నథింగ్ 'b' సిరీస్ నుంచి తొలి బడ్జెట్ ఫోన్- చిప్‌సెట్ కన్ఫర్మ్, లాంఛ్ ఎప్పుడంటే?
నథింగ్ సంస్థ తన 'Nothing Phone 4b'లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌ను ఉపయోగించనున్నట్లు అధికారికంగా ధృవీకరించింది.

Published : June 30, 2026 at 11:28 AM IST
Hyderabad: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ నథింగ్ వచ్చే నెలలో ఒక సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతోంది. Nothing Phone 4b పేరుతో వస్తున్న ఈ ఫోన్, కంపెనీ B లైనప్ నుంచి విడుదలవుతున్న తొలి మోడల్. ఇప్పటివరకు A సిరీస్ ఫోన్‌లతో వినియోగదారులను ఆకట్టుకున్న నథింగ్, మొదటిసారి బడ్జెట్ కేటగిరీలోకి అడుగుపెడుతోంది. ఈ ఫోన్ జులై 7, 2026న అధికారికంగా లాంఛ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ దీనికి సంబంధించిన అనేక వివరాలను టీజ్ చేస్తూ వస్తోంది. తాజాగా దీని చిప్‌సెట్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
చిప్‌సెట్ వివరాలు: నథింగ్ ఇండియా తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా Nothing Phone 4bలో Snapdragon చిప్‌సెట్‌ను ఉపయోగిస్తున్నట్లు స్పష్టం చేసింది. కానీ దీని కచ్చితమైన పేరును ఇంకా వెల్లడించలేదు. అయితే 'Nothing Phone 4b' ఫోన్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్‌సెట్‌తో రావచ్చని లీక్స్ వెడువడుతున్నాయి.
Powered by Snapdragon.
— Nothing India (@nothingindia) June 29, 2026
Phone (4b).
7 July, 3:30 PM. pic.twitter.com/tVkDgQ7fJL
ఇకపోతే స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో రాబోతున్న నథింగ్ బడ్జెట్ ఫోన్ మెరుగైన పనితీరు (Performance), ఎక్కువ పవర్ ఎఫిషియెన్సీ, ఆన్-డివైస్ AI ఫీచర్లకు సపోర్ట్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. మిగిలిన హార్డ్‌వేర్ వివరాలన్నీ జులై 7న జరగబోయే లాంఛ్ ఈవెంట్‌లో అధికారికంగా వెల్లడికానున్నాయి.
ఈ 'Nothing Phone 4b'తో కంపెనీ సరికొత్త "b" లైనప్‌ను పరిచయం చేస్తోంది. తమ విస్తృత ఉత్పత్తుల వ్యవస్థలోకి ప్రవేశించడానికి ఇది మరింత అందుబాటులో ఉండే మార్గమని నథింగ్ పేర్కొంది. ఈ క్రమంలో తమ స్మార్ట్‌ఫోన్‌ల ప్రధాన అనుభవాన్ని మరింత ఎక్కువ మంది వినియోగదారులకు చేరవ చేయడమే ఈ సిరీస్ ముఖ్య ఉద్దేశమని తెలిపింది. నథింగ్ కంపెనీ ఈ అప్‌కమింగ్ ఫోన్‌కు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ అందించడం కోసం, ఇప్పటికే తమ అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్లను కూడా ప్రారంభించింది.
గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా వెల్లడైన వివరాలు: ఇంతకుముందు మోడల్ నంబర్ 'A005'తో గీక్‌బెంచ్ (Geekbench) లిస్టింగ్‌లో కనిపించిన ఒక డివైజ్, ఈ ప్రాసెసర్‌నే ఉపయోగించబోతున్నట్లు సూచించింది. ఆ లిస్టింగ్ ప్రకారం, ఈ ఫోన్ 8GB RAM, ఆండ్రాయిడ్ 16 ఆధారిత 'నథింగ్ ఓఎస్' (Nothing OS)తో రానున్నట్లు వెల్లడైంది.
అంతేకాకుండా, గీక్‌బెంచ్ టెస్టింగ్‌లో ఇది సింగిల్-కోర్ టెస్ట్‌లో 1,088 స్కోరును, మల్టీ-కోర్ టెస్ట్‌లో 3,155 స్కోరును సాధించింది. దీన్ని బట్టి ఆ లిస్టింగ్ 'Nothing Phone 4b' మోడల్‌దేనని భావిస్తున్నారు. ఈ స్కోర్ల ద్వారా ఈ ఫోన్ పనితీరు ఏ స్థాయిలో ఉంటుందో మనం ఓ అంచనాకి రావచ్చు.
Phone (4b).
— Nothing India (@nothingindia) June 25, 2026
7 July, 3:30 PM. pic.twitter.com/RM03JFJ7Jr
మరోవైపు, ఒక ప్రముఖ టిప్‌స్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. Nothing Phone 4b మోడల్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.7-ఇంచుల AMOLED ప్యానెల్ ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ 8GB+128GB, 8GB+256GB స్టోరేజ్ వేరియంట్లలో రానుందని లీక్స్ ద్వారా తెలుస్తోంది. అలాగే, ఇందులో 5,400mAh బ్యాటరీ, 50 MP ప్రైమరీ రియర్ కెమెరా ఉండే అవకాశం ఉందని సమాచారం. అయితే, ఈ ఫీచర్లను కంపెనీ ఇంకా అధికారికంగా నిర్ధారించలేదు.
దీనికి తోడు, కంపెనీ విడుదల చేసిన అధికారిక టీజర్‌లో ఈ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ (రెండు కెమెరాలు) ఉన్నట్లు కనిపించింది. అంతేకాకుండా, నథింగ్ తన పాత సిగ్మెంట్ గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ (Segmented Glyph Interface) స్థానంలో, ఈసారి కెమెరా మాడ్యూల్ కింద ఒక చిన్న హారిజాంటల్ గ్లిఫ్ బార్‌ను (Horizontal Glyph Bar) ఇచ్చే అవకాశం ఉంది. ఈ లైటింగ్ ఎలిమెంట్ ఛార్జింగ్ ప్రోగ్రెస్, నోటిఫికేషన్లు, యాప్‌కు సంబంధించిన అలర్ట్‌లను చూపించడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. (అంటే ఈ ప్రత్యేకమైన లైటింగ్ ఫీచర్ ఫోన్ ఛార్జింగ్ అవుతున్నప్పుడు బ్యాటరీ ఎంత శాతం నిండిందో చూపిస్తుంది. అలాగే ఫోన్‌కు వచ్చే మెసేజ్‌లు, కాల్స్ (నోటిఫికేషన్లు), వివిధ యాప్‌ల అలర్ట్‌లను స్క్రీన్ ఆన్ చేయకుండానే, ఫోన్ వెనుక ఉండే లైట్ల వెలుగు ద్వారా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.)

