ETV Bharat / technology

50MP కెమెరాతో 'మోటో G77 పవర్' లాంఛ్- ధర ఎంతంటే?

7,000mAh బ్యాటరీ, 50-మెగాపిక్సెల్ రియర్ కెమెరాతో 'మోటో G77 పవర్​' భారత మార్కెట్లో లాంఛ్ అయింది.

Moto G77 Power Launched in India With 7,000mAh Battery, 50-Megapixel Rear Camera
Moto G77 Power Launched in India With 7,000mAh Battery, 50-Megapixel Rear Camera (Photo Credit- Motorola)
author img

By ETV Bharat Tech Team

Published : July 8, 2026 at 2:30 PM IST

3 Min Read
Choose ETV Bharat

Hyderabad: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా తన బడ్జెట్ 'G' సిరీస్‌లో సరికొత్త 'మోటో G77 పవర్​' (Moto G77 Power) హ్యాండ్‌సెట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో 7,000mAh బ్యాటరీని అమర్చారు. ఇది 59 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని పేర్కొన్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6000 సిరీస్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్ఠంగా 8GB RAM అండ్ 128GB స్టోరేజ్ సామర్థ్యంతో వస్తుంది. ఇక కెమెరా ప్రియుల కోసం ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.

మోటో G77 పవర్ ధర, లభ్యత: కంపెనీ ఈ స్మార్ట్​ఫోన్​ను భారత మార్కెట్లో కేవలం ఒకే ఒక వేరియంట్​లో ప్రవేశపెట్టింది. అది: 8GB RAM + 128GB స్టోరేజ్. దీని ధరను రూ. 25,999గా నిర్ణయించారు. అయితే కంపెనీ యాక్సిస్ బ్యాంక్, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై కూడా రూ. 2,000 తక్షణ తగ్గింపును అందిస్తోంది. ప్రత్యామ్నాయంగా, వినియోగదారులు రూ. 2,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను పొందవచ్చు.

VariantPriceDiscounted Price
8GB +128GBRs 25,999Rs 23,999

కలర్ ఆప్షన్లు: ఇది నాలుగు పాంటోన్-సర్టిఫైడ్ రంగులలో లభిస్తుంది.

  • ఇంపెనెట్రబుల్ (గ్రే)
  • నాటికల్ బ్లూ (బ్లూ)
  • ఫ్యూషియా రెడ్ (పింక్)
  • లారెల్ గ్రీన్ (గ్రీన్)

సేల్ వివరాలు: భారత మార్కెట్లో ఈ ఫోన్ సేల్స్ జులై 13 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆసక్తి ఉన్న కస్టమర్లు మోటరోలా అధికారిక వెబ్‌సైట్ (motorola.in), Flipkart ద్వారా కొనుగోలు చేయవచ్చు.

మోటో G77 పవర్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:

డిస్​ప్లే: ఈ ఫోన్ 6.72 అంగుళాల Full HD+ (2400 X 1080 పిక్సెల్స్) LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 1,050 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్, 120Hz వరకు టచ్ శాంప్లింగ్ రేట్, 391 PPI పిక్సెల్ డెన్సిటీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ వంటి ఫీచర్లను అందిస్తుంది.

ప్రాసెసర్: ఇందులో ఆక్టా-కోర్ 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్‌తో పాటు Arm Mali-G57 MP2 GPU అందించారు. ఈ CPU LPDDR4X 8GB RAMతో వస్తుంది. వర్చువల్ RAMతో దీన్ని 24GB వరకు పెంచుకోవచ్చు. అలాగే UFS 2.2 128GB స్టోరేజ్ ఉంది. దీన్ని microSD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించవచ్చు.

బ్యాటరీ: మోటో G77 పవర్​ మోడల్ 7,000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 30W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 6W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 59 గంటల వరకు బ్యాటరీ లైఫ్ లభిస్తుందని మోటరోలా పేర్కొంది.

కెమెరా సెటప్: ఈ ఫోన్​లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో f/1.8 అపర్చర్‌తో 50MP Sony LYTIA 600 సెన్సార్ మెయిన్ కెమెరా, f/2.2 అపర్చర్‌తో 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఈ రియర్ కెమెరా సెటప్‌లో 2-in-1 లైట్ సెన్సార్ కూడా ఉంది. అలాగే సెల్ఫీలు, వీడియో కాలింగ్​ల కోసం ఫోన్ ముందు భాగంలో f/2.2 అపర్చర్‌తో కూడిన 32MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా అందించారు. ఈ ఫోన్ 2K/30 fps వరకు వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

IP రేటింగ్: ఇందులో దుమ్ము, నీటి తుంపరల నుంచి రక్షణ కోసం IP64 రేటింగ్​ ఉంది. అలాగే ప్రమాదవశాత్తు ఫోన్ జారిపడినా తట్టుకునేందుకు MIL-STD-810H సర్టిఫికేషన్ కూడా లభిస్తుంది.

ఆపరేటింగ్ సిస్టమ్: ఇది Android 16 ఆధారిత మోటోరోలా సొంత HelloUI ఆపరేటింగ్ సిస్టమ్‌తో అవుట్-ఆఫ్-ది-బాక్స్ వస్తుంది. ఈ ఫోన్‌కు ఒక సంవత్సరం పాటు ఓఎస్ అప్‌గ్రేడ్‌తో పాటు, మూడు సంవత్సరాల పాటు సెక్యూరిటీ ప్యాచ్ అప్‌డేట్లను అందిస్తామని కంపెనీ హామీ ఇస్తోంది.

కొలతలు, బరువు: ఈ స్మార్ట్‌ఫోన్ 166.23 mm పొడవు, 76.50 mm వెడల్పు, 8.89 mm మందంతో వస్తుందిఇందులో 7,000mAh భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ, కంపెనీ దీనిని కేవలం 215 గ్రాముల బరువుతో, స్లిమ్ డిజైన్‌లో రూపొందించింది.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లువివరాలు
డిస్​ప్లే120Hz | 6.72-అంగుళాల FHD+ LCD
ప్రాసెసర్మీడియాటెక్ డైమెన్సిటీ 6400
రియర్ కెమెరా50MP (main) | 8MP (ultra-wide)
ఫ్రంట్ కెమెరా32MP
బ్యాటరీ7,000mAh
ఛార్జింగ్ కెపాసిటీ30W (wired) | 6W (wired reverse)
IP రేటింగ్IP64
ఆపరేటింగ్ సిస్టమ్ (OS)HelloUI based on Android 16
OS అప్​గ్రేడ్స్ & సెక్యూరిటీ అప్డేట్స్1 year (OS upgrades) | 3 years (security patches)