నథింగ్ ఫోన్ 4b వచ్చేసింది- ఆకట్టుకుంటున్న 'RCB' ఎడిషన్- ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
6,000mAh బ్యాటరీ, గ్లిఫ్ బార్ ఇంటర్‌ఫేస్‌తో 'నథింగ్ ఫోన్ 4b' భారతదేశంలో విడుదలైంది. దీనితోపాటు కంపెనీ 'ఫోన్ 4b RCB' ఎడిషన్‌ను కూడా తీసుకొచ్చింది.

Published : July 7, 2026 at 4:46 PM IST
Hyderabad: టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సరికొత్త 'నథింగ్ ఫోన్ 4b' (Nothing Phone 4b) భారత మార్కెట్లో అధికారికంగా లాంఛ్ అయింది. కంపెనీ నుంచి వస్తున్న మొదటి బడ్జెట్ 'b' సిరీస్ ఫోన్ ఇదే కావడం విశేషం. దీనితో పాటే ఐపీఎల్ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాక్-టు-బ్యాక్ టైటిల్స్ గెలిచిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా 'నథింగ్ ఫోన్ 4b ఆర్‌సీబీ ఎడిషన్' (Nothing Phone 4b RCB Edition)ను కూడా కంపెనీ ఆవిష్కరించింది.
ఆకర్షణీయమైన మ్యాట్ రెడ్ ఫినిషింగ్, వెనుక భాగంలో ఆర్‌సీబీ (RCB) లయన్ లోగోతో వస్తున్న ఈ లిమిటెడ్ ఎడిషన్ కేవలం బెంగళూరులోని నథింగ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్‌లో మాత్రమే లభిస్తుంది. పరిమిత సంఖ్యలో (Limited Stock) ఉన్న ఈ ఫోన్లను 'ముందు వచ్చిన వారికే ప్రాధాన్యత' అనే ప్రాతిపదికన విక్రయిస్తున్నారు.
బెంగళూరులోని నథింగ్ స్టోర్‌లో జరుగుతున్న 'లిమిటెడ్ డ్రాప్ ఈవెంట్' (Limited drop event) ద్వారా ఈ ఆర్‌సీబీ ఎడిషన్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. అయితే 'నథింగ్ ఫోన్ 4b' మోడల్ మాత్రం వచ్చే వారం నుంచి దేశవ్యాప్తంగా విక్రయానికి రానుంది.
నథింగ్ ఫోన్ 4b వేరియంట్లు: కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను రెండు RAM & స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో ప్రవేశపెట్టింది.
- 8GB RAM + 128GB స్టోరేజ్
- 8GB RAM + 256GB స్టోరేజ్
వేరియంట్ల వారీగా దీని ధరలు:
- 8GB RAM + 128GB స్టోరేజ్ ధర: రూ. 34,999
- 8GB RAM + 256GB స్టోరేజ్ ధర: రూ. 38,999
కంపెనీ దీనిపై 7.5 శాతం తక్షణ బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా అందిస్తోంది.
కలర్ ఆప్షన్లు: ఇది మూడు రంగులలో లభిస్తుంది.
- బ్లాక్ (Black)
- బ్లూ (Blue)
- వైట్ (White)
సేల్ వివరాలు: భారతదేశంలో ఈ 'నథింగ్ ఫోన్ 4b' స్మార్ట్‌ఫోన్ సేల్స్ జులై 14న ప్రారంభం కానున్నాయి. ఆసక్తి ఉన్న కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్ వంటి ఆఫ్‌లైన్ రిటైలర్లను సంప్రదించడం ద్వారా కొనుగోలు చేయొచ్చు.
నథింగ్ ఫోన్ 4b ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
డిస్‌ప్లే: ఇందులో 6.77-అంగుళాల Full-HD+ (1,080 x 2,344 పిక్సెల్స్) Samsung Super AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 1,000Hz ఇన్‌స్టంట్ శాంప్లింగ్ రేట్, 480Hz PWM డిమ్మింగ్, 2,000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్, 16.7 మిలియన్ల రంగులు, AGC DT-Star 2 ప్రొటెక్షన్‌ను అందిస్తుంది.
ప్రాసెసర్: ఇందులో 4nm ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్‌సెట్‌ను అందించారు. దీనితో పాటు Adreno 810 GPU, Qualcomm Hexagon NPU, Qualcomm AI Engine, Qualcomm Spectra ISP కూడా ఉన్నాయి.
ఈ ఫోన్‌లో 8GB LPDDR4x RAM, గరిష్ఠంగా 256GB UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. ఉష్ణోగ్రత నియంత్రణ (thermal management) కోసం, ఇందులో 4,400 sq mm హీట్ డిసిపేషన్ విస్తీర్ణం కలిగిన 'వేపర్ ఛాంబర్ కూలింగ్' వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు.
నథింగ్ ఫోన్ (4b) వెనుక భాగంలో 45 మినీ-LED లతో కూడిన గ్లిఫ్ బార్ ఇంటర్‌ఫేస్ కూడా ఉంది. ఈ గ్లిఫ్ బార్‌లో విడివిడిగా నియంత్రించుకోగలిగే నాలుగు జోన్లు ఉన్నాయి. ఇది రికార్డింగ్ లైట్, గ్లిఫ్ టైమర్, ఎసెన్షియల్ నోటిఫికేషన్లు, లైవ్ అప్‌డేట్స్, వాల్యూమ్ ఇండికేటర్, గ్లిఫ్ టార్చ్, గ్లిఫ్ ప్రోగ్రెస్ వంటి ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. వీటితో పాటు ఫ్లిప్ టు గ్లిఫ్, ఫ్లిప్ టు రికార్డ్, ఎన్‌ఎఫ్‌సీ (NFC) ఇండికేటర్, బెడ్‌టైమ్ షెడ్యూల్, కెమెరా కౌంట్‌డౌన్ వంటి మరికొన్ని అధునాతన ఆప్షన్లు కూడా ఇందులో లభిస్తాయి.
కెమెరా సెటప్: నథింగ్ ఫోన్ 4b డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ (f/1.8) ప్రైమరీ షూటర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దీనిలో 1/2.76-అంగుళాల శాంసంగ్ సెన్సార్, 74.2-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ ఆటోఫోకస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీంతోపాటు 119.5-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ, 1/4-అంగుళాల సెన్సార్‌తో కూడిన 8-మెగాపిక్సెల్ (f/2.2) అల్ట్రావైడ్-యాంగిల్ కెమెరా కూడా ఉంది.
ఇక సెల్ఫీలు, వీడియో కాలింగ్‌లో కోసం ఫోన్ ముందు భాగంలో 1/3-అంగుళాల శాంసంగ్ సెన్సార్, 81.8-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో కూడిన 16-మెగాపిక్సెల్ (f/2.4) సెల్ఫీ కెమెరా అందించారు. ఇది 4K/30 fps వరకు వీడియోను రికార్డ్ చేయగలదు.
బ్యాటరీ: ఇందులో 6,000mAh బ్యాటరీ ఉంది. ఇది 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 7.5W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ సుమారు 80 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది.
IP రేటింగ్: ఈ ఫోన్ దుమ్ము, నీటి తుంపర్ల (స్ప్లాష్) నుంచి రక్షణ కోసం IP64 రేటింగ్‌తో వస్తుందని కంపెనీ పేర్కొంది.
ఆపరేటింగ్ సిస్టమ్: ఈ డ్యూయల్ సిమ్ సపోర్టెడ్ స్మార్ట్‌ఫోన్ Android 16 ఆధారిత Nothing OS 4.1పై నడుస్తుంది. ఈ ఫోన్‌కు మూడేళ్లపాటు OS అప్‌గ్రేడ్‌లు, ఆరేళ్లపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తామని కంపెనీ హామీ ఇస్తోంది.
కనెక్టివిటీ: ఈ ఫోన్ 5G, 4G LTE, Wi-Fi 6, Bluetooth 6.0, USB Type-C పోర్ట్‌లకు సపోర్ట్ ఇస్తుంది. నావిగేషన్ కోసం GPS, GLONASS, BDS, Galileo, QZSS సిస్టమ్స్ ఉన్నాయి.
సెన్సార్లు: యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్‌లతో పాటు, భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.
కొలతలు & బరువు: ఈ ఫోన్ కొలతలు 164.4 x 78.2 x 8.6mm కాగా, బరువు సుమారు 210 గ్రాములు ఉంటుంది.

