ETV Bharat / technology

చైనీస్ కంపెనీతో జతకట్టిన JSW మోటార్స్- తొలి ఎలక్ట్రిక్ SUV టీజర్ రిలీజ్

JSW మోటార్స్ చైనీస్ కంపెనీ చెరీ భాగస్వామ్యంలో తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారును భారతదేశంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగా టీజర్​ను రిలీజ్ చేసింది.

Chery iCar V23 Chery iCar V23
Chery iCar V23 Chery iCar V23 (Photo Credit- Chery Thailand)
author img

By ETV Bharat Tech Team

Published : February 25, 2026 at 3:57 PM IST

2 Min Read
Choose ETV Bharat

Hyderabad: JSW మోటార్స్ భారతదేశానికి తమ తొలి ఎలక్ట్రిక్ కారును విడుదల చేయబోతున్నట్లు సూచిస్తూ ఒక టీజర్‌ను విడుదల చేసింది. ఈ SUVని చెరీ ఐకార్ V23 ఆధారంగా రూపొందిస్తున్నారు. ఇది JSW సొంత బ్రాండ్ కింద విక్రయిస్తారు. అయితే కంపెనీ దీని లాంఛ్ టైమ్‌లైన్‌ను ఇంకా వెల్లడించలేదు.

చెరీతో జతకట్టిన JSW మోటార్స్: ఈ కారును భారత మార్కెట్‌లోకి తీసుకురావడానికి JSW చైనా కార్ల తయారీ సంస్థ చెరీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ క్రమంలో అభివృద్ధి పనులతో పాటు, కంపెనీ తన రిటైల్ ఉనికిని స్థాపించడం కూడా ప్రారంభించింది. దీన్ని మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్‌లో JSW అప్​కమింగ్ న్యూ ఎనర్జీ వెహికల్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేయనున్నారని గమనించాలి. ఈ కారు లాంఛ్ ఊహించిన విధంగా జరిగితే, JSW మోటార్స్ టాటా మోటార్స్, మహింద్రా తర్వాత మూడవ భారతీయ ప్యాసింజర్ వాహన తయారీదారుగా అవతరిస్తుంది.

ఇకపోతే చైనీస్ మార్కెట్లో "చెరీ ఐకార్ V23"ను మిడ్ సైజ్ ఎలక్ట్రిక్ SUVగా విక్రయిస్తున్నారు. దీని వీల్ బేస్ 2,735mm, పొడవు 4,220mm, వెడల్పు 1,915mm, ఎత్తు 1,845mm ఉంటుంది. అయితే భారత మార్కెట్ కు వస్తున్న వెర్షన్​కు సంబంధించిన తుది స్పెసిఫికేషన్ల వివరాలపై ఇంకా సమాచారం అందుబాటులో లేదు.

దీని కొలతలు అలాగే ఉంటే, ఈ SUV భారతీయ మార్కెట్‌లోని మిడ్‌సైజ్ EV SUV విభాగంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇది నిజం అయితే, ఈ విభాగంలో విన్​ఫాస్ట్ VF6, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మారుతి e-విటారా, MG ZS EV, టాటా కర్వ్ EV వంటి కార్లకు గట్టి పోటీని ఇవ్వగలదు.

కారు పవర్‌ట్రెయిన్ ఎలా ఉంటుంది?: గ్లోబల్ మార్కెట్లలో, "చెరీ ఐకార్ V23" రెండు పవర్‌ట్రెయిన్ ఎంపికలతో అమ్ముడవుతోంది. దీని రియర్​-వీల్-డ్రైవ్ వెర్షన్ 59.93 kWh బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగిస్తుంది. ఇది 136 hp, 180 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో దీని ఆల్-వీల్-డ్రైవ్ వేరియంట్ 211 hp, 292 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది పెద్ద 81.76 kWh బ్యాటరీని కలిగి ఉంటుంది.

ఇక రేంజ్ విషయానికి వస్తే, చెరీ తన RWD మోడల్ 401km, AWD వెర్షన్ దాదాపు 510km CLTC రేంజ్​ను అందిస్తుందని పేర్కొంది. దీని RWD వెర్షన్ కేవలం 11 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలిగితే, AWD వెర్షన్ కేవలం 7.5 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ రెండు వెర్షన్ల టాప్​ స్పీడ్ గంటకు 140 కిలోమీటర్లు.