ETV Bharat / technology

ఫ్లాగ్​షిప్ 'వన్​ప్లస్ 13S'ను పోలిన డిజైన్​తో ఐటెల్ స్మార్ట్​ఫోన్- రూ. 6,799లకే!

స్మార్ట్​ఫోన్ తయారీ సంస్థ ఐటెల్ రూ. 6,799 ప్రారంభ ధర, 100 రోజుల వరకు ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్​తో బడ్జెట్-ఫ్రెండ్లీ విభాగంలో తన కొత్త "ఐటెల్ A100 4G" మోడల్​ను భారతదేశంలో విడుదల చేసింది.

Itel A100 4G Launched in India
Itel A100 4G Launched in India (Photo Credit- X/@Itel India)
author img

By ETV Bharat Tech Team

Published : February 10, 2026 at 3:27 PM IST

2 Min Read
Choose ETV Bharat

Hyderabad: ఐటెల్ భారత మార్కెట్లో తన A-సిరీస్​లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీని పేరు 'ఐటెల్ A100 4G'. ఈ ఫోన్​ను 2025లో విడుదలైన వన్​ప్లస్ ఫ్లాగ్​షిప్ "వన్​ప్లస్ 13S" మోడల్‌ను పోలిన డిజైన్‌తో తీసుకొచ్చింది. కంపెనీ దీన్ని ఈ సెగ్మెంట్​లో మోస్ట్​ బ్యూటిఫుల్ ఫోన్​గా చెబుతోంది. ఈ ఫోన్ MIL-STD-810H సర్టిఫికేషన్‌తో మిలిటరీ-గ్రేడ్ మన్నికను అందిస్తుందని పేర్కొంది.

ఇది 4GB వరకు RAM కలిగిన UniSoc T7100 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 8MP కెమెరా, 5000mAh బ్యాటరీ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. రూ. 6,799 ప్రారంభ ధరతో లాంఛ్ అయిన ఈ ఫోన్ బడ్జెట్-ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వారికి గొప్ప ఎంపిక అని చెప్పవచ్చు. ఈ కొత్త ఫోన్​ను కొనుగోలు చేసే ముందు మీరు తెలుసుకోవలసిన ఐదు కీలక ఫీచర్లతో పాటు ధర వివరాలను పరిశీలిద్దాం రండి.

Itel A100 4G
Itel A100 4G (Image credit: X/@Itel India)

ఐటెల్ A100 4G ధర, లభ్యత: భారత మార్కెట్లో ఈ ఐటెల్ A100 4G రెండు RAM అండ్ స్టోరేజ్​ కాన్ఫిగరేషన్​లో లభిస్తుంది. వాటిలో మొదటి 3GB RAM, 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.6,799. ఇక రెండవ 4GB RAM, 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,499.

కలర్ ఆప్షన్లు: ఇది సిల్క్ గ్రీన్, ప్యూర్ బ్లాక్, టైటానియం గోల్డ్ అనే మూడు రంగు ఎంపికలలో లభిస్తుంది.

ఆసక్తి ఉన్నవారు ఈ ఫోన్​ను భారతదేశంలోని రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయొచ్చు. కంపెనీ దీనికి 100 రోజుల వరకు ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్‌ను కూడా ఆఫర్ చేస్తోంది.

Itel A100 4G
Itel A100 4G (Image credit: X/@Itel India)

Itel A100 4G కీలక ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:

డిస్​ప్లే: ఇది 90Hz రిఫ్రెష్ రేట్, 269PPI పిక్సెల్ డెన్సిటీ, 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.6-అంగుళాల (720 x 1,612 పిక్సెల్స్) HD+ IPS LCD స్క్రీన్‌ను కలిగి ఉంది.

ప్రాసెసర్: ఈ ఫోన్ 4GB వరకు RAM, 64GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్​తో ఆక్టా-కోర్ UniSoC T7100 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 8GB వరకు వర్చువల్ RAM విస్తరణకు కూడా మద్దతు ఇస్తుంది.

కెమెరా: ఇది LED ఫ్లాష్‌తో 8MP వెనుక కెమెరా, 5MP ముందు కెమెరాను కలిగి ఉంది.

బ్యాటరీ, ఛార్జింగ్: ఈ కొత్త "ఐటెల్ A100 4G" ఫోన్ 10W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్​ చేసే 5,000mAh బ్యాటరీని అందిస్తుంది.

కనెక్టివిటీ: ఈ హ్యాండ్‌సెట్‌లోని కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, బ్లూటూత్, Wi-Fi, GPS, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, IR బ్లాస్టర్, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: ఐటెల్ A100 4G డ్యూయల్ నానో-సిమ్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా itel OS 15 పై నడుస్తుంది. ఇది నెట్‌వర్క్ కవరేజ్ లేని ప్రాంతాల్లోని ఇతర ఐటెల్ వినియోగదారులకు కాల్స్ చేయడానికి వినియోగదారులను అనుమతించే "UltraLink" ఫీచర్‌ను కలిగి ఉంది. ఇది IPX4 స్ప్లాష్ రెసిస్టెన్స్, MIL-STD-810H మిలిటరీ స్టాండర్డ్ సర్టిఫికేషన్‌ను కూడా అందిస్తుంది.