ETV Bharat / technology

కొత్త ఫోన్ కొనే ఆలోచనలో ఉన్నారా?- జూన్‌లో లాంఛ్ అయ్యే మోడళ్లు ఇవే!

జూన్ 2026 భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను షేక్ చేయబోతోంది. రూ.10 వేల బడ్జెట్ ఫోన్ల నుంచి ప్రీమియం ఫ్లాగ్‌షిప్‌ల వరకు డజనుకుపైగా కొత్త మోడళ్లు భారీ బ్యాటరీ, అప్‌గ్రేడెడ్ కెమెరాలతో విడుదలకానున్నాయి.

Upcoming Smartphone Launches In June 2026
Upcoming Smartphone Launches In June 2026 (Photo Credit- Motorola, Xiaomi, iQOO)
author img

By ETV Bharat Tech Team

Published : June 1, 2026 at 11:20 AM IST

4 Min Read
Choose ETV Bharat

Hyderabad: జూన్ 2026లో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కొత్త ఫోన్ల జాతర మొదలుకానుంది. మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో+ నుంచి షావోమీ 17T, లావా బ్లేజ్ N2 5G, ఐకూ Z11 5G, రెడ్‌మీ టర్బో 5 వరకు.. అలాగే ఒప్పో రెనో 16 సిరీస్‌తో సహా పలు కీలక మోడళ్లు విడుదల కానున్నాయి. ఈ ఫోన్లలో ప్రీమియం డిస్‌ప్లే, భారీ బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్‌తో పాటు కెమెరా అప్‌గ్రేడ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుండగా, బడ్జెట్ నుంచి మిడ్-రేంజ్, ప్రీమియం విభాగాల వరకు వినియోగదారులకు కొత్త ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి.

1. లావా బ్లేజ్ N2 5G:

లాంఛ్ తేదీ: జూన్ 3, 2026

Lava Blaze N2 5G
Lava Blaze N2 5G (Image Credit- Amazon)

ఈ స్మార్ట్‌ఫోన్ జూన్ 3వ తేదీన అమెజాన్​లో విడుదల కానుంది. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్, 6.75-అంగుళాల HD+ 90Hz డిస్‌ప్లే, Unisoc ప్రాసెసర్, 5000mAh బ్యాటరీ, IP64 రేటింగ్‌ వంటి ప్రత్యేకతలను కలిగి ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే, ఇందులో 13MP డ్యూయల్ వెనుక కెమెరా ఉంటుంది. 'మేడ్ ఇన్ ఇండియా' ట్యాగ్‌తో ఈ ఫోన్ బడ్జెట్ ధరలోనే మార్కెట్‌లోకి రానుంది. దీని ధర సుమారు రూ. 8,000 నుంచి రూ. 10,000 మధ్య ఉంటుందని అంచనా.

2. మోటరోలా ఎడ్జ్ 70 ప్రో+:

విడుదల తేదీ: జూన్ 4, 2026

లెనోవో యాజమాన్యంలోని మోటరోలా భారతదేశంలో "ఎడ్జ్ 70 ప్రో+"ను జూన్ 4, 2026న విడుదల చేయనుంది. ఈ పరికరం 6.8-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 2772×1272 రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేటు, HDR10+ సపోర్ట్, 5,200 నిట్స్ పీక్ బ్రైట్​నెస్​ను అందిస్తుంది.

అంతేకాకుండా, ఈ ఫోన్ పాంటోన్ వ్యాలిడేటెడ్ కలర్స్, వాటర్ టచ్ టెక్నాలజీ, SGS సర్టిఫికేషన్​ను కూడా కలిగి ఉంటుంది. అంటే దీని రంగులు ఒరిజినల్‌గా కనిపిస్తాయి, చేతులు తడిగా ఉన్నా స్క్రీన్ వాడొచ్చు, ఇంకా క్వాలిటీ విషయంలో ఢోకా ఉండదు.

3. షావోమీ 17T:

లాంఛ్ తేదీ: జూన్ 4, 2026

జూన్ 4, 2026న ఈ స్మార్ట్‌ఫోన్ కూడా భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ అప్​కమింగ్ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 6,500mAh భారీ బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 5x ఆప్టికల్ జూమ్‌ సపోర్ట్ చేసే Leica-ట్యూన్డ్ ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ ఇందులో ప్రత్యేకం. అంతేకాకుండా ఈ ఫోన్ డిస్‌ప్లేకు TUV Rheinland సర్టిఫికేషన్ కూడా ఉంటుంది.

4. రెడ్​మీ టర్బో 5, రెడ్​మీ 17 5G

విడుదల తేదీ: జూన్ 18, 2026 (అంచనా)

రెడ్​మీ వీటి లాంఛ్ తేదీని అధికారికంగా ఇంకా వెల్లడించలేదు. అయితే ఇవి జూన్ 18, 2026న భారత మార్కెట్లో ప్రారంభం కావచ్చని అంచనా. ఇక కీలక ఫీచర్ల విషయానికి వస్తే, "రెడ్​మీ టర్బో 5" మోడల్‌లో డైమెన్సిటీ 8500 అల్ట్రా చిప్‌సెట్, 100W ఛార్జింగ్ సదుపాయంతో కూడిన భారీ 7,560mAh బ్యాటరీ, 6.59-అంగుళాల 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP OIS కెమెరా ఉంటాయని భావిస్తున్నారు. దీని ధర రూ. 27,999 నుంచి రూ. 33,999 మధ్య ఉండొచ్చు. మరోవైపు "రెడ్​మీ 17 5G" మోడల్ కూడా స్నాప్​డ్రాగన్ 4-సిరీస్ ప్రాసెసర్, 7,000mAh కంటే ఎక్కువ సామర్థ్యం గల బ్యాటరీ, 50MP కెమెరాతో మరింత అందుబాటు ధరలో రానుందని భావిస్తున్నారు.

5. ఐకూ Z11 5G

లాంఛ్ తేదీ: మిడ్-జూన్

iQOO Z11 5G
iQOO Z11 5G (Image Credit- iQOO Global)

ఈ "ఐకూ Z11 5G" జూన్ మధ్యలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది 6.83-అంగుళాల 165Hz AMOLED డిస్‌ప్లే, స్నాప్​డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్, భారీ 9,020mAh బ్యాటరీ, 90W ఛార్జింగ్ సపోర్ట్, 50MP సోనీ IMX882 OIS మెయిన్ కెమెరాతో పాటు 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుందని భావిస్తున్నారు. దీని ధర రూ. 25,000 నుంచి రూ. 30,000 మధ్య ఉండొచ్చు.

6. ఒప్పో రెనో 16 సిరీస్

విడుదల తేదీ: జూన్ 2026

అప్​కమింగ్ "ఒప్పో రెనో 16" సిరీస్ మూడు మోడళ్ల (స్టాండర్డ్, ప్రో, ప్రో మినీ)తో ఈ నెలలోనే విడుదలవుతుందని భావిస్తున్నారు. ఈ సిరీస్ 200MP ప్రధాన కెమెరా, డైమెన్సిటీ 8550 లేదా 9500s చిప్‌సెట్‌లు, 6,700 నుంచి 7,000mAh రేంజ్​లో ఉండే బ్యాటరీలతో రానుంది. దీని ధర రూ. 30,000 నుంచి రూ. 40,000 మధ్య ఉంటుందని అంచనా.

రానున్న వారాల్లో మరికొన్ని స్మార్ట్‌ఫోన్లు విడుదల కావచ్చని భావిస్తున్నాయి. ఈ లిస్ట్​లో "టెక్నో పోవా 8" (from Rs 18,999), "వివో T5 లైట్" (Under Rs 15,000) ఉన్నాయి. అదనంగా డైమెన్సిటీ 7400+ AI ప్రాసెసర్‌తో "రియల్‌మీ P4R" కూడా విడుదల కావచ్చు. అదేవిధంగా శాంసంగ్ "గెలాక్సీ M47", "A27" మోడళ్లు కూడా త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం వీటి గురించి పెద్దగా సమాచారం వెలువడలేదు. అయితే, వీటి స్పెసిఫికేషన్లు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.