ETV Bharat / technology

'వన్​ప్లస్ 15' భారత్​కు వచ్చేసిందోచ్- ధర ఎంతో తెలుసా?

భారత మార్కెట్​లో వన్​ప్లస్ 15 లాంఛ్- ధర, ఫీచర్ల వివరాలు ఇవే!

Oneplus 15 Launched in India
Oneplus 15 Launched in India (Image Credits: OnePlus)
author img

By ETV Bharat Tech Team

Published : November 13, 2025 at 7:45 PM IST

4 Min Read
Choose ETV Bharat

Hyderabad: వన్​ప్లస్ అభిమానులకు గుడ్​న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న "వన్​ప్లస్ 15" ఫోన్ భారత్​ మార్కెట్​లోకి ఎంట్రీ ఇచ్చింది. కంపెనీ ఈ ఫ్లాగ్​షిప్ స్మార్ట్​ఫోన్ ఇండియన్ వెర్షన్​ను స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 SoCతో తీసుకొచ్చింది. ఈ చిప్​సెట్​ను క్వాల్కమ్ ఇటీవలే ఫ్లాగ్‌షిప్ మొబైల్ ప్రాసెసింగ్ కోసం ప్రకటించింది. ఇప్పుడు ఈ చిప్​సెట్​తో భారతదేశంలో విడుదలైన తొలి స్మార్ట్​ఫోన్​గా "వన్​ప్లస్ 15" నిలిచింది.

ఇకపోతే గతేడాది విడుదలైన "వన్​ప్లస్ 13"కు సక్సెసర్​గా దీన్ని తీసుకొచ్చారు. ఇది దాని ప్రవీయస్ మోడల్ కంటే వివిధ అప్‌గ్రేడ్‌లను అందిస్తోంది. వన్​ప్లస్ ఈ ఫోన్​ను ఇటీవలే అక్టోబర్ 27, 2025న తన స్వదేశీ మార్కెట్​ చైనాలో విడుదల చేయగా తాజాగా భారత్​కు తీసుకొచ్చింది. మరెందుకు ఆలస్యం దీని ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం రండి.

వన్​ప్లస్ 15 వేరియంట్లు: కంపెనీ భారత మార్కెట్​లోకి దీన్ని రెండు వేరియంట్లలో తీసుకొచ్చింది.

  • 12GB RAM + 256GB స్టోరేజ్‌
  • 16GB RAM + 256GB స్టోరేజ్

వేరియంట్లవారీగా దీని ధరలు:

  • 12GB RAM + 256GB స్టోరేజ్​తో దీని ధర: రూ. 72, 999
  • 16GB RAM + 256GB స్టోరేజ్​తో దీని ధర: రూ. 79, 999

ఆఫర్లు: కంపెనీ వీటిపై లాంఛ్ ఆఫర్లను ప్రకటించింది. HDFC బ్యాంక్ కార్డు ద్వారా దీన్ని కొనుగోలు చేసిన కస్టమర్లకు రూ.4,000 డిస్కౌంట్​ను అందిస్తోంది. ఇది ఈ రెండు వేరియంట్లకూ వర్తిస్తుంది. అంటే ఈ ఆఫర్​లో దీని బేస్​ మోడల్​ రూ. 68,999, హై-ఎండ్ వేరియంట్ రూ.75,999లకే లభిస్తుంది.

సేల్ వివరాలు: ఈ "వన్​ప్లస్ 15" ఫోన్ ఇవాళ అంటే నవంబర్ 13 రాత్రి 8 గంటల నుంచి కంపెనీ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా భారత్​లో అమ్మకానికి వస్తుంది.

వన్​ప్లస్ 15 ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:

డిస్​ప్లే: ఫోన్ 165Hz వరకు రిఫ్రెష్ రేట్, 1.5K (1,272x2,772 పిక్సెల్స్) రిజల్యూషన్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 330Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్, 450 ppi పిక్సెల్ డెన్సిటీతో 6.78-అంగుళాల మూడవ తరం BOE ఫ్లెక్సిబుల్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్క్రీన్ 100 శాతం DCI-P3 కలర్ గామట్, 1.07 బిలియన్ కలర్లకు కూడా మద్దతు ఇస్తుంది.

బ్యాటరీ కెపాసిటీ: ఈ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ 7,300mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 120W సూపర్ ఫ్లాష్ ఛార్జ్ వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్​ను అందిస్తుంది.

పెర్ఫార్మెన్స్ ట్రై-చిప్: స్మార్ట్​ఫోన్ G2 WiFi చిప్, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో టచ్ రెస్పాన్స్ చిప్‌తో వస్తుంది. "G2 WiFi" చిప్‌ను వన్​ప్లస్ స్వయంగా నిర్మించి అభివృద్ధి చేసిందని గమనించాలి. వీటితో ఈ ఫోన్ బలహీనమైన Wi-Fi సిగ్నల్‌లతో కూడా వేగవంతమైన అప్‌లోడ్, డౌన్‌లోడ్ వేగాన్ని అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

కెమెరా సెటప్: ఆప్టిక్స్ విషయానికొస్తే "వన్​ప్లస్ 15" ట్రిపుల్-రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. దీనికి 24mm ఫోకల్ లెంగ్త్‌తో 50-మెగాపిక్సెల్ (f/1.8) ప్రైమరీ షూటర్ ఉంది. ఇది 50-మెగాపిక్సెల్ (f/2.0) అల్ట్రావైడ్ కెమెరా, 50-మెగాపిక్సెల్ (f/1.8) టెలిఫొటో కెమెరాను కూడా కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్​ల కోసం ఈ ఫోన్ ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ (f/2.4) సెల్ఫీ కెమెరాను అందించారు. దీని వెనుక కెమెరా సెటప్ 30 fps వద్ద 8K రిజల్యూషన్ వీడియోలను షూట్ చేయగలదు.

ఆన్‌బోర్డ్ సెన్సార్ల జాబితాలో ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్, కలర్ టెంపరేచర్ సెన్సార్, ఎలక్ట్రానిక్ కంపాస్, యాక్సిలరేషన్ సెన్సార్, గైరోస్కోప్, హాల్ సెన్సార్, లేజర్ ఫోకస్ సెన్సార్, స్పెక్ట్రమ్ సెన్సార్, IR బ్లాస్టర్ ఉన్నాయి.

ఆపరేటింగ్ సిస్టమ్: ఈ ఫోన్ లేటెస్ట్ ఆక్సిజన్ OS 16పై నడుస్తుంది.

సెక్యూరిటీ, కనెక్టివిటీ ఫీచర్లు: భద్రత కోసం ఇది ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను కూడా కలిగి ఉంది. ఇక కనెక్టివిటీ ఆప్షన్ల విషయానికి వస్తే ఈ ఫోన్ 5G, Wi-Fi 7, NFC, Beidou, GPS, GLONASS, గెలీలియో, QZSSలకు మద్దతు ఇస్తుంది.

కొలతలు, బరువు: ఇది 161.42x76.67x8.10mm కొలతలతో 211 గ్రాముల బరువు ఉంటుంది.

SpecificationDetails
ProcessorSnapdragon 8 Elite Gen 5
Display6.78-inch 1.6K LTPO AMOLED, 165Hz refresh rate
RAM and StorageRAM up to 16GB RAM and storage up to 512GB
OS and AI featuresBased on Oxygen OS 16, equipped with many special AI features
Camera setup50MP main camera + 50MP ultrawide + 50MP periscope telephoto (3.5x optical zoom); DetailMax image engine (no Hasselblad camera system this time)
Battery & Charging7,300mAh Silicon Carbon battery, 120W wired fast charging, 50W wireless charging support
Design noteThis time, a square triple camera module will be offered at the rear, while a circular camera module was being offered till last year