ETV Bharat / technology

టచ్-బేస్డ్ షోల్డర్ ట్రిగ్గర్​లతో 'ఐకూ 15 అల్ట్రా'- గేమింగ్ ప్రియులకు పండగే!

ఐకూ 15 అల్ట్రాలో హాప్టిక్ ఫీడ్‌బ్యాక్‌తో కూడిన టచ్-ఆధారిత షోల్డర్ ట్రిగ్గర్‌లు ఉంటాయని వెల్లడైంది. ఆ వివరాలు మీకోసం!

iQOO 15
iQOO 15 (Photo Credit- iQOO)
author img

By ETV Bharat Tech Team

Published : January 26, 2026 at 3:01 PM IST

2 Min Read
Choose ETV Bharat

Hyderabad: ఫ్లాగ్‌షిప్ ఐకూ 15 ఉన్నత శ్రేణి మోడల్ అయిన "ఐకూ 15 అల్ట్రా" వచ్చే నెలలోనే మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో కంపెనీ దీనిలోని కొన్ని కీలక ఫీచర్లు, స్పెసిఫికేషన్లను వెల్లడిస్తూ కస్టమర్లలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. తాజాగా ఈ ఫోన్ సపోర్ట్ చేసే ఒక కీలక గేమింగ్ ఫీచర్‌ను కంపెనీ అధికారి ఒకరు వెల్లడించారు. గేమింగ్ సమయంలో మెరుగైన నియంత్రణ, అధికంగా లీనమయ్యే అనుభవం కోసం ఇది కెపాసిటివ్ టచ్-బేస్డ్ షోల్డర్ ట్రిగ్గర్‌లతో వస్తుందని చెబుతున్నారు. ఇంకా ఈ ఫోన్ ఇన్‌పుట్ ఆలస్యం సమస్యలను పరిష్కరించడానికి స్వతంత్ర నియంత్రణ చిప్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ఐకూ 15 అల్ట్రా గేమింగ్ ఫీచర్లు:

వీబో పోస్ట్‌లో, ఐకూ ప్రొడక్ట్ మేనేజర్ గాలంట్ వి (translated from Chinese) iQOO 15 అల్ట్రా కీలక గేమింగ్ ఫీచర్లను పంచుకున్నారు. ఈ సమాచారం ప్రకారం, ఈ అప్​కమింగ్ హ్యాండ్‌సెట్ గేమింగ్ పెర్ఫార్మెన్స్ అండ్ కంట్రోల్​పై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. టచ్ ఆధారిత షోల్డర్ ట్రిగ్గర్‌లు ఫ్రేమ్ ఎడమ, కుడి ఎడ్జ్​లపై ఉంటాయి.

షోల్డర్ ట్రిగ్గర్‌లు మ్యాపింగ్ సామర్థ్యాలకు మద్దతు ఇస్తాయని నిర్ధారించారు. ఇది గేమర్‌లు వారి ప్రాధాన్యతల ఆధారంగా కాంబోలు, షార్ట్‌కట్ ఫంక్షన్‌లను సృష్టించడానికి వీలు కల్పిస్తుంది. దీనితో పాటు, ఐకూ 15 అల్ట్రా షోల్డర్ బటన్‌లు 600Hz శాంప్లింగ్ రేటుకు మద్దతు ఇస్తాయని భావిస్తున్నారు. ఇది గేమ్‌ప్లే సమయంలో వేగమైన, మరింత కచ్చితమైన ఇన్‌పుట్‌ను అందిస్తుంది.

లీనియర్ మోటారుతో నడిచే హాప్టిక్ ఫీడ్‌బ్యాక్ ఉన్నట్లు కూడా వెల్లడించారు. ఇది ఫిజికల్ షోల్డర్ ట్రిగ్గర్‌ల మాదిరిగానే స్పర్శ నిర్ధారణను అందించే అవకాశం ఉంది. మెరుగైన నియంత్రణ, అధిక కచ్చితత్వం కోసం, కంపెనీ దీనిలో "యాంటీ-స్వెట్" అల్గోరిథంను ఉపయోగిస్తుంది. చివరగా, షోల్డర్ ట్రిగ్గర్‌లు డ్యూయల్ ఇండిపెండెంట్ చిప్‌ల ద్వారా శక్తిని పొందుతాయి. ఇవి సూచన​లను విడిగా ప్రసారం చేస్తాయి. కంపెనీ ప్రకారం, ఇది ఇన్‌పుట్ ఆలస్యాన్ని కనిష్ఠ స్థాయికి తగ్గిస్తుంది.

కలర్ ఆప్షన్లు: ఈ అప్​కమింగ్ ఐకూ 15 అల్ట్రా 2077 (బ్లాక్), 2049 (సిల్వర్) రంగులలో లభిస్తుందని ధృవీకరించారు. ఐకూ ప్రొడక్ట్ మేనేజర్ గతంలో ఈ హ్యాండ్‌సెట్ AnTuTu బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫామ్‌లో సాధించిన స్కోర్‌లకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను పంచుకున్నారు. దాని ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్ మొత్తం పనితీరులో 45,18,403 పాయింట్లు, CPU పనితీరులో 13,22,001 పాయింట్లు, GPU పనితీరులో 15,94,848 పాయింట్లు సాధించింది. అయితే, ఈ ప్రాథమిక ఫలితాలు iQOO అంతర్గత పరీక్షల నుంచి వచ్చినవని కంపెనీ అధికారి స్పష్టం చేశారు. ఈ ఫోన్ ఫిబ్రవరిలో చైనా మార్కెట్​లో విడుదల కానుందని ఇప్పటికే ప్రకటించారు.