8,000mAh బ్యాటరీతో వన్‌ప్లస్ N6 లాంఛ్- ధర, ఆఫర్ల వివరాలు ఇవే!
8,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6360 అపెక్స్ చిప్‌సెట్‌తో వన్‌ప్లస్ N6 స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో విడుదలైంది.

Published : June 30, 2026 at 2:39 PM IST
Hyderabad: వన్‌ప్లస్ N6 స్మార్ట్‌ఫోన్ మంగళవారం భారత మార్కెట్లో లాంఛ్ అయింది. నార్డ్ లైనప్ కంటే దిగువన ఉండే కొత్త 'N' సిరీస్‌లో కంపెనీ నుంచి వచ్చిన మొదటి ఫోన్ ఇది. ఈ ఎంట్రీ-లెవల్ వన్‌ప్లస్ ఫోన్‌లో ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6000 సిరీస్ చిప్‌సెట్ ఉంది. 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 8,000mAh బ్యాటరీని ఇందులో అమర్చారు. దీని వెనుక భాగంలో స్క్వేర్ షేప్ కెమెరా మాడ్యూల్‌లో ఒకే ఒక కెమెరా ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాలింగ్‌ల కోసం ఫోన్ ముందు హోల్ పంచ్ డిస్‌ప్లే కటౌట్‌లో 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.
వన్‌ప్లస్ N6 వేరియంట్లు: కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను రెండు RAM & స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో విడుదల చేసింది.
- 4GB RAM + 128GB స్టోరేజ్
- 6GB RAM + 128GB స్టోరేజ్
వేరియంట్ల వారీగా దీని ధరలు:
- 4GB RAM + 128GB స్టోరేజ్ ధర: రూ. 22,999
- 6GB RAM + 128GB స్టోరేజ్ ధర: రూ. 24,999
కంపెనీ దీనిపై రూ.1,000 ప్రైమ్ డే ఎక్స్‌క్లూజివ్ డిస్కౌంట్ ఇస్తోంది. యాక్సిస్ బ్యాంక్, SBI క్రెడిట్ కార్డులతో రూ.2,000 తక్షణ తగ్గింపు కూడా ఉంది. కస్టమర్లు ఆరు నెలల వరకు నో-కాస్ట్ EMI సదుపాయాన్ని కూడా వినియోగించుకోవచ్చు.
కలర్ ఆప్షన్లు: ఇది రెండు రంగు ఎంపికలలో లభిస్తుంది.
- ఫ్రెష్ మింట్
- మిడ్‌నైట్ గ్రీన్
సేల్ వివరాలు: భారతదేశంలో ఈ కొత్త 'N' సిరీస్ హ్యాండ్‌సెట్ సేల్స్ జులై 4 నుంచి అమెజాన్ ద్వారా ప్రారంభం కానున్నాయి.
వన్‌ప్లస్ N6 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
డిస్‌ప్లే: వన్‌ప్లస్ N6లో 6.75 అంగుళాల HD LCD టచ్‌స్క్రీన్ ఉంది. ఇది 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను, HBM (హై బ్రైట్‌నెస్ మోడ్)లో 1,200 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది.
ప్రాసెసర్: ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6360 అపెక్స్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇది AnTuTu బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫామ్‌పై వన్‌ప్లస్ N6 6,15,800 పాయింట్లకు పైగా స్కోర్ చేసిందని కంపెనీ పేర్కొంది. ఇది 6GB వరకు RAM, 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం వన్‌ప్లస్ N6లో వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అమర్చారు. ఇది 5,300 sq mm హీట్ డిస్సిపేషన్ ఏరియాను కలిగి ఉంది.
కెమెరా సెటప్: కెమెరా విషయానికొస్తే, వన్‌ప్లస్ N6 వెనుక f/1.8 అపెర్చర్‌తో 50-మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా ఉంది. ఇది 10x వరకు డిజిటల్ జూమ్‌కు సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ఈ కొత్త N సిరీస్ ఫోన్‌తో 1080p/60 fps వరకు వీడియోలు రికార్డ్ చేయొచ్చు. ఇందులో డ్యూయల్-వ్యూ వీడియో మోడ్ కూడా ఉంది.
బ్యాటరీ: వన్‌ప్లస్ N6లో 8,000mAh బ్యాటరీ ఉంది. 1,600 ఫుల్ ఛార్జ్ సైకిల్స్ తర్వాత కూడా ఇది 80 శాతం వరకు ఒరిజినల్ కెపాసిటీని రిటైన్ చేస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ హ్యాండ్‌సెట్ మూడు రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని వన్‌ప్లస్ పేర్కొంది. ఇది 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 6.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
IP రేటింగ్: ఈ ఫోన్ దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP65 రేటింగ్ వస్తుంది. ఇది MIL-STD-810H మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్‌ను కూడా కలిగి ఉందని కంపెనీ పేర్కొంది.
ఆపరేటింగ్ సిస్టమ్: ఈ డ్యూయల్ సిమ్ సపోర్టెడ్ హ్యాండ్‌సెట్ సరికొత్త Android 16 ఆధారిత OxygenOS 16పై నడుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు రెండు ప్రధాన OS అప్‌గ్రేడ్‌లు, మూడేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తామని కంపెనీ హామీ ఇస్తోంది.

