ETV Bharat / technology

నాయిస్ తొలి 'స్క్రీన్‌లెస్ ఫిట్‌నెస్ ట్రాకర్' వచ్చేస్తుందోచ్- ధర రివీల్, ప్రీ-బుకింగ్స్ షురూ!

మధ్యతరగతి కస్టమర్లనే లక్ష్యంగా చేసుకుని నాయిస్ (Noise) తన మొట్టమొదటి స్క్రీన్‌లెస్ ఫిట్నెస్ బ్యాండ్​ను తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది. దీనిలో భాగంగా కంపెనీ దేశంలో ఇప్పుడు దీని ప్రీ-బుకింగ్​లు ప్రారంభించింది.

Noise REP- Faceless Fitness Tracker from India is available for pre-booking
Noise REP- Faceless Fitness Tracker from India is available for pre-booking (Photo Credit- Gonoise)
author img

By ETV Bharat Tech Team

Published : July 17, 2026 at 3:30 PM IST

2 Min Read
Choose ETV Bharat

Hyderabad: ఒకవైపు పని ఒత్తిడి, మరోవైపు మానసిక ఆందోళనలు. వీటి వల్ల వచ్చే శారీరక అలసటను పర్యవేక్షించడం బిజీ లైఫ్‌లో చాలామందికి సాధ్యం కావడం లేదు. దీంతో శరీరం ఇచ్చే సిగ్నల్స్‌ను చాలామంది గమనించలేకపోతున్నారు. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని హూప్ (Whoop), గూగుల్ (Google) వంటి కంపెనీలు 'స్క్రీన్‌లెస్ ఫిట్నెస్ ట్రాకర్లను' తీసుకొచ్చాయి. కానీ వాటి ధరలు సామాన్యులకు అందుబాటులో లేవు. సరిగ్గా ఇదే గ్యాప్‌ను ఫిల్ చేయడానికి నాయిస్ (Noise) రంగంలోకి దిగింది. బడ్జెట్ ధరలోనే అదిరిపోయే ఫీచర్లతో తన మొట్టమొదటి స్క్రీన్‌లెస్ ఫిట్నెస్ బ్యాండ్ 'నాయిస్ రెప్' (Noise REP)ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. దీనిలో భాగంగా ఇప్పుడు దీని ప్రీ-బుకింగ్​లను ప్రారంభించింది.

లాంఛ్, ధర వివరాలు: కంపెనీ ఈ ఫిట్​నెస్ బ్యాండ్​ను ఆగస్టు 4, 2026న విడుదల చేయనుంది. దీని ధరను కంపెనీ రూ. 9,999గా నిర్ణయించింది. అయితే, లాంఛ్ ఆఫర్‌లో భాగంగా కొనుగోలుదారులు రూ. 3,000 తగ్గింపును పొందవచ్చు. ఇందులో రూ. 2,000 ఫ్లాట్ డిస్కౌంట్, అలాగే HDFC కార్డ్‌లపై అదనంగా రూ. 1,000 తగ్గింపు ఉన్నాయి. అంటే ఫైనల్ ధర రూ. 6,999 నుంచి మొదలవుతుందన్నమాట.

నోయిస్ రెప్ (Noise REP) ఫీచర్లు, స్పెసిఫికేషన్లు: సామాన్యులకు అందుబాటులో ఉండేలా తీసుకొచ్చిన ఈ స్క్రీన్‌లెస్ ఫిట్నెస్ బ్యాండ్, రోజువారీ శారీరక మార్పులను పర్యవేక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. పైగా ఇందుకోసం ఎలాంటి నెలవారీ సబ్‌స్క్రిప్షన్ అవసరం లేదు.

  • హెల్త్ ట్రాకింగ్: నార్మల్ ఫిట్నెస్ యాప్స్‌లో ఉండే అన్ని ఫీచర్లు దీనిలో ఉన్నాయి. నిద్ర (Sleep), బాడీ ఎనర్జీ, చర్మ ఉష్ణోగ్రత (Skin Temperature), రక్తంలో ఆక్సిజన్ (SpO2), శ్వాస రేటు (Respiratory rate), స్టామినా, ఒత్తిడి (Stress) లాంటి దాదాపు 15 రకాల హెల్త్ పారామీటర్లను ఇది ట్రాక్ చేస్తుంది.
  • డిజైన్ & బాడీ: దీని బరువు కేవలం 27 గ్రాములు మాత్రమే. స్టెయిన్‌లెస్ స్టీల్ బకిల్ ఫినిషింగ్‌తో వస్తుంది.
  • వాటర్ రెసిస్టెన్స్: ఇది వాటర్‌ప్రూఫ్ డివైజ్. కాబట్టి దీనిని పెట్టుకుని స్విమ్మింగ్, స్నానం, చేతులు కడుక్కోవడం లాంటివి సులభంగా చేయవచ్చు.
  • OS సపోర్ట్: ఇది iOS 11.0 లేదా Android 9.0, వాటి తదుపరి వెర్షన్ ఉన్న అన్ని స్మార్ట్‌ఫోన్‌లకు సపోర్ట్ చేస్తుంది.
  • బ్యాటరీ & ఛార్జింగ్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ వస్తుంది. దీనితో పాటు బాక్స్‌లో USB మాగ్నెటిక్ ఛార్జింగ్ కేబుల్ లభిస్తుంది.

ప్రస్తుతం నోయిస్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా రూ. 999 చెల్లించి దీనిని ప్రీ-బుక్ చేసుకోవచ్చు. అయితే కస్టమర్లకు దీని డెలివరీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందనేది కంపెనీ ఇంకా ప్రకటించలేదు.