ETV Bharat / technology

2026 కియా సెల్టోస్​ తీసుకోవాలా?- కొనే ముందు ఈ వివరాలు తెలుసుకోండి!

2026 కియా సెల్టోస్: వేరియంట్ల వారీగా ఫీచర్ల జాబితా ఇదే!

Kia Seltos 2026
Kia Seltos 2026 (Photo Credit- Kia India)
author img

By ETV Bharat Tech Team

Published : January 5, 2026 at 5:32 PM IST

4 Min Read
Choose ETV Bharat

Hyderabad: ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా ఇటీవల 2026 కియా సెల్టోస్‌ను విడుదల చేసింది. కంపెనీ ఈ మిడ్​-సైజ్ SUV ఇంటీరియర్, ఎక్స్​టీరియర్​లో అనేక అప్డేట్​లతో పాటు అదనపు ఫీచర్లను అందించింది. ఈ వాహనాన్ని పూర్తిగా కొత్త K3 ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు.

ఈ కొత్త 2026 కియా సెల్టోస్ దాని ఎత్తు మినహా పరిమాణంలో పెరిగింది. అయితే యాంత్రికంగా దీనిలో ఎలాంటి మార్పులు లేవు. అవుట్‌గోయింగ్ మోడల్ మాదిరిగానే ఇది మూడు ఇంజిన్ ఎంపికలను కలిగి ఉంది. వీటిలో రెండు పెట్రోల్, ఒక డీజిల్ ఇంజన్లు ఉన్నాయి. అదనంగా దీనిలో పెట్రోల్-హైబ్రిడ్​ను కూడా తర్వాత ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. బహుశా ఇది 2027 నాటికి అందుబాటులోకి రావచ్చు.

భారత మార్కెట్లో ఈ కారు హ్యుందాయ్ క్రెటా, టాటా సియారా, మారుతి గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్ వంటి ప్రత్యర్థులతో పోటీ పడుతుంది. ఈ నేపథ్యంలో కొత్త కియా సెల్టోస్ వేరియంట్ లైనప్ ఏ ఫీచర్లను కలిగి ఉంది? ఏ వేరియంట్‌లు ఏ పవర్‌ట్రెయిన్‌లు, ఫీచర్లను అందిస్తున్నాయో తెలుసుకుందాం రండి.

కొత్త 2026 కియా సెల్టోస్ వేరియంట్ వారీగా ఫీచర్లు:

1. HTE వేరియంట్ ఫీచర్లు:

(ధర: రూ. 10.99 లక్షల నుంచి రూ. 12.59 లక్షలు)

  • 6 ఎయిర్‌బ్యాగ్‌లు
  • టైర్-ప్రెజర్ మానిటర్
  • ABS
  • ESC
  • హిల్-స్టార్ట్ అసిస్ట్
  • ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు
  • అన్ని సీట్లకు 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు
  • ఇండికేటర్‌తో ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్ ఆన్/ఆఫ్ స్విచ్
  • రియర్‌వ్యూ కెమెరా
  • LED హెడ్‌లైట్లు అండ్ డేటైమ్ రన్నింగ్ లాంప్స్ (DRLలు)
  • LED టెయిల్‌లైట్లు
  • కవర్లతో కూడిన 16-అంగుళాల స్టీల్ వీల్స్
  • షార్క్ ఫిన్ లాంటి యాంటెన్నా
  • హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్‌తో రియర్ స్పాయిలర్
  • ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్ (మాన్యువల్ ఆపరేషన్)
  • నలుపు, బూడిద రంగు అప్హోల్స్టరీ
  • డ్రైవర్ సీటు కోసం మాన్యువల్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్
  • స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్
  • క్రూయిజ్ కంట్రోల్
  • 12-అంగుళాల డ్రైవర్ డిస్​ప్లే
  • వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్‌ప్లేతో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్
  • USB-C ఛార్జింగ్ పోర్ట్‌లు: ముందు భాగంలో 2, వెనుక భాగంలో 2
  • కీలెస్ ఎంట్రీ
  • ఆర్మ్‌రెస్ట్ అండ్ కప్ హోల్డర్‌తో సెంటర్ కన్సోల్
  • మాన్యువల్ AC
  • రియర్ AC వెంట్స్
  • ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల బయటి రియర్‌వ్యూ మిర్రర్లు (ORVMలు)

2. HTE (O) వేరియంట్ ఫీచర్లు:

(ధర: రూ. 12.09 లక్షల నుంచి రూ. 14.99 లక్షలు)

  • HTE వేరియంట్​లోని ఫీచర్లతో పాటు ఇది అదనపు ఫీచర్లను అందిస్తుంది. అవి:
  • ఆటో-హోల్డ్ ఫంక్షన్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ (ఆటోమేటిక్ మాత్రమే)
  • 16-అంగుళాల స్టైల్డ్ స్టీల్ వీల్స్
  • కనెక్టెడ్ LED టెయిల్‌లైట్లు
  • నలుపు, బూడిద రంగు పార్ట్-లెథెరెట్ అప్హోల్స్టరీ
  • ట్రాక్షన్ కంట్రోల్ మోడ్‌లు: సాండ్/మడ్/స్నో (ఆటోమేటిక్ మాత్రమే)
  • డ్రైవ్ మోడ్‌లు: ఎకో/నార్మల్/స్పోర్ట్ (ఆటోమేటిక్ మాత్రమే)
  • ప్యాడిల్ షిఫ్టర్లు (ఆటోమేటిక్ మాత్రమే)
  • డ్రైవర్ అండ్ ప్యాసింజర్-సైడ్ సీట్‌బ్యాక్ పాకెట్స్
  • సెంటర్ ఆర్మ్‌రెస్ట్ అండ్ కప్ హోల్డర్‌లతో 60:40 స్ప్లిట్ రియర్ సీట్లు
  • మిడిల్ ప్యాసింజర్ సీట్ హెడ్‌రెస్ట్

3. HTK వేరియంట్ ఫీచర్లు:

(ధర: రూ. 13.09 లక్షల నుంచి రూ. 15.99 లక్షలు)

HTE (O) వేరియంట్ కంటే అదనపు ఫీచర్లు:

  • 17-అంగుళాల అల్లాయ్ వీల్స్
  • 16-అంగుళాల స్టైల్డ్ స్టీల్ వీల్స్ (NA మాన్యువల్ మాత్రమే)
  • ORVMల కోసం ఆటో-ఫోల్డ్ ఫంక్షన్
  • రియర్ వైపర్ అండ్ డీఫాగర్
  • ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్ (ఆటోమేటిక్ ఆపరేషన్)
  • ప్రాక్సిమిటీ అన్‌లాక్ ఫంక్షన్‌తో స్మార్ట్ కీ
  • టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ వీల్
  • పుష్-బటన్ స్టార్ట్/స్టాప్
  • వెనుక తలుపులపై సన్‌షేడ్‌లు
  • వెనుక పార్శిల్ ట్రే

4. HTK (O) వేరియంట్ ఫీచర్లు:

(ధర: రూ. 14.19 లక్షల నుంచి రూ. 17.09 లక్షలు)

HTK వేరియంట్​ కంటే అదనపు ఫీచర్లు:

నాలుగు ముందు పార్కింగ్ సెన్సార్లు

నలుపు, బూడిద రంగు లెథరెట్ అప్హోల్స్టరీ

ముందు వెంటిలేటెడ్ సీట్లు (ఆటోమేటిక్ మాత్రమే)

8-వే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు (ఆటోమేటిక్ మాత్రమే)

లెటర్​తో చుట్టి ఉన్న స్టీరింగ్ వీల్

వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్

పనోరమిక్ సన్‌రూఫ్

5. HTX వేరియంట్ ఫీచర్లు

(ధర: రూ. 15.59 లక్షల నుంచి రూ. 18.49 లక్షలు)

HTK (O) వేరియంట్ కంటే అదనపు ఫీచర్లు:

ఫ్రంట్ గ్రిల్, గ్లోసీ బ్లాక్ ఫినిష్​తో ORVMలు

LED ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్‌లు

సైడ్ డోర్ గార్నిష్

బ్రౌన్ అండ్ గ్రే అప్హోల్స్టరీ

లెథరెట్ డాష్‌బోర్డ్ సెంటర్ గార్నిష్ అండ్ ఫ్రంట్ డోర్ ట్రిమ్‌లు

యాంబియంట్ లైట్లు

12.3-అంగుళాల టచ్‌స్క్రీన్

OTA సాఫ్ట్‌వేర్ అప్‌డేట్

5-అంగుళాల HVAC టచ్‌స్క్రీన్

ఇంటీరియర్ రియర్‌వ్యూ మిర్రర్ (IRVM) కోసం ఆటో డే/నైట్ అడ్జస్ట్‌మెంట్

ముందు వెంటిలేటెడ్ సీట్లు

8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్

8-వే ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు (ఆటోమేటిక్ మాత్రమే)

6. HTX (A) వేరియంట్ ఫీచర్లు:

(ధర: రూ. 16.69 లక్షల నుంచి రూ. 19.59 లక్షలు)

HTX వేరియంట్ కంటే అదనపు ఫీచర్లు

లెవల్-2 ADAS

పార్కింగ్ కొలిషన్ అవాయిడెన్స్ అసిస్ట్ (ఆటోమేటిక్ మాత్రమే)

స్టాప్ & గోతో స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్ (ఆటోమేటిక్ మాత్రమే)

రివర్స్ పార్కింగ్ కొలిషన్ అవాయిడెన్స్ అసిస్ట్ (ఆటోమేటిక్ మాత్రమే)

2 సైడ్ పార్కింగ్ సెన్సార్లు

360-డిగ్రీ కెమెరా

12.3-అంగుళాల డ్రైవర్ డిస్​ప్లే

GTX వేరియంట్ ఫీచర్లు

HTX వేరియంట్‌పై అదనపు ఫీచర్లు

పార్కింగ్ కొలిషన్ అవాయిడెన్స్ అసిస్ట్

స్టాప్ & గోతో స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్

రివర్స్ పార్కింగ్ కొలిషన్ అవాయిడెన్స్ అసిస్ట్

LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు

DRLలలో ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్లు

గ్లోసీ బ్లాక్ ఫినిష్‌లో ఫ్రంట్ బంపర్ అండ్ క్లాడింగ్

బాడీ-కలర్ యాక్సెంట్‌లతో సైడ్ డోర్ గార్నిష్

18-అంగుళాల అల్లాయ్ వీల్స్

నియాన్-కలర్ డిస్క్ బ్రేక్ కాలిపర్స్

LED రివర్స్ లాంప్స్

నలుపు, తెలుపు అప్హోల్స్టరీ

10-వే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు

డ్రైవర్ సీటు, ORVMల కోసం మెమరీ ఫంక్షన్

7. GTX (A) వేరియంట్ ఫీచర్లు:

GTX వేరియంట్ కంటే అదనపు ఫీచర్లు

పార్కింగ్ కొలిషన్ అవాయిడెన్స్ అసిస్ట్

స్టాప్ & గోతో స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్

రివర్స్ పార్కింగ్ కొలిషన్ అవాయిడెన్స్ అసిస్ట్

X-లైన్ స్టైలింగ్ ప్యాక్

అదనపు ఖర్చు లేకుండా GTX/GTX (A) కోసం ఆప్షనల్ ఫీచర్లు:

ముందు, వెనుక భాగంలో గ్లోసీ బ్లాక్ ఫినిష్​తో ఫాక్స్ స్కిడ్ ప్లేట్లు

డార్క్ గన్‌మెటల్ యాక్సెంట్​లతో సైడ్ డోర్ గార్నిష్

శాటిన్ మెటల్ యాక్సెంట్​లతో నలుపు, ఆకుపచ్చ అప్హోల్స్టరీ

బ్లాక్ అండ్ హంటర్ గ్రీన్ లెథరెట్ సీట్లు

బ్లాక్ ఫినిష్​తో 18-అంగుళాల అల్లాయ్ వీల్స్

అరోరా బ్లాక్ పెర్ల్, ప్రత్యేకమైన మాట్టే గ్రాఫైట్ ఎక్స్​టీరియర్ కలర్ ఆప్షన్లు