ETV Bharat / technology

చాట్​జీపీటీ యూజర్లకు గుడ్​న్యూస్- GPT 5.1 అప్డేట్ రిలీజ్

ఓపెన్​ఏఐ నుంచి మరో రెండు ఏఐ మోడల్స్- ఇవి ఎలా ఉపయోగపడతాయంటే?

OpenAI Rolls Out GPT 5.1 Update
OpenAI Rolls Out GPT 5.1 Update (Photo Credit- Getty Images)
author img

By ETV Bharat Tech Team

Published : November 13, 2025 at 5:53 PM IST

2 Min Read
Choose ETV Bharat

Hyderabad: టెక్ దిగ్గజం ఓపెన్ఏఐ తన కొత్త GPT 5.1 అప్​డేట్​ను చాట్​జీపీటీ కోసం విడుదల చేసింది. ఇది వినియోగదారులకు రెండు అధునాతన ఏఐ మోడల్స్​ను అందిస్తుంది. అవి: GPT-5.1 Instant, GPT-5.1 Thinking. సామ్ ఆల్ట్‌మాన్ నేతృత్వంలోని కంపెనీ ఒక బ్లాగ్ పోస్ట్‌లో ఈ వెర్షన్‌లు "స్మార్ట్‌ మాత్రమే కాదు, సంభాషించడానికి కూడా ఆనందదాయకం" అని తెలిపింది.

ఓపెన్ఏఐ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, వీటిని వినియోగదారులకు వ్యక్తిగతీకరించిన చాట్​జీపీటీ అనుభవాన్ని అందించేందుకు రూపొందించారు. అంటే ఈ మోడళ్లను ఉపయోగించి చాట్​జీపీటీ AI టోన్, శైలిని సర్దుబాటు చేసుకోవచ్చు. ఇప్పుడు చాట్‌బాట్ ఏ టోన్​లో మీతో సంభాషించాలనుకుంటున్నారో ఆ ప్రాధాన్యతలను సెట్ చేసుకోవచ్చు. తద్వారా చాట్​జీపీటీ మీరు కోరుకున్న టోన్​తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంది.

GPT 5.1 Instantలో కొత్తగా ఏం ఉంది?:

ఓపెన్​ఏఐ GPT-5.1 ఇన్‌స్టంట్‌ను డిఫాల్ట్‌గా "Warmer", "More Conversational"అని వర్ణించింది. దీంతోపాటు ప్రారంభ పరీక్షల ఆధారంగా ఇది చాలా స్పష్టమైన సమాధానాలను అందిస్తూ ఉపయోగకరంగా ఉంటుందని, అదే సమయంలో ఉల్లాసభరితమైన పనితీరుతో ప్రజలను ఆశ్చర్యపరుస్తుందని ఒక బ్లాక్ పోస్ట్​లో పేర్కొంది. GPT-5.1 ఇన్‌స్టంట్‌ను సూచనలకు మరింత ప్రతిస్పందించేలా మార్చినట్లు ఓపెన్​ఏఐ తెలిపింది. దీంతో ఇది సంభాషణల ప్రవాహాన్ని మరింత మెరుగుపరుస్తుందని వివరించింది. శీఘ్ర సమాధానాలను అందిస్తూనే సరళమైన, కచ్చితమైన సమాధానాలను అందించడమే దీని లక్ష్యం.

GPT 5.1 Thinkingలో కొత్తవి ఏంటి?: మరోవైపు GPT-5.1 Thinkingను డీప్ రీజనింగ్ టాస్క్​ల కోసం రూపొందించారు. ప్రశ్నల గురించి మరింత కచ్చితంగా ఆలోచించడానికి, సంక్లిష్ట సమస్యలపై ఎక్కువ సమయం గడుపుతూనే సాధారణ ప్రాంప్ట్‌లకు త్వరగా స్పందించడానికి ఇది శిక్షణ పొందింది. ఈ కొత్త మోడల్ మునుపటి వెర్షన్ కంటే స్పష్టమైన సమాధానాలను అందిస్తుంది. దీంతో ఇది కార్యాలయంలో సంక్లిష్టమైన పనులను పూర్తి చేయడానికి, సాంకేతిక భావనలను వివరించడానికి మంచి ఆప్షన్​గా ఉంటుంది.

అందుబాటులోకి ఎప్పుడు?: ఈ రెండు "GPT-5.1 ఇన్‌స్టంట్", "GPT-5.1 థింకింగ్" మోడల్​లు నవంబర్ 13 నుంచి పెయిడ్ చాట్​జీపీటీ (ప్రో, ప్లస్, గో, బిజినెస్) వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయని కంపెనీ ప్రకటించింది. ఉచిత, logged-out వినియోగదారులకు ఆ తర్వాత కొన్ని రోజుల్లో వీటికి యాక్సెస్ లభిస్తుంది. అయితే వీటి రోల్ అవుట్ క్రమంగా జరుగుతుందని, కాబట్టి లభ్యత వినియోగదారుని బట్టి మారవచ్చని ఓపెన్​ఏఐ చెబుతోంది. దీంతోపాటు "GPT-5 Pro" వెర్షన్ త్వరలో "GPT-5.1 Pro"కి అప్‌గ్రేడ్ అవుతుందని కూడా ధృవీకరించింది.

చాట్​జీపీటీ టోన్, స్టైల్ కస్టమైజ్ ఆప్షన్స్: ఈ మోడల్ మెరుగుదలలతో పాటు చాట్​జీపీటీ దాని టోన్, శైలిని అనుకూలీకరించడానికి వినియోగదారులకు ఎంపికలను కూడా అందిస్తోంది. అందుబాటులో ఉన్న ఎనిమిది శైలులు కింది విధంగా ఉన్నాయి:

  • Default
  • Friendly (Formerly Listener)
  • Efficient (Formerly Robot)
  • Professional
  • Candid
  • Quarky
  • Cynical (Formerly Cynic)
  • Nerdy (Formerly Nerd)

ఈ ప్రీసెట్‌లతో పాటు మరింత కచ్చితమైన నియంత్రణను కోరుకునే వినియోగదారుల కోసం కొత్త వ్యక్తిగతీకరణ ఎంపికలపై కూడా పనిచేస్తున్నట్లు ఓపెన్​ఏఐ తెలిపింది.