇండియా లాంఛ్ తేదీ వెల్లడయింది. కంపెనీ దీని లభ్యత, రంగులను కూడా ధృవీకరించింది.

Oppo K14 5G India Launch Date Announced Along With Availability, Colourways
Oppo K14 5G India Launch Date Announced Along With Availability, Colourways (Photo Credit- Oppo)
author img

By ETV Bharat Tech Team

Published : March 3, 2026 at 3:31 PM IST

2 Min Read
Choose ETV Bharat

Hyderabad: చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో తన "K14" లైనప్‌లో మొదటి ఫోన్‌గా "ఒప్పో K14x 5G"ను ఇటీవలే భారతదేశంలో విడుదల చేసింది. ఈ ఫోన్ 6.75-అంగుళాల HD+ LCD స్క్రీన్, 6,500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇప్పుడు ఈ కొత్త లైనప్‌లో భాగంగా మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

ఒప్పో K14 5G పేరుతో ఈ ఫోన్ మార్చి రెండవ వారంలో లాంఛ్ చేయనున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా ఈ అప్​కమింగ్ స్మార్ట్​ఫోన్ కోసం ఓ ప్రత్యేకమైన మైక్రోసైట్ ఇప్పుడు రన్ అవుతోంది. ఇది దీని డిజైన్, రంగు ఎంపికలు, బ్యాటరీ సామర్థ్యంతో సహా దాని గురించి వివిధ వివరాలను ధృవీకరిస్తుంది.

లాంఛ్ తేదీ: కంపెనీ తన కొత్త "ఒప్పో K14 5G" ఫోన్​ను మార్చి 9న మధ్యాహ్నం 12 గంటలకు భారతదేశంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అదనంగా ఈ అప్​కమింగ్ స్మార్ట్‌ఫోన్ కోసం ప్రత్యేక మైక్రోసైట్‌ ఫ్లిప్‌కార్ట్‌లో రన్ అవుతోంది. అంటే ఇది లాంఛ్ అనంతరం ఈ ప్లాట్​ఫామ్ ద్వారా అందుబాటులో ఉంటుందని స్పష్టమవుతోంది. అంతేకాక ఈ స్మార్ట్​ఫోన్ ఒప్పో ఇండియా ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కూడా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఇక కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే, ఈ అప్​కమింగ్ స్మార్ట్​ఫోన్ ఊదా, తెలుపు రంగు ఎంపికలలో లభిస్తుంది.

ఈ ఫోన్​లో 7,000mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ "ఒప్పో K14 5G" ColorOSపై నడుస్తుంది, అయితే ఏ వెర్షన్‌ అనేది ఇంకా వెల్లడించలేదు. డిజైన్ పరంగా, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, LED ఫ్లాష్‌ను కలిగి ఉన్నట్లు కన్పిస్తోంది, వీటిని స్క్వేర్ ఆకారపు కెమెరా మాడ్యూల్ లోపల అమర్చారు.

ఒప్పో K14 5G వెనుక భాగంలో క్రిస్టల్ లాంటి ప్యాటర్న్ కూడా ఉంటుంది. ఫ్లాట్ రియర్ ప్యానెల్ దిగువ-ఎడమ మూలలో ఒప్పో బ్రాండింగ్ కూడా కనిపిస్తుంది. హ్యాండ్‌సెట్ కుడి వైపున పవర్ బటన్, వాల్యూమ్ కంట్రోల్స్ ఉంటాయి. ఇది గుండ్రని మూలలతో ఫ్లాట్ మెటల్ ఫ్రేమ్‌ను కూడా కలిగి ఉండవచ్చు. అదే సమయంలో SIM ట్రే స్లాట్ ఒప్పో K14 5G ఎడమ వైపున ఉంటుంది.

ఇకపోతే కంపెనీ ఈ సిరీస్​లో తొలి "ఒప్పో K14x 5G" స్మార్ట్​ఫోన్​ను ఫిబ్రవరి 10న భారతదేశంలో ప్రారంభించింది. దీని బేస్ 4GB+128GB RAM, స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ధర రూ. 14,999. ఈ హ్యాండ్‌సెట్ ఐసీ బ్లూ, ప్రిజం వైలెట్ రంగులలో లభిస్తుంది. ఈ ఫోన్​లో 6.75-అంగుళాల HD+ (720x1,570 పిక్సెల్స్) LCD స్క్రీన్‌ ఉంది. ఇది 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను, 1,125 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఈ స్మార్ట్​ఫోన్​లో ARM Mali-G57 MC2 GPUతో జతయిన ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్​ ఉంది. ఇది 6500mAh బ్యాటరీతో వస్తుంది.