ETV Bharat / technology

BMW లుక్​, ప్రీమియం ఫీచర్లతో కీవే తొలి ఎలక్ట్రిక్ స్కూటీ- రూ.3 లక్షలకు పైమాటేనా?

కీవే తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ EZI హైపర్వోల్ట్ BMW లుక్, ప్రీమియం ఫీచర్లతో జూన్‌లో ఇండియాలో లాంఛ్ కానుంది. 14-అంగుళాల వీల్స్, ABSతో వచ్చే ఈ స్కూటీ ధర రూ. 3లక్షల మార్క్ దాటొచ్చు.

Keeway EZI Hypevolt
Keeway EZI Hypevolt (Photo Credit- EZI Motor)
author img

By ETV Bharat Tech Team

Published : June 1, 2026 at 2:09 PM IST

3 Min Read
Choose ETV Bharat

Hyderabad: స్కూటర్ల తయారీ సంస్థ కీవే భారతదేశంలో తన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ "EZI హైపర్‌వోల్ట్"ను 14-అంగుళాల చక్రాలు, ABSతో విడుదల చేయనుంది. ఈ స్కూటర్‌ను చైనాలో 'EZI' సబ్-బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్నారు. కీవే కంపెనీ అదిశ్వర్ ఆటో రైడ్ ఇండియా (AARI)లో భాగం. ఇదే సంస్థ QJ మోటార్, బెనెల్లీ బ్రాండ్లను కూడా భారత్‌లో నిర్వహిస్తోంది. ప్రస్తుతం కీవే భారత మార్కెట్‌లో "Vieste 300", "Sixties 300i" వంటి హై-కెపాసిటీ పెట్రోల్ స్కూటర్లను విక్రయిస్తోంది.

ఏంటీ EZI?: ఎలక్ట్రిక్ టూ-వీలర్ల రేంజ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు కీవే 2020లో ప్రారంభించిన సబ్​-బ్రాండ్ ఈ EZI . దీనికి చైనాలోని జియాంగ్, సిచువాన్‌లో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీ స్క్రాంబ్లర్, క్రూయిజర్, మ్యాక్సీ-స్కూటర్లతో పాటు పలు రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను తయారు చేస్తోంది.

కీవే EZI హైపర్‌వోల్ట్ డిజైన్: డిజైన్ పరంగా, "కీవే EZI హైపర్‌వోల్ట్" చాలా మందికి "BMW CE 04"ను గుర్తు చేస్తుంది. దీని పొడవైన, ఫ్యూచరిస్టిక్ షేప్ "CE 04"ను పోలి ఉంది. అంతేకాదు, "BMW CE 04"లో ఉన్నట్టే ఇందులోనూ బెంచ్ సీట్ ఇచ్చారు. రైడర్, పిలియన్ (వెనుక కూర్చునే ప్రయాణికుడు) కోసం వేర్వేరు భాగాలుగా ఈ సీట్​ను డిజైన్ చేశారు.

ఫీచర్ల విషయానికి వస్తే, "EZI హైపర్‌వోల్ట్​"లో స్ప్లిట్ LED హెడ్‌లైట్స్ ఉన్నాయి. వాటికి రెండు వైపులా వర్టికల్ LED డేటైమ్ రన్నింగ్ లైట్స్ అమర్చారు. 14-అంగుళాల పెద్ద అల్లాయ్ వీల్స్ ఉండటంతో స్కూటర్ స్టాన్స్ కాస్త ఎత్తుగా కనిపిస్తుంది. దీని సీట్ ఎత్తు 770 mm, మొత్తం బరువు 145 kg.

కీవే EZI హైపర్‌వోల్ట్ పవర్‌ట్రెయిన్: చైనా మార్కెట్‌లో, కీవే EZI హైపర్‌వోల్ట్​ను రెండు 2.5 kWh బ్యాటరీలతో, మొత్తం 5 kWh కెపాసిటీతో అందిస్తున్నారు. తన స్వదేశీ మార్కెట్‌లో, ఈ స్కూటర్ 'హబ్ మోటార్' లేదా 'మిడ్-డ్రైవ్ మోటార్' ఆప్షన్లతో విక్రయిస్తున్నారు. మిడ్-డ్రైవ్ మోటార్ నిరంతరాయంగా 6 kW (8 bhp) అవుట్‌పుట్‌ను అందిస్తుంది. కాగా దీని పీక్ అవుట్‌పుట్ 12 kW (16 bhp). ఈ స్కూటర్ గరిష్ఠంగా గంటకు 115 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని EZI పేర్కొంది.

కీవే EZI హైపర్‌వోల్ట్ ఫీచర్లు: ఈ కొత్త EZI హైపర్‌వోల్ట్​లో ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. చైనాలో అందుబాటులో ఉన్న వెర్షన్ 'కాంబి-బ్రేకింగ్ సిస్టమ్' (CBS)తో రాగా, భారత్​లో మాత్రం ఈ స్కూటర్ 'డ్యూయల్-ఛానల్ ABS'తో విడుదలయ్యే అవకాశం ఉంది.

ఇతర సేఫ్టీ ఫీచర్లు: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ట్రాక్షన్ కంట్రోల్, హిల్ డిసెంట్ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్ వంటి కీలక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. కంపెనీ హోమ్ మార్కెట్లో హైపర్‌వోల్ట్​లో రియర్ కెమెరా, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ సిస్టమ్ కూడా ఇస్తున్నారు. అయితే ఇండియా-స్పెక్ స్కూటర్‌లో ఈ ఫీచర్లు ఉంటాయా లేదా అనేది చూడాలి.

లాంఛ్, ధర వివరాలు: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ జూన్ మధ్యలో ఎప్పుడైనా లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. ఖరీదైన ఇ-స్కూటర్‌గా నిలవనున్న EZI హైపర్‌వోల్ట్ మార్కెట్లో ఒక కొత్త సెగ్మెంట్‌ను క్రియేట్ చేయనుంది. చూసేందుకు ఇది అంత ఖరీదైనదిగా అనిపించనప్పటికీ, ట్విన్ బ్యాటరీ, ఎక్విప్‌మెంట్ లెవల్స్‌తో హైపర్‌వోల్ట్ ధర రూ. 3 లక్షల (ఎక్స్-షోరూమ్) కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.