ETV Bharat / technology

మహింద్రా "XUV 3XO EV" కొనాలనుకుంటున్నారా?- ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్లు ఉన్నాయో తెలుసుకోండి!

ఇటీవలే మార్కెట్​లోకి ఎంట్రీ ఇచ్చిన "XUV 3XO EV" SUV- కొనే ఆలోచన ఉంటే ప్రతి వేరియంట్​లోని ఫీచర్ల వివరాలు మీకోసం!

Mahindra XUV 3XO EV SUV
Mahindra XUV 3XO EV SUV (Photo Credit- Mahindra & Mahindra)
author img

By ETV Bharat Tech Team

Published : January 10, 2026 at 5:18 PM IST

3 Min Read
Choose ETV Bharat

Hyderabad: స్వదేశీ SUV తయారీ సంస్థ మహింద్రా & మహింద్రా తన నాల్గవ ఎలక్ట్రిక్ కారు "మహింద్రా XUV 3XO EV"ని జనవరి 6, 2026న భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ మహింద్రా సబ్-4 మీటర్ ఎలక్ట్రిక్ SUV కంపెనీ మూడేళ్ల క్రితం ప్రారంభించిన "మహింద్రా XUV400" స్థానంలోకి వచ్చింది.

ఈ ఎలక్ట్రిక్ వాహనం ICE ఇంజిన్​తో నడిచే "మహింద్రా XUV 3XO" మొత్తం రూపాన్ని, ఫారమ్ ఫ్యాక్టర్‌ను స్వీకరించింది. అదే సమయంలో పెద్ద "మహింద్రా XUV400" ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌ను నిలుపుకొంది. ICE "మహింద్రా XUV 3XO"తో పోలిస్తే దీని ఎక్స్​టీరియర్​లో కేవలం కొన్ని తేడాలు మాత్రమే ఉన్నాయి. అవి కొద్దిగా సవరించిన ఫ్రంట్ గ్రిల్, దిగువ ఆప్రాన్, ఫ్రంట్ అండ్ రియర్ భాగంలో బ్రోంజ్ హైలైట్‌లు. ఇవి మినహా ఈ EV ఇంటీరియర్ డిజైన్ కూడా "మహింద్రా XUV 3XO" మాదిరిగానే ఉంటుంది.

మహింద్రా XUV 3XO EV ధర: కంపెనీ ఈ "మహింద్రా XUV 3XO EV"ని రెండు వేరియంట్లలో విడుదల చేసింది. అవి: AX5, AX7L. వీటిలో "AX5" వేరియంట్ ధరను రూ. 13.89 లక్షలుగా నిర్ణయించగా, "AX7L" వేరియంట్ ధర రూ. 14.96 లక్షలుగా ఉంది. 7.2kW AC ఛార్జర్ కావాలనుకునే కస్టమర్లు అదనంగా రూ. 50,000 చెల్లించాల్సి ఉంటుంది.

కంపెనీ ఈ వాహనాన్ని కేవలం రెండు వేరియంట్లతో విడుదల చేయడంతో కస్టమర్లకు ఏది ఎంచుకోవాలనే దానిపై పెద్దగా గందరగోళం ఉండదు. అయితే ఈ రెండింటిలో ఏది తీసుకోవాలని ఆలోచిస్తున్న వారి కోసం వేరియంట్ల వారీగా ఫీచర్లను అందిస్తున్నాం. వీటి ఆధారంగా మీకు ఏది బెస్ట్ అనేది ఈజీగా నిర్ణయించుకోవచ్చు.

XUV 3XO EV 'AX5' వేరియంట్ ఫీచర్లు:

(ధర: రూ. 13.89 లక్షలు)

  • LED DRLలతో LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు
  • LED టెయిల్‌లైట్లు
  • 16-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్
  • ఆటోమేటిక్ హెడ్‌లైట్లు
  • రెయిన్-సెన్సింగ్ వైపర్లు
  • పాసివ్ కీలెస్ ఎంట్రీ
  • ఎలక్ట్రికల్లీ ఫోల్డింగ్ ORVMలు
  • ఎలక్ట్రిక్ సన్‌రూఫ్
  • వన్-టచ్ డ్రైవర్-సైడ్ విండో అప్/డౌన్ ఫంక్షన్
  • రియర్ వెంట్లతో డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్
  • 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్​ప్లే
  • 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్
  • వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో
  • బిల్ట్-ఇన్ అలెక్సాతో 'అడ్రినోక్స్ కనెక్ట్' సూట్
  • 6-స్పీకర్ ఆడియో సిస్టమ్
  • వైర్‌లెస్ ఛార్జర్
  • క్రూయిజ్ కంట్రోల్
  • ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు
  • ఆడియో నియంత్రణలతో లెథరెట్ స్టీరింగ్
  • స్టోరేజ్‌తో ముందు ఆర్మ్‌రెస్ట్
  • కప్‌హోల్డర్‌లతో వెనుక ఆర్మ్‌రెస్ట్
  • 60:40 స్ప్లిట్-ఫోల్డింగ్ వెనుక సీట్లు
  • ముందు, వెనుక USB ఛార్జింగ్ పోర్ట్‌లు
  • రియర్ వైపర్ అండ్ వాషర్
  • రియర్ డీఫాగర్
  • రియర్ వ్యూ కెమెరా
  • ఆటో-హోల్డ్ ఫంక్షన్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్
  • 6- ఎయిర్‌బ్యాగ్‌లు
  • ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్
  • టైర్-ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్

XUV 3XO EV 'AX7L' వేరియంట్ ఫీచర్లు:

(ధర: రూ. 14.96 లక్షలు)

AX5 వేరియంట్​పై అదనపు ఫీచర్లు

  • LED ఫాగ్ లైట్లు
  • 17-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్
  • ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు
  • 'బ్లైండ్ వ్యూ మానిటర్'తో సరౌండ్-వ్యూ కెమెరాలు
  • లెవల్-2 ADAS
  • పనోరమిక్ సన్‌రూఫ్
  • 7-స్పీకర్ హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్
  • డాల్బీ అట్మాస్
  • ఆటో-డిమ్మింగ్ IRVM
  • లెథరెట్ సీట్లు
  • డ్యాష్‌బోర్డ్ అండ్ డోర్ ట్రిమ్‌లపై లెథరెట్
  • కూల్డ్ గ్లోవ్ బాక్స్
  • 65W USB టైప్-C ఛార్జింగ్ పోర్ట్

మహింద్రా XUV 3XO EV పవర్‌ట్రెయిన్: పవర్‌ట్రెయిన్ గురించి చెప్పాలంటే, మహింద్రా "XUV 3XO EV" ఒకే బ్యాటరీ, పవర్‌ట్రెయిన్ కలయికతో లభిస్తుంది. రెండు వేరియంట్‌లు ఒకే 39.4kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తాయి. ఇది ముందు భాగంలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటారుకు శక్తినిస్తుంది. ఈ మోటార్ 150hp పవర్, 310Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

పనితీరు పరంగా, మహింద్రా "XUV 3XO EV" కేవలం 8.3 సెకన్లలో 0-100kph వేగాన్ని అందుకోగలదని కంపెనీ పేర్కొంది. ఇది "XUV400"లో క్లెయిమ్ చేసిన 0-100kph సమయానికి సమానంగా ఉంటుంది. కంపెనీ వాస్తవ ప్రపంచంలో 285km వరకు రేంజ్‌ను అందిస్తుందని పేర్కొంటున్నప్పటికీ, ఈ "XUV 3XO EV" మిశ్రమ డ్రైవింగ్ సైకిళ్లతో సహా 351 కిలోమీటర్ల MIDC-రేటెడ్ గరిష్ఠ పరిధిని అందిస్తుంది.