ETV Bharat / technology

5,000 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్​నెస్​తో "ఐకూ 15R"- సూర్యకాంతిలో కూడా స్క్రీన్ స్పష్టంగా కన్పిస్తుంది!

ఐకూ 15R డిస్​ప్లే ఫీచర్లు, IP రేటింగ్‌లతో పాటు ఇతర కీలక స్పెసిఫికేషన్‌ల వివరాలు భారత్​లో​ లాంఛ్​కు ముందే వెల్లడయ్యాయి.

iQOO 15R
iQOO 15R (Photo Credit- iQOO)
author img

By ETV Bharat Tech Team

Published : February 11, 2026 at 10:41 AM IST

3 Min Read
Choose ETV Bharat

Hyderabad: చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఐకూ ఫ్లాగ్‌షిప్ లైనప్‌లో రెండవ మోడల్‌గా "ఐకూ 15R"ను ఫిబ్రవరి 24న భారతదేశంలో ప్రారంభించనుంది. దీనిలో భాగంగా కంపెనీ ఈ స్మార్ట్​ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లను టీజ్ చేస్తూ వస్తోంది. తాజాగా కంపెనీ ఇప్పుడు ఈ అప్​కమింగ్ స్మార్ట్​ఫోన్ డిస్​ప్లే, కనెక్టివిటీ ఎంపికలు, ఇన్‌గ్రెస్ ప్రొటెక్షన్ (IP) రేటింగ్‌ల గురించి అదనపు వివరాలను వెల్లడించింది.

ఐకూ 15R స్క్వేర్ ఆకారపు మాడ్యూల్ లోపల అమర్చిన డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉందని నిర్ధారించింది. లాంఛ్ అనంతరం ఈ ఫోన్ ప్రత్యేకంగా ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ సందర్భంగా ఈ స్మార్ట్​ఫోన్​పై ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారంపై ఓ లుక్కేద్దాం రండి.

ఐకూ 15R ఫీచర్లు, స్పెసిఫికేషన్లు: ఈ ఫోన్ 1.5K రిజల్యూషన్‌తో AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. దీని అత్యంత ప్రత్యేకత ఏంటంటే ఇది 5,000 నిట్‌ల వరకు లోకల్ పీక్ బ్రైట్‌నెస్​ను అందిస్తుంది. అంటే ప్రకాశవంతమైన సూర్యకాంతిలో కూడా మనకు ఫోన్ స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. అదనంగా HDR10+ సపోర్ట్ కూడా ఇందులో లభిస్తుంది. ఇది మీ వీడియో వీక్షణ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది.

దీని కనెక్టివిటీ ఎంపికలలో బ్లూటూత్ 6, Wi-Fi 7, NFC, USB టైప్-C పోర్ట్, ఇన్‌ఫ్రారెడ్ బ్లాస్టర్ ఉన్నాయి. భద్రత కోసం, ఇది అల్ట్రాసోనిక్ 3D ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ వాటర్, డస్ట్ రెసిస్టెన్సీ కోసం IP68, IP69 రేటింగ్‌ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది.

This phone is equipped with Snapdragon 8 Gen 5 along with iQOO Q2 supercomputing chip and network enhancement chip.
This phone is equipped with Snapdragon 8 Gen 5 along with iQOO Q2 supercomputing chip and network enhancement chip. (Photo Credit- iQOO)

పనితీరు పరంగా "ఐకూ 15R" క్వాల్కమ్ 3nm స్నాప్‌డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది AnTuTuలో 3.5 మిలియన్లకు పైగా స్కోర్‌ను సాధించినట్లు కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్ ఐకూ Q2 సూపర్‌కంప్యూటింగ్ చిప్, నెట్‌వర్క్ ఎన్‌హాన్స్‌మెంట్ చిప్‌తో కూడా వస్తుంది. ఇది గేమింగ్, నెట్‌వర్క్ పనితీరును మెరుగుపరుస్తుంది.

ఫోన్‌లో వేడిని నియంత్రించేందుకు 6.5K ఐస్‌కోర్ VC కూలింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. ఇది 10 నిమిషాల్లో ఉష్ణోగ్రతను దాదాపు 15 డిగ్రీల సెల్సియస్ తగ్గించగలదు. వీటన్నింటికీ మించి ఈ ఫోన్ అత్యంత ప్రత్యేక ఫీచర్లలో మరొకటి దాని బ్యాటరీ వ్యవస్థ. ఐకూ 15R 100W ఫాస్ట్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్‌ సపోర్ట్​తో భారీ 7,600mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్​తో ఈ ఫోన్ గంటల తరబడి గేమింగ్, వీడియో వీక్షణ, సోషల్ మీడియా వినియోగానికి సిద్ధంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది.

ఐకూ 15R వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. దీని మెయిన్ కెమెరాలో 50MP సోనీ LYT-700V సెన్సార్, OIS మద్దతు ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారంగా OriginOS 6 పై నడుస్తుంది. కంపెనీ దీనికి నాలుగు సంవత్సరాల పాటు OS అప్‌డేట్‌లు, ఆరు సంవత్సరాల భద్రతా అప్‌డేట్‌లను అందిస్తామని హామీ ఇస్తోంది.

కలర్ ఆప్షన్లు: కంపెనీ ఈ అప్​కమింగ్ ఫోన్‌ను డార్క్ నైట్, ట్రయంఫ్ సిల్వర్ అనే రెండు రంగు ఎంపికలలో విడుదల చేయనుంది.

ధర వివరాలు?: ప్రస్తుతానికి కంపెనీ "ఐకూ 15R" స్మార్ట్​ఫోన్​కు సంబంధించి పైన పేర్కొన్న వివరాలను మాత్రమే వెల్లడించింది. దీని ధర, ఆఫర్లతో పాటు ఇతర అధికారిక సమాచారం కోసం లాంఛ్ సమయం వరకు వేచి ఉండాల్సిందే!