మహింద్రా XEV 9e సినీలక్స్ ఎడిషన్ లాంఛ్- బుకింగ్‌లూ షురూ- ధర ఎంతంటే?
మహింద్రా తన ఎలక్ట్రిక్ SUV మహింద్రా XEV 9e సినీలక్స్ ఎడిషన్‌ను విడుదల చేసింది. బుకింగ్‌లు కూడా నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.

Published : March 2, 2026 at 10:41 AM IST
Hyderabad: దేశీయ SUV తయారీ సంస్థ మహింద్రా & మహింద్రా తన ఎలక్ట్రిక్ SUV "మహింద్రా XEV 9e"లో కొత్త "సినీలక్స్" ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ ప్రత్యేక ఎడిషన్‌తో కంపెనీ తన ఎలక్ట్రిక్ SUV పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. ఈ ప్రత్యేక ఎడిషన్ ధరను రూ. 29.35 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది.
బుకింగ్‌లు, డెలివరీల వివరాలు: ఈ ప్రత్యేక ఎడిషన్ బుకింగ్‌లు ఇవాళ్టి నుంచే అంటే మార్చి 2, 2026 నుంచి ప్రారంభమవుతాయి. డెలివరీలు మార్చి 10, 2026 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ కొత్త మహింద్రా "XEV 9v సినీలక్స్" ఎడిషన్ ప్రామాణిక "XEV 9e" మెరుగైన వెర్షన్‌గా ఉంటుంది. ఇది ఇంటీరియర్ డీటెయిలింగ్, మొత్తం ఇన్-క్యాబిన్ అనుభవంపై ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది.
మహింద్రా XEV 9v సినీలక్స్ ఎడిషన్ ఎక్స్టీరియర్ డిజైన్: కొత్త ప్రత్యేక ఎడిషన్ డిజైన్ గురించి చెప్పాలంటే, ఇది రెండు విలక్షణమైన ఎక్స్టీరియర్ ఫినిషింగ్‌లలో లభిస్తుంది. అవి: శాటిన్ బ్లాక్, శాటిన్ వైట్ పెయింట్ షేడ్స్. ఈ షేడ్స్ చెస్ట్‌నట్ బ్రౌన్, నాక్టర్న్ బ్లాక్ స్మూత్ గ్రెయిన్ లెథరెట్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన ఇంటీరియర్ థీమ్‌తో వస్తాయి.

మహింద్రా XEV 9v సినీలక్స్ ఎడిషన్ ఇంటీరియర్: ఇంకా దీని డ్యాష్‌బోర్డ్, సీట్లు, డోర్ ప్యానెల్‌లపై టెక్స్చర్‌లు, ఫినిషింగ్‌లపై శ్రద్ధ చూపుతూ, లోపల ప్రశాంతమైన, మరింత లాంజ్ తరహా వాతావరణాన్ని సృష్టించడంపై దృష్టి కేంద్రీకరించారు. ఈ SUV అత్యంత విలక్షణమైన లక్షణం దాని కోస్ట్-టు-కోస్ట్ ట్రిపుల్ HD డిస్ప్లే సెటప్. ఇది డాష్‌బోర్డ్ వెడల్పు అంతటా విస్తరించి ఉంది.
ఇది డాల్బీ అట్మోస్ మద్దతుతో 16-స్పీకర్ హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్‌తో వస్తుంది. ఈ కారులో ఇన్ఫినిటీ రూఫ్, 16 మిలియన్లకు పైగా కలర్ కాంబినేషన్‌లతో యాంబియంట్ లైటింగ్ సిస్టమ్ కూడా ఉన్నాయి. ప్రయాణీకులు విభిన్న మూడ్‌లు, డ్రైవింగ్ పరిస్థితులకు అనుగుణంగా క్యాబిన్ వాతావరణాన్ని మార్చుకోవచ్చు.
మహింద్రా XEV 9v సినీలక్స్ ఎడిషన్ ఫీచర్లు: ఈ ప్రత్యేక ఎడిషన్‌ను స్టాండర్డ్ మోడల్ టాప్-స్పెక్ ప్యాక్ 3 వేరియంట్ ఆధారంగా రూపొందించారు. ఇందులో స్ట్రెయిట్‌అహెడ్ విజన్ఎక్స్ ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్-అప్ డిస్ప్లే, ఐడెంటిటీ డ్రైవర్ అండ్ ఆక్యుపెంట్ మానిటరింగ్, ఆటో పార్కింగ్ అసిస్ట్‌తో హ్యాండ్స్-ఫ్రీ పార్కింగ్, సెక్యూర్360 కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

వీటితో పాటు ఈ ప్రత్యేక ఎడిషన్‌లో క్యాంప్, కీప్ అండ్ పాపుల్ HVAC మోడ్‌లు, కస్టమ్ డ్రైవ్ మోడ్‌లు, డిజిటల్ కీ యాక్సెస్, సెక్యూర్ 360 ప్రో వంటివి ఉన్నాయి.
మహింద్రా XEV 9v సినీలక్స్ ఎడిషన్ పవర్‌ట్రెయిన్: ఈ స్పెషల్ ఎడిషన్‌లో 79 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది సింగిల్ ఛార్జ్‌పై 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్‌ను అందించగలదని కంపెనీ పేర్కొంది. దీని పవర్ అవుట్‌పుట్ 210 kW, పీక్ టార్క్ 380 Nm. ప్రస్తుతం దీనిలో రియర్-వీల్ డ్రైవ్ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది, ఆల్-వీల్ డ్రైవ్ వెర్షన్ అందుబాటులో లేదు.

